Viral Video: Monkey Walks on Two Legs Then Jumps in the Funniest Way - Sakshi
Sakshi News home page

Viral Video: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే

Published Wed, Apr 13 2022 6:24 PM | Last Updated on Wed, Apr 13 2022 7:51 PM

Viral Video: Monkey Walks on Two Legs Then Jumps in The Funniest Way - Sakshi

కోతి.. ఈ పేరు వినగానే అందరికి అది చేసే అల్లరే గుర్తుకు వస్తుంది. అందుకే పిల్లలు అల్లరి చేస్తే వారిని కోతి చేష్టలు అంటారు. కోతులు వేటిని కుదురుగా ఉంచవు. అన్నింటినీ కిందపడేసి, అటూ ఇటూ పరుగెత్తుతాయి. కుదురుగా ఒక చోట ఉండవు. నానా హంగామా చేస్తాయి. కోతుల చేష్టలు ఎక్కువగా మనుషులను పోలి ఉంటాయి. మనుషులు ఏం చేస్తే అవి వాటిని అనుకరిస్తాయి. తాజాగా ఓ కోతి చేసిన వినూత్న పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చెరువు పక్కన ఉన్నరోడ్డుపై వెళ్తున్న కోతి అచ్చం మనిషిలాగా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని నేచర్‌ లైఫ్‌ పేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోతి ఒక సరస్సు సమీపంలోని రోడ్డుపై ఒక వ్యక్తిలాగా రెండు కాళ్లపై మీద దర్జాగా నడుస్తూ కనిపిస్తుంది. దీనిని చూస్తుంటే ఎంతో స్టైల్‌గా క్యాట్‌ వాక్‌ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అనంతరం బ్రిడ్జిపైకి దూకి దానిపై చకాచకా గెంతుతుంది.
చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే

ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో ఇప్పటి వరకు మిలియన్‌కు పైగా వ్యూవ్స్‌ వచ్చాయి. ఇక కోతి స్టైల్‌ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కోతి మోడల్‌గా మారి ర్యాంప్‌ వాక్‌ చేస్తుంది. బాడీ బిల్డింగ్‌ పోటీలకు రెడీ అవుతుందేమో.. మంచి ట్రైనింగ్‌ ఇచ్చారు’. అంటూ ఫన్నీ కామెంట్స్‌  చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement