
ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ రాకపై భారత ప్రధాని మోదీ స్పందించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని మోదీ అన్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్‌ను మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోకు అందించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ లేఖలో..‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అద్వితీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాను’ అంటూ సునీతకు లేఖ రాశారు.
ఈ క్రమంలో మోదీ లేఖపై సునీతా విలియమ్స్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆమె సోదరి ఫాల్గుని పాండ్యా మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడం ఆనందంగా ఉంది. త్వరలో భారత్‌లో పర్యటిస్తారు. మేమందరం కలిసి టూర్‌కు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇదే సమయంలో సునీత మరోసారి అంతరిక్ష యాత్ర చేపడతారా? అని ప్రశ్నించగా.. అది ఆమె ఎంపిక అని చెప్పుకొచ్చారు. అనంతరం, మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

#SunitaWilliams & #ButchWilmore's Homecoming
We are very excited for her to come back. Although we never felt we were far away from her because we were constantly in communication with her...: Falguni Pandya, Sunita Williams' cousin, speaks to @MadhavGK@TheNewsHour AGENDA pic.twitter.com/LKBN9iFuRY— TIMES NOW (@TimesNow) March 18, 2025
Comments
Please login to add a commentAdd a comment