తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ చెక్ పెట్టారు. తాజాగా, తన ఆరోగ్యంగా బాగుందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం సునీతా విలియమ్స్ బక్కచిక్కిన ముఖం కనిపించారు. ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో విలియమ్స్ ముఖంలో మార్పులు కనిపించాయి. ఆరోగ్యం సైతం కుదుట పడినట్లు అర్ధమవుతుంది.
అంతరిక్షంలోని బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్ , బుచ్ విల్‌మోర్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లారు. పని పూర్తి చేసుకుని కొన్ని రోజుల వ్యవధి తర్వాత తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.
కానీ వ్యోమగాముల్ని తీసుకెళ్లిన బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాలు వచ్చే ఏడాది వరకు స్పేస్‌లో ఉండనున్నారు.
అయితే స్పేస్‌లో మైక్రోగ్రావిటీ కారణంగా సునీతా విలియమ్స్ శరీరంలో ఎర్రరక్తకణాలు క్షీణించాయి. దీంతో సునీతా విలియమ్స్ ముఖం బక్కిచిక్కపోవంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తిరిగి సాధారణ స్థితికి రావాలంటే పౌష్టికాహారం తప్పని సరి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సునీతా విలియమ్స్ అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా ఆహారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఆరోగ్యం కుదుట పడి సాధారణ స్థితికి వచ్చారు.
తాజాగా, సునీతా విలియమ్స్ షేర్ చేసిన ఫొటోతో ఆమె ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలకు పులిస్టాప్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment