
నాసా స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అవుతున్నట్లు గమనించామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని నాసా వర్గాలు వెల్లడించాయి.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, బోయింగ్‌తో కలిసి స్టార్‌లైనర్ క్యాప్యుల్ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు అంతరిక్ష సిబ్బందిని, కార్గోను చేరవేస్తారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొద్దికాలంగా ఈ ప్రయోగం వాయిదా పడుతోంది. మే7న ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రయోగం ప్రారంభంకానున్న కొన్నిగంటల ముందు అట్లాస్ బూస్టర్‌లో సమస్య గుర్తించారు. దాంతో మొదట వాయిదాపడింది. ఈ అట్లాస్ రాకెట్‌ను యునైటెడ్ లాంచ్ అలయన్స్, బోయింగ్‌కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్తంగా తయారుచేశారు.
ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఇటీవల అన్ని సమస్యలు పరిష్కరించామని ప్రకటించిన ఇరు సంస్థలు తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి హీలియం లీక్ అవ్వడాన్ని గుర్తించారు. దాంతో రెండోసారి ఈ ప్రయోగం పోస్ట్‌పోన్ అవుతున్నట్లు నాసా ప్రకటించింది. ఈ సందర్భంగా నాసా ప్రతినిధులు మాట్లాతుడూ..‘ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అయినట్లు గుర్తించాం. సిస్టమ్ పనితీరు, రిడెండెన్సీని అంచనా వేస్తున్నాం. మిషన్ అధికారులు సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. తదుపరి ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment