భూమ్మీదకు తిరిగొచ్చే ముందు సునీతా విలియమ్స్‌.. | Sunita Williams And Butch Wilmore Final Photo Op At Space Station Before Leaving For Earth Goes Viral | Sakshi
Sakshi News home page

భూమ్మీదకు తిరిగొచ్చే ముందు సునీతా విలియమ్స్‌..

Published Tue, Mar 18 2025 12:11 PM | Last Updated on Tue, Mar 18 2025 1:02 PM

Sunita Williams Final Photo Op At Space Station Before Leaving For Earth

నాసా విడుదల చేసిన ఫోటో

భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్,  అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి తిరిగి భూమ్మీదకు చేరే సమయం ఎంత సేపో లేదు. ఇప్పటికే  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు చ చివరిగా అక్కడ దిగిన ఫోటో ఒక్కటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను నాసా విడుదల చేసింది. వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేసింది.

ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్షం కేంద్ర నుంచి భూమ్మీదకు బయల్దేరిన సునీతా- బుచ్‌ లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెప్టెంబర్‌ లో  ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్‌ హేగ్‌ (అమెరికా), అలెగ్జాండర్‌ గుర్బనోవ్‌ (రష్యా) కూడా స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్‌తో పాటే తిరిగి వస్తున్నారు. 

 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆ జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటా..

అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను అక్కడ నుంచే  షేర్‌ చేసుకున్నారు. 

‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నా‍ళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది.   ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స​ స్పష్టం చేశారు.

సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement