కల్పన మరణం.. నాసాకొక పాఠం | Kalpana Chawlas Death Affect NASAs Decision In Sunita Williams Case, More Details Inside | Sakshi
Sakshi News home page

సునీతా విలియమ్స్‌ రక్షణలో కల్పనను గుర్తు చేసుకుంటున్న​ నాసా

Published Sat, Aug 31 2024 10:11 AM | Last Updated on Sat, Aug 31 2024 11:01 AM

Kalpana Chawlas Death Affect Nasas Decision in Sunita Williams case

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్‌లు 2025 ఫిబ్రవరి నాటికి తిరిగివచ్చే అవకాశాలున్నాయని నాసా ప్రకటించింది. దీని ప్రకారం వారు ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఇప్పుడు సునీతా విలియమ్స్  ఉదంతం మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాను తలపిస్తోంది.  నాటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు నాసా తన ప్రయత్నాలు సాగిస్తోంది.

కల్పనా చావ్లా భారతీయ-అమెరికన్ వ్యోమగామి. వృత్తిరీత్యా ఇంజనీర్. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 1997లో ఎస్‌టీఎస్‌-87, 2003లో ఎస్‌టీఎస్‌-107 అనే రెండు స్పేస్ షటిల్ మిషన్లలో ప్రయాణించారు. అయితే 2023 ఫిబ్రవరి ఒకటిన రీ-ఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ కొలంబియా కూలిపోవడంతో కల్పనా చావ్లా ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. కొలంబియా ప్రమాదానికి ముందు 1986 జనవరి 28న స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలడంతో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.

కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం 1976లో హర్యానాలోని కర్నావ్‌లోని ఠాగూర్ బాల్ నికేతన్‌లో జరిగింది. కల్పన ఎనిమిదో తరగతిలో ఉండగా తాను ఇంజనీర్ కావాలనుకున్నారు. 1982లో పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. యుఎస్‌లో తదుపరి విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి కార్ప్స్‌లో చేరారు. 1997లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు.

సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అది ప్రమాదకరమేనని అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సహజంగానే సురక్షితమైనది. బుచ్‌, సునీతలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచడం, సిబ్బంది లేకుండానే బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ని కిందకు తీసుకురావాలనే నిర్ణయం భద్రతా పరంగా సరైనదే అని అన్నారు. స్పేస్‌ ఎక్స్‌ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల  రీత్యా వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సివస్తుంది. కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లను అత్యంత సురక్షితంగా తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు స్పేస్‌ ఎక్స్‌ సాయంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement