kalpana chawla
-
కల్పన మరణం.. నాసాకొక పాఠం
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్లు 2025 ఫిబ్రవరి నాటికి తిరిగివచ్చే అవకాశాలున్నాయని నాసా ప్రకటించింది. దీని ప్రకారం వారు ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఇప్పుడు సునీతా విలియమ్స్ ఉదంతం మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాను తలపిస్తోంది. నాటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు నాసా తన ప్రయత్నాలు సాగిస్తోంది.కల్పనా చావ్లా భారతీయ-అమెరికన్ వ్యోమగామి. వృత్తిరీత్యా ఇంజనీర్. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 1997లో ఎస్టీఎస్-87, 2003లో ఎస్టీఎస్-107 అనే రెండు స్పేస్ షటిల్ మిషన్లలో ప్రయాణించారు. అయితే 2023 ఫిబ్రవరి ఒకటిన రీ-ఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ కొలంబియా కూలిపోవడంతో కల్పనా చావ్లా ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. కొలంబియా ప్రమాదానికి ముందు 1986 జనవరి 28న స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలడంతో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం 1976లో హర్యానాలోని కర్నావ్లోని ఠాగూర్ బాల్ నికేతన్‌లో జరిగింది. కల్పన ఎనిమిదో తరగతిలో ఉండగా తాను ఇంజనీర్ కావాలనుకున్నారు. 1982లో పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. యుఎస్‌లో తదుపరి విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి కార్ప్స్లో చేరారు. 1997లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అది ప్రమాదకరమేనని అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సహజంగానే సురక్షితమైనది. బుచ్, సునీతలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచడం, సిబ్బంది లేకుండానే బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ని కిందకు తీసుకురావాలనే నిర్ణయం భద్రతా పరంగా సరైనదే అని అన్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సివస్తుంది. కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అత్యంత సురక్షితంగా తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు స్పేస్ ఎక్స్ సాయంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. -
తొలి మహిళలుగా సత్తా : వీరి గురించి తెలిస్తే మీరు ఫిదానే!
#InternationalWomen’sDay2024: ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలెదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులపై చర్చించి, మహిళా హక్కులు, సమాన్వతం తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ మహిళా దినోత్సవ ఉద్దేశం. ఈ సందర్భంగా మహిళల త్యాగాల్ని స్మరించు కుంటూ, వారి విజయాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతారు. స్త్రీ పురుష వివక్ష లేని సమసమాజమే ప్రపంచ మహిళల ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని ఏర్పరచుకుని శతాబ్దానికి పైగా దాటిపోయినా లింగ సమానత్వం, మహిళా సాధికారకత విషయంలో సాధించింది (కొంత పురోగతి ఉన్నప్పటికీ) అంతంత మాత్రమే. కానీ మనలోని ఆశల్ని రగుల్కొల్పి, పురుషులతో సమానంగా ముందుకు సాగేలా ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్న ధీర వనితలు చాలా మందే ఉన్నారు. తమ రంగాలలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. సంబంధిత రంగాలలో భావితరానికి మార్గదర్శకులుగా నిలిచారు. అలాంటి గొప్ప భారతీయ మహిళల్ని గురించి తెలుసుకుందాం. కల్పనా చావ్లా: అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయ సంతతి మహిళగా కల్పనా చావ్లా దేశానికే గర్వకారణం. 1997లో, ఆమె మిషన్ స్పెషలిస్ట్‌గా రోబోటిక్ ఆర్మ్‌కి ప్రైమరీ ఆపరేటర్‌గా పని చేస్తూ, స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణాన్ని ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ 2003లో జరిగిన అంతరిక్ష ప్రమాదంలో కన్నుమూయడం అత్యంత విషాదం. షీలా దావ్రే తొలి భారత మహిళా ఆటో-రిక్షా డ్రైవర్ కావాలనే ఆశయంతో పూణే పయమైన ధీరవనిత దావ్రే. చిన్నప్పటినుంచి కార్లు నడపడం అంటే పిచ్చి. పురుషుల ఆధిపత్యం కొనసాగే ఈ రంగంలో, మహిళా డ్రైవర్లు లేని సమయంలో ఆటోనడిపిన సాహసి ఆమె. కష్టపడి పని చేసి సొంత ఆటోను కొనుగోలు చేశారు. ఈమె అద్భుతమైన ప్రయాణం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. అరుణిమా సిన్హా: జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. విచిత్రకర పరిస్థితుల్లో, చోరీకి ప్రయత్నించిన దొంగలు ఆమెను రైలునుంచి బయటకు నెట్టివేయడంతో ఎడమ కాలు కోల్పోయింది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. కానీ ఈ విషాదంనుంచి తేరుకుంది. దృఢ నిశ్చయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విశేష ఘనతను సాధించింది. తొలి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా,ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తొలి భారతీయ వికలాంగురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో అవార్డు దక్కింది. ఆనందీబాయి గోపాలరావు జోషి: డాక్టర్ ఆనందీబాయి జోషి తొలి భారతీయ మహిళా వైద్యురాలు, ఆమె గౌరవార్థం వీనస్ క్రేటర్ "జోషీ" అని పేరు పెట్టారు. తొమ్మిదేళ్ల వయసులో తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన గోపాల్రావ్ జోషిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ చదివాలన్న కోరికకు భర్త సంపూర్ణ మద్దతు లభించడంతో విజయం సాధించి, రికార్డు క్రియేట్ చేశాడు. పద్నాలుగు ఏళ్ళ వయసులో కొడుకుకు జన్మనివ్వడం, ఆ బిడ్డ చనిపోవడం, తన అనారోగ్యం, ఆమెను మెడిసిన్‌లో చేరేలా ప్రేరేపించాయి. పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. తరువాత దేశానికి తిరిగొచ్చి ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో పనిచేశారు. సరళా థక్రాల్: 1914లో జన్మించిన సరళా థక్రాల్ 1936లో తన 21వ ఏట ఏవియేషన్ పైలట్ లైసెన్స్‌ని పొంది భారతదేశపు తొలి మహిళా పైలట్‌గా అవతరించారు. భారతదేశంలో చీర కట్టుకుని విమానం నడిపిన తొలి మహిళా పైలట్ థక్రాల్. కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది పైలట్లు, భర్త ఆమె కరియర్‌కు తొలి ప్రేరణ. ఆమె ఫైలట్ మాత్రమే కాదు విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా, చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. 2008 మార్చి 15న మరణించారు. హరితా కౌర్ డియోల్: 1971లో జన్మించిన హరితా కౌర్ డియోల్, భారత వైమానిక దళం (IAF)లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్. 1992లో, రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనల్లో మార్పులతో మహిళలను పైలట్లుగా చేర్చుకోవడానికి వీలు కల్పించింది. 20వేల మందికి పోటీలో నిలబగా ఎంపికైన 13 మందిలో హరిత ఒకరు. ఆమె కర్ణాటకలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో , యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని ఎయిర్ లిఫ్ట్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ (ALFTE)లో శిక్షణ పొందింది. సెప్టెంబర్ 2, 1994న, 22 సంవత్సరాల వయస్సులో, ఫ్లైట్ లెఫ్టినెంట్ హరితా కౌర్ డియోల్ అవ్రో HS-748లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది. శాంతి టిగ్గా: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలో ఆదివాసీ వర్గానికి చెందిన శాంతి టిగ్గా, బాల్య వివాహాల బాధితురాలు. ఇద్దరు పిల్లల వితంతువు తల్లి, భారత సైన్యంలో తొలి మహిళా జవాన్‌గా అవతరించారు ఆర్మీలో చేరి, సైన్య దుస్తులు ధరించాలనేది ఆమె కల. సాయుధ దళాల రిక్రూట్మెంట్ శిక్షణా శిబిరంలో ఆమె తన పురుష సహచరులను అధిగమించి, 1.5 కి.మీ పరుగును ఐదు సెకన్ల వేగంతో, 50 మీటర్ల పరుగును 12 సెకన్లలో పూర్తి చేసి పలువురి మన్ననలు పొందారు. తుపాకీ నిర్వహణలో కూడా నైపుణ్యంతో ఆకట్టుకుంది . ఉత్తమ ట్రైనీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అసాధారణ విజయాలకు గానీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఆమెను సత్కరించారు. కానీ దురదృష్టవశత్తూ 2013లో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కిడ్నాప్ చేయడం టిగ్గా జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. ఆమె కళ్లకు గంతలు కట్టి, రైల్వే ట్రాక్‌కు కట్టిపడేశారు. ఆమెను గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆ తరువాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతారు. భావనా కాంత్ : భావానా కాంత్ విమానయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిన గొప్ప భారతీయ మహిళ. డిసెంబర్ 1, 1987న బీహార్‌లోని దర్భంగాలో జన్మించిన ఈమె 2016లో భారత వైమానిక దళం (IAF)లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా అవతరించింది. ఈమె జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఫైటర్ పైలట్‌గా మారేందుకు అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొంది.అయినా లక్ష్యంపై దృష్టి. శిక్షణను పూర్తి చేసి తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. అడ్డంకులను, వివక్షల్ని ఎదుర్కొని, పట్టుదలతో విజయం సాధించిన ఇలాంటి మహిళలు కోకొల్లలు. అడ్డంకుల గోడల్న బద్దలుకొట్టి విజయపతాకాల్ని ఎగురవేసిన ఈ ధీర వనితలు మహిళా లోక బంగారు భవితకు బాటలు వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి విజయాలే యావత్ ప్రపంచ మహిళలకు స్పూర్తి, ప్రేరణ. దీన్ని అందిపుచ్చుకొని సాగడమే నేటి తరం మహిళల బాధ్యత. -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 20 ఏళ్లు!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి 20 ఏళ్లు నిండాయి. 1998 నవంబర్ 20న రష్యా రాకెట్ ద్వారా నింగికెగసిన ఐఎస్ఎస్ దశలదశలుగా విస్తరించి ఇప్పుడు ఓ ఫుట్‌బాల్ మైదానమంత సైజుకు చేరుకుంది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించాలన్న సంకల్పంతో రష్యా ఐఎస్ఎస్ నిర్మాణాన్ని మొదలుపెట్టినా.. అమెరికా, యూరప్, కెనడా, జపాన్ చేరికతో అసలు సిసలైన అంతర్జాతీయ పరిశోధన కేంద్రంగా అవతరించింది. అంతరిక్ష పరిస్థితులను అర్థం చేసుకునేందుకు.. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి తొలి మజిలీగా ఉపయోగపడుతుందన్న అంచనాతో సిద్ధమైన ఐఎస్ఎస్ విశేషాలు మరిన్ని.. 230 +2000 నవంబర్ నుంచి ఐఎస్ఎస్ను సందర్శించిన వ్యోమగాముల సంఖ్య!! భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి 1న ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తూండగా జరిగిన ప్రమాదంలో మరణించగా.. సునీతా విలియమ్స్ విజయవంతంగా తిరిగివచ్చారు. ఉన్న బెడ్రూమ్లు 6 భూమి నుంచి ఐఎస్ఎస్కు చేరేందుకు పట్టే సమయం కూడా 6 గంటలే అనుసంధానం కాగల రాకెట్ల సంఖ్య కూడా ఆరే! 2028 ఐఎస్ఎస్ జీవితకాలం ముగిసే సంవత్సరం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం. ఇందులో నాసా భాగం పది వేల కోట్ల డాలర్లు! 15000 బిల్షెపర్డ్ (అమెరికా), సెర్గీక్రికలేవ్, యూరీ గిడ్జెంకో (రష్యా) ఐఎస్ఎస్పై అడుగుపెట్టిన తొలి వ్యోమగాములు 4–6 నెలలు... వ్యోమగాములు ఇక్కడ గడిపిన సమయం 90 నిమిషాలు.. భూమిని చుట్టేసేందుకు ఐఎస్ఎస్కు పట్టే సమయం ఇది! ఇంకోలా చెప్పాలంటే ఇది గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూంటూ ఉంటుందన్నమాట! రాత్రివేళ ఆకాశంలో కనిపించే మూడో అతి ప్రకాశవంతమైన ఆకారం ఇదే! 16... అంతరిక్ష కేంద్రంలో భాగంగా ఉండే సోలార్ ప్యానెళ్ల సంఖ్య. వీటిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతోనే మొత్తం వ్యవహారాలు నడుస్తాయి. 1200 ఐఎస్ఎస్లో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రచురితమైన వ్యాసాలు! ఐఎస్ఎస్లో వ్యోమగాముల శరీరపు స్వేదం ఆవిరి కానే కాదు. దీంతో తరచూ టవళ్లను వాడాల్సి వస్తుంది. 1760 83 దేశాల శాస్త్రవేత్తలు రిమోట్ పద్ధతి ద్వారా నిర్వహించిన పరిశోధనలు. చిన్న చిన్న మరమ్మతులకు అవసరమైన పరికరాలను అక్కడికక్కడే ప్రింట్ చేసుకునేందుకు ఐఎస్ఎస్లో ఒక త్రీడీ ప్రింటర్ కూడా ఉంది. ఈ ప్రింటర్‌తో ఇప్పటి వరకూ ఒక రెంచ్తోపాటు 13 డిజైన్లతో కూడిన 20 వస్తువులను ముద్రించారు. 2001 ఏప్రిల్ 30న ఐఎస్ఎస్పై అడుగుపెట్టి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు.. డెన్నిస్ టిటో! సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అరుదైన ఘనత సాధించిన కరిష్మా
చంఢీఘర్ : మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆయుష్మాన్ భారత్’ ఫలితాలను పొందిన తొలి వ్యక్తిగా 18 రోజులు నిండిన కరిష్మా గుర్తింపు పొందింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చెప్పిన రెండు రోజులకే అనగా ఆగస్టు 17న హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, కల్పనా చావ్లా ఆస్పత్రిలో జన్మించిన కరిష్మా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద 9 వేల రూపాయల నగదుతో పాటు వ్యాక్సిన్లను ఉచితంగా పొందింది. ఈ నగదును అధికారులు ఆమె తల్లిదండ్రులకు అందించారు. ఈ విషయాన్ని ‘ఆయుష్మాన్ భారత్’ డిప్యూటీ సీఈవో డాక్టర్ దినేష్ అరోరా తన ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ఈ నెల 25 ప్రారంభమవ్వాల్సిన ఉన్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఓ 105 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ముందుగానే ప్రారంభించారు. అందులో భాగంగా హరియాణాలోని ఓ 26 ఆస్పత్రులను ఈ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎన్నుకున్నారు. వాటిలో కరిష్మా జన్మించిన కల్పనా చావ్లా ఆస్పత్రి కూడా ఉండటంతో సదరు చిన్నారి అందరి కంటే ముందే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రయోజానాన్ని పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆయుష్మాన్ భారత్’, ‘మోదీ కేర్’, ‘పీఎమ్‌జా’గా పిలవబడే ఈ పథకం సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ పండిట్ జయంతి సందర్భంగా దేశమంతటా అమల్లోకి రానుంది. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి ఈ పథకం వలకల లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. -
కల్పనా చావ్లా ‘అమెరికా హీరో’: ట్రంప్
వాషింగ్టన్: అంతరిక్ష కార్యక్రమానికి తన జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతి మహిళ కల్పనా చావ్లాను ‘అమెరికన్ హీరో’గా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ కొనియాడారు. ఆమె జీవితం వ్యోమగాములు కావాలనుకునే లక్షలాది మంది బాలికలకు స్ఫూర్తిదాయకమన్నారు. సోమవారం ట్రంప్ ‘ఆసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మంత్’గా మే నెలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీప వాసుల సేవలను గుర్తు చేసుకుంటామని అధికారి ఒకరు తెలిపారు. -
బాలీవుడ్ సినిమా అంగీకరిస్తుందా..?
చాలా రోజులుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా త్వరలో ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. వరుసగా హాలీవుడ్ సినిమాలతో టీవీ సీరిస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాజీరావ్ మస్తాని తరువాత ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. దీంతో ప్రియాంక బాలీవుడ్ సినిమాలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే పని మీద ముంబై చేరుకున్న ప్రియాంక చోప్రా మూడు రోజుల పాటు ఇక్కడ దర్శక నిర్మాతలతో చర్చలు జరపనున్నారు. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించాలన్న ప్లాన్‌లోనే ప్రియాంక ముంబై వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఈ ట్రిప్ లోనే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. మూడు రోజుల పాటు ముంబైలో గడపనున్న పీసీ తరువాత క్వాంటికో 3 సీరిస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్నారు. -
మొదటి ప్రయాణం
మనసులోని హద్దుల్ని చెరిపేసుకుంటే ఈ విశ్వంలోని ప్రేమంతా మన చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. కల్పనా చావ్లా రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. ఒకసారి మాత్రమే భూమి మీదకు తిరిగొచ్చారు! (మొదటిసారి 1997 నవంబరులో, రెండోసారి 2003 జనవరిలో) రెండోసారి ఆమె ప్రయాణిస్తున్న వ్యోమనౌక ‘కొలంబియా’ భూమి మీదకు తిరిగి వస్తుండగా ఫిబ్రవరి 1న పేలిపోయి, మిగతావాళ్లతో పాటు కల్పన చనిపోయారు. రెండో ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా మొదటి ప్రయాణం గురించి కల్పనను ఎవరో అడిగారు. ‘‘స్పేస్‌లోకి వెళ్లొచ్చాక జీవితం పట్ల మీ దృక్పథం మారిందా?’’ అని. ‘‘మారకుండా ఉంటుందా? ఈ అనంత విశ్వంలో మనం ఎంతటివాళ్లమో తెలుసుకున్నపుడు... వేటికోసమైతే నిత్యం మనమిక్కడ గొడవలు పడుతున్నామో అవి ఏమంత ప్రాముఖ్యమైనవి కావని తెలుస్తుంది’’ అన్నారు కల్పన. ‘మీకు ఇన్‌స్పిరిషన్ ఎవరు?’’ అని ఇంకొక ప్రశ్న. ‘‘ఒకరని ఎలా చెప్పడం! పని చేస్తూ కనిపించే ప్రతి ఒక్కరూ నాకు స్ఫూర్తిని ఇస్తారు. డ్యూటీ అవర్స్ దాటి పని చేసేవారు నన్ను మోటివేట్ చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండేవారు, నిరంతర అన్వేషకులు, గిరిగీసుకుని బతకనివారు, సర్వస్వాన్నీ పనికి ధారపోసేవారు.. వీరంతా నన్ను నడిపించేవారే’’ అని చెప్పారు కల్పన. కల్పన తొలి ప్రయాణంలో టకావ్ డోయి అనే మిషన్ స్పెషలిస్టు కూడా కల్పనతో ఉన్నారు. ‘మీ ఇండియన్స్‌కి నిగ్రహం ఎక్కువ కదా’ అనేవారట డోయి. కల్పన తన అయిష్టాన్ని, ఇబ్బందుల్నీ వ్యక్తం చేసేవారు కాదట. అందుకని ఆయన అలా అడిగేవారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ... నేను ఇండియనా? వ్యోమనౌక పైభాగంలో లైట్లను మసకబరిచి నక్షత్రాలను చూస్తూ కూర్చున్నప్పుడు నేను ఏ ఒక్క భూభాగానికో పౌరురాలిని కాదనిపించేది. నేనొక పాలపుంత పౌరురాలిననిపించేది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కల్పన. -
కాజల్ కల ఏంటో తెలుసా?
తమిళసినిమా: భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలాంటివి చదువుకునే రోజుల్లో బీజం పడుతుంది. అయితే చాలా మంది కోరుకున్న లక్ష్యం వైపు పయనించలేరు. అందుకు పరిస్థితులో, మరేదైనా కారణం కావచ్చు. ఇక సినీతారలు ఇందుకు అతీతం కాదు. అనుకున్నవన్నీ జరగవు కదా! కొందరు చిన్నతనం నుంచి నటి కావాలని ఆశపడుతుంటారు. మరి కొందరు వేరే రంగంలో రాణించాలని ఆశించి, అనూహ్యంగా సినిమారంగంలోకి ప్రవేశిస్తుంటారు. నటి కాజల్ అగర్వాల్ ఈ రెండవ కోవకు చెందిన నటేనట. తాను అనూహ్యంగానే నటినయ్యాను అంటోంది కాజల్ అగర్వాల్. అయితే చాలా మంది మాదిరిగానే తనకు జీవితంలో ఒక డ్రీమ్ ఉందని, అది నెరవేరలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడి డ్రీమ్ ఏమిటో తెలుసా? అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళగా కల్పనాచావ్లాలా తానూ అంతరిక్షంలోకి వెళ్లిరావాలని కలలు కన్నానని చెప్పింది. అయితే పరిస్థితుల ప్రభావం తనను నటిని చేశాయని అంది. అయితే నిజజీవితంలో నెరవేరని ఆ కలను నట జీవితంలోనైనా నెరవేర్చుకోవాలని ఆశగా ఉందని చెప్పింది. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని కాజల్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇక్కడ ఒక అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తెలుగు, హిందీ భాషల్లో బిజీగానే ఉంది. ఈ బ్యూటీ కలను నిజం చేయడానికి ఏ దర్శక, నిర్మాత ముందుకొస్తారో చూడాలి. -
కల్పన.. నా ప్రియ నేస్తం
వాషింగ్టన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ లో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి కల్పన చావ్లా సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధితోపాటు కొలంబియా వ్యోమనౌక ప్రమాద మృతుల స్మృతి చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. మోదీ విన్పపం మేరకు ఈ కార్యక్రమానికి చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత.. కల్పనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'కల్పన నా ప్రియ నేస్తం. గొప్ప స్నేహితురాలు. మార్గదర్శి కూడా. ఆమెతో మాట్లాడిన, గడిపిన సమయం నా జీవితంలో అత్యంత విలువైనదిగా భావిస్తాను. ఎవరైనాసరే ఆమెతో ఒక్క మాట మాట్లాడారంటే.. ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది' అంటూ కల్పన గురించి చెప్పుకొచ్చారు సునీత. ఇంకా.. 'ప్రధాని మోదీని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా నాన్న(దీపక్ పాండ్యా)తో కూడా మాట్లాడారాయన. నన్ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. నాకు కూడా ఇండియాకు రావాలని, నావాళ్లను కలుసుకోవాలని ఉంది' అని సునీత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాసా అసిస్టెంట్ డైరెక్టర్.. అంతరీక్ష పరిశోధనల్లో నాసా, ఇస్రోలు చక్కటి సహకారంతో ముందుకు పోతున్నాయన్నారు. -
ధ్రువతార
కలల దారి ఎప్పుడూ విజయం అనే గమ్యా నికే చేరుస్తుంది. అందుకే అందరూ కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేం దుకు ప్రయత్నిం చాలి. అవ రోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆ ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. - కల్పనా చావ్లా ఆమె సాధించిన విజయం ఊహలకు అందనిది. దిగంతాలకు ఆవల ఏముందో తెలుసుకోవాలని తపించిన ఆమె సాహసం మాటలకందనిది. ఆ సాహసం ఆమెను ప్రతి భారతీయుని మదిలో ఆకాశమంత ఎత్తులో నిలిపింది. అంత ఎత్తుకు ఎదిగిన ఆమే... కల్పనా చావ్లా. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు కల్పనాచావ్లా. ఆకాశం అవతల ఏముందో తెలుసుకోవాలని చిన్ననాటి నుంచే పరితపించిన ఆమె నక్షత్రాలను లెక్కపెడుతూ శూన్యంలోనే కలలకు గ్రాఫ్‌లు గీసుకునేవారు. ఆ కలలను నిజం చేసుకుంటూ మూడు పదుల వయసులో అంతరిక్షంలోకి వెళ్లారు. మిషన్ స్పెషలిస్టుగా కొలంబియా ఎస్టిఎస్-87 మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేసి వచ్చారు. అంతరిక్షంలో పాదం మోపిన కల్పన 376 గంటల పాటు అక్కడే గడిపి, భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్లు ప్రయాణించారు. దీంతో యావత్ ప్రపంచం ఆమెను ఓ అద్భుత నక్షత్రంగా కీర్తిస్తూ తల ఎత్తి సెల్యూట్ చే సింది. హర్యానాలోని కర్నాల్‌లో, ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారామె. నలుగురు సంతానంలో చిన్న. తండ్రి బనారసీలాల్ చావ్లా టైర్ల వ్యాపారంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, పట్టుదలతో రాణించారు. రాష్ట్రపతి అభినందనలందుకున్నారు. తండ్రి మాటలు, చేతలు కల్పన మనసులో బలంగా నాటుకుపోయాయి. లక్ష్యం ఏదైనా, దాన్ని అందుకోవాలంటే ఆటంకాలు తప్పవని తన జీవనయానంలో తెలుసుకున్నారు కల్పన. వాటిని అధిగమించేందుకు బాల్యం నుంచీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. చదువులో ఎప్పుడూ ముందుండే కల్పన ఇంటర్మీడియెట్ తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సు తీసుకోవాలనుకున్నారు. ఆడపిల్లలకు ఈ కోర్సు కష్టం, మరేదైనా ఎంచుకోమని అధ్యాపకులు నిరుత్సాహపరిచారు. అయితే, కల్పన వినలేదు. ‘ఇస్తే అందులో అవకాశమివ్వండి, లేదంటే ఇంటికి వెళ్లిపోతా’నని నిష్కర్షగా చెప్పారు. అధ్యాపకులు తలవంచక తప్పలేదు. డిగ్రీ చేతికి వచ్చాక పై చదువులకు అమెరికా వెళ్తానని తన కల గురించి చెప్పినప్పుడు ‘ఆడపిల్లవు.. పెళ్లి చేసుకొని స్థిరపడమ’న్నాడు తండ్రి. ఆయన్ని ఒప్పించి అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. పరిశోధనాకాలంలోనే తన అభిరుచులను గౌరవించే ఫ్రెంచ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, వైమానిక వ్యవహారాల రచయిత జీన్ పియెర్రా హ్యారిసన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొలరాడో యూనివర్శిటీలో డాక్టరేట్ పొందారు. కాలిఫోర్నియాలో పరిశోధనా శాస్త్రవేత్తగా అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. వైవిధ్య అంశాలను శోధించారు. ‘నాసా’కు కల్పనతో పాటు 2 వేల మంది పోటీ పడ్డారు. అంతమందినీ పరిశీలించిన నాసా 23 మందిని ఎంపికచేస్తే వారిలో కల్పనాచావ్లా ముందున్నారు. శిక్షణలో భాగంగా కొండలు ఎక్కుతూ, బరువులు మోస్తూ పురుషులకంటే తాను బలంలోనూ, ధైర్యంలోనూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారామె. కల్పన ప్రతిభను గుర్తించిన నాసా 1997లో అంతరిక్షయానానికి పంపింది. రెండవసారి ఎస్టిఎస్-87 ప్రయోగ బాధ్యతలను కల్పనకే అప్పజెప్పింది. అయితే స్పార్టన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి వదలగా, అది పనిచేయకపోవడంతో కల్పనపై అభియోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయినా కృంగిపోలేదు. ఐదు నెలల విచారణ జరిపిన నాసా సాఫ్ట్వేర్, విమానసభ్యులదే తప్పిదమని తెలుసుకుంది. చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత రెండోసారి అంతరిక్షయానం చేసే అవకాశం కల్పనకు లభించింది. కొలంబియా వ్యోమనౌకలో మరో ఆరుగురు వ్యోమగాములతో కలిసి 2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లారు కల్పన. 16 రోజుల అనంతరం తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వ్యోమనౌకలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సభ్యులతో పాటు కల్పనాచావ్లా ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసినా ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించారు మళ్లీ ఆకాశంలోకి పయనమైపోయారు. అయినా యావత్ ప్రపంచానికి తేజోవంతమైన నక్షత్రంలా ఎప్నటికీ భాసిల్లుతూనే ఉంటారు. - నిర్మలారెడ్డి -
అంతరిక్షంలో మన నక్షత్రం!
అది 2003వ సంవత్సరం జనవరి 16వ తేదీ. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌సెంటర్‌లో కౌంట్‌డౌన్ మొదలయింది. కొలంబియా అంతరిక్ష నౌక (స్పేస్ షటిల్) నింగిలోకి ఎగరడానికి సమయం దగ్గరపడుతోంది. క్రూ క్యాబిన్లో ఏడుగురు వ్యోమగాములు విజయకేతనం ఎగురవేస్తున్నట్లు బొటనవేలిని పైకి లేపారు. అలా పైకి లేచిన చేతుల్లో ఒకటి కల్పనాచావ్లాది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన. హర్యానాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కల్పన ఆలోచనలు ఎప్పుడూ అసాధారణంగానే సాగేవని చెప్పేది ఆమె తల్లి సంజ్యోతి చావ్లా. కల్పనకు కరాటే ఇష్టం, జుట్టును కత్తిరించుకోవడం ఇష్టం, ఫ్లయింగ్ ఇష్టం, తొలి భారతీయ పైలట్ జెఆర్‌డి టాటా ఆమె రోల్ మోడల్. ఆ కలలతోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)లో ఉద్యోగం సంపాదించారు. నాసాలో చేరిన రెండేళ్లకు... అది 1997 నవంబరు 19, కొలంబియా ఎస్టిఎస్- 87 వాహకనౌకలో కల్పన తొలిసారి అంతరిక్షయానం చేశారు. దాదాపు ఐదునెలలపాటు అంతరిక్షంలో సాగిన అధ్యయనంలో భాగంగా ఆమె పదకొండు మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 252సార్లు భూమిని చుట్టారు. తర్వాతి ప్రయాణం కొలంబియా ఎస్టిఎస్- 107 అంతరిక్షనౌకలో. ఇది కల్పన తొలి అంతరిక్ష పర్యటనలా నెలలపాటు సాగలేదు. నిండా పదిహేను రోజుల పర్యటన. జనవరి నెల పూర్తయింది. తిరిగి భూమిని చేరాల్సిన రోజు రానే వచ్చింది. అది ఫిబ్రవరి ఒకటవ తేదీ. కక్ష్య నుంచి భూవాతావరణంలోకి వస్తున్నామనే భావన వ్యోమగాములను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక 16 నిమిషాలలో భూమిని చేరాలి. ఇంతలో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లోని ఇంజనీర్లతో కొలంబియా స్పేస్‌షటిల్‌కి సిగ్నల్స్ తెగిపోయాయి. జరగకూడనిదేదో జరగనుందని గ్రహించేలోపే కొలంబియా అంతరిక్ష నౌకలో పేలుడు. గాల్లో సంభవించిన పేలుడు ఏడుగురు వ్యోమగాముల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ప్రపంచదేశాలకు ఇది సాంకేతిక లోపంగానే కనిపించింది. అమెరికాకు తమ విజ్ఞానం మీద సందేహం కలిగింది. భారత్‌కు మాత్రం బిడ్డను బలితీసుకున్న ప్రయాణంగా చేదును మిగిల్చింది. కర్నాల్ వాసులు ఇప్పటికీ ఆకాశాన్ని చూపిస్తూ ‘ఆ కనిపించే నక్షత్రమే మా కల్పన, ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది’ అంటారు మెరుస్తున్న కళ్లతో. హారిసన్ గురించి: కల్పన మరణానంతరం ఆమె జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకం పేరు ‘ద ఎడ్జ్ ఆఫ్ టైమ్’. ఆ పుస్తకాన్ని కల్పన చదువుకున్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆవిష్కరించారు. కల్పన బాల్యం గురించి ఆమెకు తెలిసిన వారందరితో మాట్లాడి ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు హారిసన్. కల్పనాచావ్లా గురించి... పుట్టిన తేదీ: 1962, మార్చి 17 సొంత ఊరు: కర్నాల్ (హర్యానారాష్ట్రం) అమ్మానాన్నలు: బనారసీలాల్ చావ్లా, సంజ్యోతి చావ్లా అక్కలు, అన్న: సునీత, దీప, సంజయ్ ప్రాథమిక విద్య: కర్నాల్‌లోని టాగూర్ పబ్లిక్ స్కూల్ ఉన్నత విద్య: చండీఘర్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, అమెరికా, ఆర్లింగ్టన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డి. కెరీర్: 1995 మార్చిలో నాసాలో వ్యోమగామిగా భర్త: జీన్ పీయరి హారిసన్(ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, కల్పనాచావ్లాకి స్కూబాడైవింగ్, హైకింగ్, లాంగ్ఫ్లయింగ్లలో శిక్షణ ఇచ్చారు), పెళ్లయింది-1988లో.