తమిళసినిమా: భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలాంటివి చదువుకునే రోజుల్లో బీజం పడుతుంది. అయితే చాలా మంది కోరుకున్న లక్ష్యం వైపు పయనించలేరు. అందుకు పరిస్థితులో, మరేదైనా కారణం కావచ్చు. ఇక సినీతారలు ఇందుకు అతీతం కాదు. అనుకున్నవన్నీ జరగవు కదా! కొందరు చిన్నతనం నుంచి నటి కావాలని ఆశపడుతుంటారు. మరి కొందరు వేరే రంగంలో రాణించాలని ఆశించి, అనూహ్యంగా సినిమారంగంలోకి ప్రవేశిస్తుంటారు. నటి కాజల్ అగర్వాల్ ఈ రెండవ కోవకు చెందిన నటేనట.
తాను అనూహ్యంగానే నటినయ్యాను అంటోంది కాజల్ అగర్వాల్. అయితే చాలా మంది మాదిరిగానే తనకు జీవితంలో ఒక డ్రీమ్ ఉందని, అది నెరవేరలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడి డ్రీమ్ ఏమిటో తెలుసా? అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళగా కల్పనాచావ్లాలా తానూ అంతరిక్షంలోకి వెళ్లిరావాలని కలలు కన్నానని చెప్పింది. అయితే పరిస్థితుల ప్రభావం తనను నటిని చేశాయని అంది. అయితే నిజజీవితంలో నెరవేరని ఆ కలను నట జీవితంలోనైనా నెరవేర్చుకోవాలని ఆశగా ఉందని చెప్పింది. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని కాజల్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇక్కడ ఒక అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తెలుగు, హిందీ భాషల్లో బిజీగానే ఉంది. ఈ బ్యూటీ కలను నిజం చేయడానికి ఏ దర్శక, నిర్మాత ముందుకొస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment