
వాషింగ్టన్: అంతరిక్ష కార్యక్రమానికి తన జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతి మహిళ కల్పనా చావ్లాను ‘అమెరికన్ హీరో’గా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ కొనియాడారు. ఆమె జీవితం వ్యోమగాములు కావాలనుకునే లక్షలాది మంది బాలికలకు స్ఫూర్తిదాయకమన్నారు.
సోమవారం ట్రంప్ ‘ఆసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మంత్’గా మే నెలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీప వాసుల సేవలను గుర్తు చేసుకుంటామని అధికారి ఒకరు తెలిపారు.