
రజనీకాంత్
మళ్లీ మళ్లీ వెళుతుంటారు రజనీకాంత్. ఎక్కడికి అంటే.. హిమాలయాలకు. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా మొదలుపెట్టే ముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళతారు. అక్కడ కొన్ని రోజులు ధ్యానం చేస్తారు. పలువురు భక్తులను, గురువులను కలుస్తారు. కొన్నాళ్లుగా రాజకీయాలు, రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కాలా’, ‘2.0’, కార్తీక్ సుబ్బరాజుతో చేయబోతున్న కొత్త సినిమాల కార్యకలాపాలతో బిజీగా ఉన్న రజనీ ‘బ్రేక్’ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే ‘స్పిరిచ్యువల్ జర్నీ’ కోసం. వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుంది. ఈరోజే రజనీ ప్రయాణం. సిమ్లా వెళ్లి, అట్నుంచి ధర్మశాల, ఆ తర్వాత రిషికేశ్ వెళ్లేట్లు ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఈ జర్నీ పూర్తయ్యాక కొత్త సినిమా జర్నీతో రజనీ బిజీ అవుతారట.
Comments
Please login to add a commentAdd a comment