గురువు ఆశ్రమానికి అగ్రహీరో | Rajinikanth Makes Brief Visit to Spiritual Guru's Ashram | Sakshi
Sakshi News home page

గురువు ఆశ్రమానికి అగ్రహీరో

Published Thu, May 28 2015 9:32 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

గురువు ఆశ్రమానికి అగ్రహీరో - Sakshi

గురువు ఆశ్రమానికి అగ్రహీరో

చెన్నై: ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కోయంబత్తూరుకు వచ్చి ఆయన ఆధ్మాత్మిక గురువు దయానంద సరస్వతీ ఆశీర్వాదం అందుకున్నారు. తొలుత చెన్నై విమానంలో వచ్చిన ఆయన ఆ వెంటనే శరవేగంగా గురువు దయానంద ఆశ్రమానికి వెళ్లి దీవెనలు అందుకున్నారు. అనంతరం ఆయన వద్ద గంటపాటు గడిపారు. గురువుగారి ఆరోగ్య విషయాలు వాకబు చేశారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేసినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. రిషికేశ్లో ప్రతి ఏడాది దయనంద సరస్వతిని కలుస్తారని, అయితే ఈ సారి అక్కడికి వెళ్లలేని కారణంగా నేరుగా ఆశ్రమానికి వచ్చి కలిసి ఆధ్మాత్మిక అంశాలు తెలుసుకున్నారని ఆశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement