పరిపూర్ణ ప్రేమ
ఆత్మీయం
ప్రేమ ఒకటే. అయితే పంచడంలోనే తేడా ఉంది. ప్రేమను మన పూర్వికులు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పారు. మొదటిది సాధారణ ప్రేమ. నేను బాగుండాలి అంతే. ఇతరుల గురించి వీరు ఆలోచించరు. రెండోది సమంజస ప్రేమ. నేను బాగుండాలి. నాతో పాటు నువ్వు బాగుండాలని కోరుకునే ప్రేమ. ఇది కొంత వరకు సమంజసమే. చివరిది సమర్థ ప్రేమ.
ఇతరుల బాగుకోసం ఈ ప్రేమలో వారి వ్యక్తిగతంగా ఏమైనా ఫర్వాలేదు. ఈ ప్రేమ పంచిన వారిలో మనకు గాంధీ, మదర్«థెరిసా, వివేకానందుడు కనిపిస్తారు. కనుక సమర్థ ప్రేమ మనల్ని చిరంజీవులుగా నిలుపుతుంది. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే, వారిలో లోపాలు మనకు కనిపించవు. ఏది చేసినా సరిగానే అనిపిస్తుంది. పరిపూర్ణమైన ప్రేమ అంటే అదే.