
వృత్తి నిబద్ధతతోనే గుర్తింపు
► కరీంనగర్‌ను మరిచిపోలేం
► ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర పాఠశాల సంచాలకులు ప్రసాద్, మూడు జిల్లాల డీఈఓలు
కరీంనగర్ : వృత్తి నిబద్ధతతోనే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎస్.శ్రీనివాసాచారి, కందిమల్ల లింగయ్యలు అన్నారు. కరీంనగర్‌లోని భగవతి పాఠశాలలో ఆదివారం తెలంగాణ పాఠశాలల విద్యా ఉద్యోగు ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీఈవో రాజీవ్‌తోపాటు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ పనిచేసిన ఉద్యోగ ధర్మం పాటిస్తే గౌరవప్రదంగా జీవించవచ్చన్నారు. తాము పనిచేసిన కాలంలో జిల్లాలో చేపట్టిన విద్యా సంబంధిత కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు నెలకొల్పడంతో ఉమ్మడి రాష్ట్రం లోనే కరీంనగర్ జిల్లా ముందున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కిందిస్థారుుకి తీసుకెళ్లడంతో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎం.నర్సింహస్వామి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ పాఠశాలల విద్య ఉ ద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎ.రవీందర్‌రాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్‌వీ రమ ణ, జె.భగవాన్‌రెడ్డి, నాయకులు ఎస్.వేణుమాధవ్, ఎస్.సురేందర్, జి.నాగార్జునచారి, కె.ఎస్ రాబర్ట్, సుగుణాకర్, రాజేశ్వరి, శ్రీధర్, మహేశ్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కటుకం రమేశ్, నూలి మురళీధర్‌రావు, రవీంద్రచారితో పాటు తదితరులు పాల్గొన్నారు.