శరీరాన్ని, మనస్సును కలిపే కేంద్రబిందువే ముద్ర. అందుకే మన పెద్దలు ముద్రలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు.
శరీరాన్ని, మనస్సును కలిపే కేంద్రబిందువే ముద్ర. అందుకే మన పెద్దలు ముద్రలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. శరీరానికి, మనస్సుకు మధ్య సామ్యాన్ని కుదిర్చి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించే ఈ ముద్రలను వేయడం ఎన్నోవిధాల మేలు కలిగిస్తుంది. ఒక్కోరకంగా వేస్తే ఒక్కోరకమైన ఫలితాలనిస్తాయి ముద్రలు. వీటిలో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. ముద్రలకు సంబంధించి ఏకంగా ఒక శాస్త్రమే ఉంది. ఆధ్యాత్మిక గురువు స్వామి మైత్రేయ ‘ముద్రాశాస్త్ర రహస్యాలు’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. అవసరమైన చోట అందమైన బొమ్మలతో... ముద్రలు ఎలా వేయాలో వేళ్లు పట్టుకుని మరీ నేర్పించినట్లు ఉండే ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకరమైనది.
ముద్రాశాస్త్ర రహస్యాలు
రచన: స్వామి మైత్రేయ
పుటలు: 184; వెల రూ. 190
ప్రతులకు: శ్రీమతి కేబీ లక్ష్మి, 17-141,
శ్రీ నిలయం, కమలానగర్, దిల్‌సుఖ్‌నగర్,
హైదరాబాద్- 60.
- దోర్బల వి.ఆర్.