
అలా అంటే ముఖాన ఉమ్మేస్తారు: సీపీఐ నారాయణ
పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తదితరులు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రవీంద్రకుమార్ సహా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలు ఫిరాయించేటపుడు తేలు కుట్టిన దొంగల్లా మూసుకుపోవాలని ఆయన హితవు పలికారు.
అంతేతప్ప.. తాము అభివృద్ధి కోసమే పార్టీ మారానని దొంగ కొంగ జపం చేసినా, తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అంటే.. ముఖాన ఉమ్మేస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్‌లతో పాటు దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్‌లో చేరిన నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.