సీపీఐ కార్యదర్శిగా మరోసారి చాడ | telangana cpi new committee announced in hanamkonda | Sakshi
Sakshi News home page

సీపీఐ కార్యదర్శిగా మరోసారి చాడ

Published Wed, Nov 30 2016 7:37 PM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

సీపీఐ కార్యదర్శిగా మరోసారి చాడ - Sakshi

సీపీఐ కార్యదర్శిగా మరోసారి చాడ

హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. గతంలో సహాయ కార్యదర్శిగా ఉన్న పల్లా వెంకటరెడ్డిని కొనసాగించడంతో పాటు కొత్తగా మరో సహాయ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావును ఎన్నుకున్నారు.

బుధవారం హన్మకొండలో ముగిసిన రాష్ట్ర పార్టీ నిర్మాణ మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. మొత్తం 31 మందితో రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు సహాయ కార్యదర్శిగా ఉన్న సిద్ధి వెంకటేశ్వర్లు అనారోగ్య కారణంతో వైదొలిగారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో సీనియర్ సభ్యుడిగా ఉన్న అజీజ్ పాషా తనంతట తానుగా ఆ బాధ్యతల నుంచి వైదొలగగా జాతీయపార్టీలో అదనంగా కొన్ని బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా గుండా మల్లేష్, ఈర్ల నరసింహ, పశ్యపద్మలను కొనసాగిస్తూ కొత్తగా ఎం.ఆదిరెడ్డి, టి.శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్‌లకు అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement