
ఏలూరు రామచంద్రరావుపేటలో శంకరమఠం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : అది నగరం నడిబొడ్డులోని గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. నగరానికి చెందిన దాత సంస్థను ఏర్పాటుచేసి ఎకరాలకు ఎకరాల భూమి రాసిచ్చా రు. సంస్థ బాగోగులు చూసుకోవడానికి ధర్మకర్తలను నియమించారు. ట్రస్టీలుగా ఉన్న ఆ ధర్మకర్తలే సంస్థ భూములను తె గనమ్మేసి దాత ఆశయానికి తూట్లు పొడిచారు. ఏలూరులోని శంకరమఠం ఆస్తులపై కన్నేసి అన్యాక్రాంతం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
ఏలూరు రామచంద్రరావు పేటలో శంకర మఠం అనే ఆధ్యాత్మిక సంస్థను 1946లో నగరానికి చెందిన వడ్లమన్నాటి సుందరమ్మ అనే దాత స్థాపించారు. సం స్థ నిర్మాణం, అభివృద్ధి కోసం సుమారు 18 ఎకరాల భూమిని అదే సంవత్సరం ఫిబ్రవరి 2న ట్రస్ట్ డీడ్ రాసి రిజిస్ట్రేషన్ చేయించారు. మఠం నిర్వహణ కోసం ధ ర్మకర్తలను నియమించారు. శంకర మఠానికి తన పేరు పెట్టాలని, ఏలూరులో ప ర్యటించే పీఠాధిపతులు, వారి శిష్య పరి వారం కోసం ఆశ్రమం నిర్మించాలని, వా రికి భోజన సదుపాయాలు కల్పించాలని విల్లు రాసి ధర్మకర్తల చేతిలో పెట్టారు. శంకర మఠం నిర్మాణంలో ఉండగానే ఆ మె మరణించారు. శంకర మఠాన్ని కొంతకాలం బాగానే నిర్వహించిన ధర్మకర్తలు, దాత సుందరమ్మ వారసుల పర్యవేక్షణ లేకపోవడంతో విల్లులో ఉన్న నిబంధనల ను తమకు అనుకూలంగా మార్చుకుని సంస్థ ఆస్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మఠం అభివృద్ధిని వదిలేశారు.
దాత ఇచ్చిన ఆస్తులివే..
దాత సుందరమ్మ రాసిన విల్లు ప్రకారం రామచంద్రరావుపేట పడమర ‘ఈ’ వా ర్డులోని టౌన్ సర్వే 87,88, 146 నంబర్లలోని 3.06 ఎకరాల భూమిలోనే శంకరమఠం నిర్మించారు. దీని అభివృద్ధి కోసం 1948లో పత్తేబాద మోతే నరసింహరావు తోటకు పశ్చిమంగా (అశోక్‌నగర్ ప్రాం తం) ఉన్న 8.32 ఎకరాల తమలపాకు తోటను రాసి ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ చేయిం చారు. అలాగే 1949 జనవరి 4న పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలోని 295వ నంబర్ పట్టాలో దక్షిణం వైపు ఉన్న, తనకు చెందిన మరో 8 ఎకరాల భూమిని కూడా శంకర మఠం అభివృద్ధి కోసమే రాసి విల్లు రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు తన వంట మనిషి జాలమ్మ అనే మహిళ తనకు సేవలు చేస్తుండటం తో మెచ్చి సత్యవోలులోని 295 నంబర్ పట్టాలో 2 ఎకరాల భూమిని 1949లోనే రాసి ఆమె జీవిత కాలం అనుభవించవచ్చని, ఆమె మరణానంతరం ఆ భూమి కూడా శంకర మఠానికే చెందుతుందని వి ల్లు రిజిస్టరు చేయించారు. ఇవన్నీ తాను ధర్మకర్తగా నియమించిన ఈదర వెంకట్రావు చేతిలో పెట్టారు. శంకర మఠం అభివృద్ధికి తాను రాసిన భూములను అవసరం మేరకు విక్రయించుకోవచ్చని విల్లులో పేర్కొన్నారు.
సుందరమ్మ ఆశయానికి తూట్లు
శంకర మఠం అభివృద్ధి చేసి దానికి తన పేరు పెట్టాలని కోరిన దాత సుందరమ్మ ఆశయానికి ధర్మకర్త తూట్లు పొడిచారు. మఠానికి ఆమె పేరు పెట్టి మఠంలో ఆమె ఫొటో పెట్టగా అవి ప్రస్తుతం కనుమరుగైపోయాయి. అలాగే మఠం అభివృద్ధి కోసం అవసరమైతే విక్రయించుకోవచ్చు అనే పాయింటు ఆధారంగా ధర్మకర్త త మలపాకు తోటలోని 8.32 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా మార్చి, సత్యవోలులోని 8 ఎకరాల భూమిని కూడా విక్రయించేశా రు. దాంతోపాటు శంకర మఠం ఉన్న 3.06 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మ ఠం ఉన్న భూమి 581.77 చదరపు గజా లు మినహా మిగిలిన భూమిని అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు.
బంగారు, వెండి ఆభరణాలు కూడా..
శంకర మఠానికి దాత సుందరమ్మ పలు బంగారు, వెండి ఆభరణాలు కూడా సమర్పించారు. 1970లో సుందరమ్మ కోడలు రాజేశ్వరి ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరిం చే నాటి సంస్థ భూములు అన్యాక్రాంతమయ్యాయని, బంగారు, వెండి ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఇదిలా ఉండగా 1972 లో శంకరమఠం దేవాదాయశాఖ పరిధి లోకి వెళ్లింది. ఈ సందర్భంలో సెక్షన్ 38 ప్రకారం తయారు చేసిన దస్త్రంలో రాజేశ్వరి ఈ అంశాలను లిఖిత పూర్వకంగా ప్రస్తావించారు. అయినా దేవాదాయశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో 1990లో ఈదర వెంకట్రావు మనుమడు ఈదర వెంకటరమణ ప్రసాద్ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్నారు.
వంట మనిషికి రాసిన భూమి కూడా..
1990 నుంచి ధర్మకర్తగా ఉన్న వెంకటరమణ ప్రసాద్ దాత సుందరమ్మ వంట మనిషికి అనుభవ హక్కు, అనంతరం శంకర మఠానికి చెందేలా విల్లు రాసి ఉ న్న సత్యవోలులోని భూమిని విక్రయిం చారు. ప్రస్తుతం ఈ భూమి ఎకరం రూ. 50 లక్షలకు పైగానే పలుకుతోంది. విల్లులో విక్రయిం చుకునే హక్కు కల్పించిన దాదాపు 20 ఎకరాల భూమిని ముందుగానే అమ్మివేసిన ధర్మకర్తలు అనంతరం వారి వారసునికి విల్లు అప్పగించగా, విల్లులో విక్రయపు హక్కులు లేవని స్పష్టంగా రాసి ఉన్నా రమణప్రసాద్ అమ్మడం విమర్శలకు దారి తీసింది.
నానమ్మ ఆశయాల కోసం పోరాడతాం
ఏలూరు ప్రజలకు ఆధ్యాత్మికతను పంచడానికి మా నాయనమ్మ శంకర మఠం నిర్మించి, దాని అభివృద్ధికి భూములను రాసిచ్చారు. ధర్మకర్తలు వాటిని అమ్ముకోవడం దారుణం. నానమ్మ ఆశయాలు నెరవేర్చడానికి, శంకర మఠాన్ని అభివృద్ధి చేయడానికి కృషిచేస్తాం. దేవాదాయశాఖ అధికారులు మఠం అభివృద్ధికి సహకరించాలి.
– వడ్లమన్నాటి వెంకట లక్ష్మీ సీతారాం, దాత సుందరమ్మ మనుమడు
క్రయవిక్రయాలకు తావులేకుండా చేశాం
శంకర మఠానికి చెందిన కొన్ని భూములు అమ్మివేసినట్టు మా దృష్టికి వచ్చింది. మిగిలిన ఆస్తులను విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం శంకరమఠం ఉన్న 581.77 గజాల స్థలాన్ని క్రయవిక్రయాలకు తావులేకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో 22ఏ(1)(సి) చేయిం చాం. దాత సుందరమ్మ ఆశయాల మేరకు శంకరమఠాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ