ఆధ్యాత్మిక పాఠాలతో బిజీ!
నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు. ఒవేరియన్ కేన్సర్ సోకి, చికిత్స చేయించుకున్న ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. గత రెండు, మూడేళ్లలోని పరిణామాలు ఆమెను ఆధ్యాత్మిక బాట వైపు నడిపించాయని చెప్పక తప్పదు. వాస్తవానికి కేన్సర్ సంగతి బయట పడకముందే మనీషా ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టేవారు. కాకపోతే ఇప్పుడు మరింత ఉద్ధృతంగా ఆ వైపు వెళుతున్నారు. చెన్నయ్ శివార్లలో ఆశ్రమం ఉన్న ఓ గురువు గారి బోధనలకు మనీషా ఆకర్షితులయ్యారు. ఈ మధ్య ఎక్కువగా ఆమె అక్కడే గడుపుతున్నారు. అక్కడే ఆమె ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతున్నారట. ధ్యానం, జపం విలువలను కూడా పిల్లలకు బోధిస్తున్నారట.