ధర్మసాగర్ : పోలీసు అమరుల త్యాగాల స్ఫూర్తితో పని చేస్తూ, సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర రావు సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిర్వహించిన ఎస్సై యూ.సంజీవ్ స్మారక తెప్పపోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో సీఐగా పనిచేసినప్పడు ప్రజలు బయటకు రావాలంటే జంకేవారన్నారు.
ఈ ప్రాంతంలో ఎస్సైగా సేవలందించిన దివంగత సంజీవ్‌ను ఇక్కడి ప్రజలు ఎప్పటకీ మరిచిపోరన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నా రు. ధర్మసాగర్ వరంగల్‌కు సమీపంలో ఉన్నం దున రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాజీపేట డీఎస్పీ రాజిరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీలు సంజీవ్ స్మార కంగా నిర్వహించటంతో ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లయిందన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అమరులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటి ంచారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన గంగపుత్ర, ముదిరాజ్ సంఘ పెద్దలకు ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాఘవేందర్ జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొలిపాక రజిత, ఉపసర్పంచ్ మాచర్ల జ్యోతి, ముదిరాజ్ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పాక ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తెప్ప పోటీల్లో విజేతలు వీరే..
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిర్వహించిన తెప్పపోటీల్లో కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని ముదిరాజ్, గంగపుత్ర కులస్తులు 40 మంది పాల్గొన్నారు. నాలుగు రౌండ్లలో ఈ పోటీలు నిర్వహించారు. విజయం సాధించిన పన్నెండు మందితో చివరి రౌండ్ నిర్వహించారు. పోటీ ల్లో ప్రథమ బహుమతి ధర్మసాగర్‌కు చెందిన ముప్పారపు రవి, ద్వితీయ బహుమతి ముప్పారపు దుర్గ రాజు, తృతీయ బహుమతిని ముప్పారపు కనకరాజు గెల్చుకున్నారు. ప్రథ మ బహుమతిగా రూ.5 వేల నగదు, షీల్డ్, ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు, షీల్డ్, తృతీయ బహుమతిగా రూ.2 వేలు, షీల్డ్‌ను విజేతలకు అందించారు.
అమరుల స్ఫూర్తితో పని చేయాలి
Published Mon, Oct 20 2014 3:48 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
Advertisement