Peace and security
-
అప్రమత్తంగా ఉండాలి!
న్యూఢిల్లీ/ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ప్రజల భద్రత, తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా వరుసగా రెండో రోజు సోమవారం సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని, ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని అమిత్ షా ఈ సందర్భంగా ఆదేశించారు.మణిపూర్‌లో కేంద్ర బలగాల మోహరింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటిదాకా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌కు 50 కంపెనీల బలగాలు మణిపూర్‌కు అదనంగా 50 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్(సీఏపీఎఫ్) బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బలగాల్లో 5,000 మందికిపైగా సిబ్బంది ఉంటారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాష్ట్రంలో భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అదనపు బలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 20 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలను మణిపూర్‌కు పంపించింది. ఇందులో 15 సీఆర్పీఎఫ్, ఐదు బీఎస్ఎఫ్ కంపెనీలు ఉన్నాయి. మరో వారం రోజుల్లోగా అదనంగా 50 కంపెనీలను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ(కోకోమీ) నేతృత్వంలో నిరసనకారులు కర్ఫ్యూ నిబంధనలను ధిక్కరిస్తూ సోమవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకు నిరసనగా వారు తాళాలు వేసే కార్యక్రమం చేపట్టారు. కోకోమీకి మైతేయిల్లో బలమైన పట్టుంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను మరో రెండు రోజులపాటు నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పారీ్ట(ఎన్పీపీ) మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచి్చన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. -
అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్ ఆ సభలో డిమాండ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు బాధ్యత బాబుదే కదా..! హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
‘ఐఎన్ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్‌గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి రాజ్‌నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్‌లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, కలెక్టర్ డా.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంధాయక్ షిప్ విశేషాలు ► నాలుగు భారీ సర్వే వెసల్స్ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళానికి షిప్‌ని అప్పగించారు. ► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్ మైళ్లు. ► 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. ► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు. ► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది. ► అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటర్ బోట్స్, డిజిటల్ సైడ్ స్కానర్ సోనార్, రిమోట్ ఆపరేటింగ్ వెహికల్స్ ఇందులో ఉంటాయి. ► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. ► అండర్ వాటర్ వెహికల్స్, వెపన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ► సముద్రజలాల సర్వే మ్యాప్ కోసం అవసరమైన మల్టీ బీమ్ ఎకో సౌండర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్ షిప్గాను సేవలందించగలదు. ► పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ పాత్రల్ని కూడా సంధాయక్ సులువుగా నిర్వర్తించగలదు. ► సంధాయక్ నౌకకు మొదటి కమాండింగ్ అధికారి కెప్టెన్ ఆర్.ఎం.థామస్. దేశీయంగానే సబ్మెరైన్ల తయారీ అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్‌లో సంధాయక్ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్‌లు, సబ్మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఇండియన్ నేవీ చీఫ్ -
అమెరికాలో నేరాలు తగ్గించిన బుద్ధుడు!
అమెరికాలో ఒకప్పుడు నేరాలకు పేరుమోసిన ప్రాంతం అది. చుట్టుపక్కల జరిగే నేరాలకు విసిగి వేసారిన ఒక పెద్దమనిషి ఒక బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి, జనసంచారం బాగా ఉండే రహదారి పక్కన పెట్టాడు. అక్కడే బుద్ధుడి కోసం ఒక చిన్న ఆలయం నిర్మించాడు. రహదారి పక్కన బుద్ధుడిని నెలకొల్పిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ విడ్డూరం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ నగరం ఈస్ట్‌లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈస్ట్‌లేక్ ప్రాంతంలో పదిహేనేళ్ల కిందటి వరకు తరచు నేరాలు జరిగేవి. దుండగులు వీథుల పక్కనే ప్రమాదకరమైన వస్తువులను పడేసేవారు. తరచు చోరీలకు తెగబడుతుండేవారు. ఈ పరిస్థితులతో బాగా విసిగిపోయిన డాన్ స్టీవెన్సన్ అనే పెద్దమనిషి స్థానికంగా ఉన్న ఒక దుకాణం నుంచి బుద్ధుడి విగ్రహాన్ని కొనుక్కొచ్చి, వీథి పక్కనే పెట్టాడు. బుద్ధుడికి నీడ కల్పించడానికి చిన్న గుడి కట్టాడు. ఇదంతా 2009లో జరిగింది. క్రమంగా జనాలు ఇక్కడి బుద్ధుడిని దర్శించుకుని, ప్రార్థనలు జరపడం మొదలైంది. అప్పటి నుంచి ఈస్ట్‌లేక్ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి క్రైమ్ రికార్డ్స్‌ను గమనిస్తే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య 82 శాతం మేరకు తగ్గిపోయినట్లు స్థానిక పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇంతకీ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టిన డాన్ స్టీవెన్సన్ బౌద్ధుడు కాదు సరికదా, మతాలపై విశ్వాసమే లేని నాస్తికుడు కావడం విశేషం. మొత్తానికి పోలీసులు చక్కదిద్దలేని పనిని బుద్ధుడు చక్కదిద్దాడు. -
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా యత్నాలు: తలసాని
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిన్న వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించే వారుంటారని, వారు ఇబ్బంది పడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఎం కేసీఆర్ పాలన అందించారని గుర్తు చేశారు. కావాలనే కొంతమంది కుట్రలకు దారితీశారనే విషయాన్ని మేధావులు గమనించాలని విన్నవించారు. పాఠశాల నుంచే దేశభక్తిని పెంపొందించాలి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామన్నారు. గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను తలసాని సన్మానించారు. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
ఒంగోలు సబర్బన్: ‘రాష్ట్రంలో శాంతి, భద్రతలు భేషుగ్గా ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. పోలీసుల మీద ఆరోపణలు వచ్చినా నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులు కూడా నమోదు చేస్తున్నాం’.. అని డీజీపీ డి.గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ప్రకాశం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా సీఎం వైఎస్ జగన్ హోంగార్డులకు జీతాలు పెంచినట్టు చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్ సేవా యాప్‌ను రూపొందించామన్నారు. డీజీపీ వెంట అడిషనల్ డీజీపీ శ్రీధరరావు, డీఐజీ వెల్ఫేర్ పాల్‌రాజ్, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, నెల్లూరు ఎస్పీ ప్రకాష్ భూషణ్ తదితరులున్నారు. -
శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం
కోల్‌కతా: శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశమని, దానితో గవర్నర్‌కు సంబంధం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకంటూ గవర్నర్ కేసరీనాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై మమత గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘గవర్నర్ ప్రయత్నం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని మమత ఆరోపించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినందునే ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశానికి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థ చటర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కాంగ్రెస్, సీపీఎం రాష్ట్ర నేతలు సోమేన్ మిత్రా, సూర్య కాంత మిశ్రా హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం మమత పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్ మజుందార్ అన్నారు. జూ.డా.ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం వెనుక రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం, బీజేపీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీపీఎం సాయంతో వైద్యుల సమ్మెకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. -
‘బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సమర్ధవంతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని ఏపీ శాంతి భద్రతల అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నగదు ప్రభావం ఉండే 116 నియోజకవర్గాలను గుర్తించామని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఆయన.. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, అందుకోసం ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 1.06 లక్షల మంది పోలీసులు, 392 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 45 కంపెనీల ఏపీఎస్పీ ఫోర్స్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్లలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారులు ఉంటారని రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. -
మోదీ వస్తున్నా శాంతి మాత్రం రాలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ను శనివారం సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి అభివృద్ధి మంత్రం పఠించారు. ‘అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి ఒక్కటే కశ్మీర్ కల్లోలానికి పరిష్కారం’ అని ఆయన వ్యాఖ్యానించారు. లేహ్ రోడ్డులో లడక్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన జోజిల్లా భూగర్భ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన మోదీ, జమ్మూలో ఓ విద్యుత్ ప్రాజెక్టు, ఓ రింగ్ రోడ్డును, కశ్మీర్లో ఓ సెమీ రింగ్ రోడ్డును, కిషన్ గంగ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రంజాన్ సందర్భంగా సైనిక కాల్పుల విరమణ ప్రకటన కూడా మోదీ చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి రైలు సర్వీసును ప్రారంభించిన విషయాన్ని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా దాల్ సరస్సులో ఓ ఐదేళ్ల బాలిక చెత్తను ఏరివేయడాన్ని, మొదటిసారి రాళ్లు విసిరిన యువకులకు క్షమాభిక్ష ప్రసాదించిన ప్రస్తావించిన నరేంద్ర మోదీ ‘భారత్ మాతా’ నినాదాన్ని కూడా ప్రస్థావించారు. కానీ ఆయన రాక సందర్భంగా కశ్మీర్లో ఇంటర్నెట్ను పూర్తిగా బ్లాక్ చేశారు. ఆయన అభివృద్ధికి చిహ్నాలుగా పేర్కొన్న పెద్ద పెద్ద రోడ్లు, మంచి ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా మూతపడి ఉన్నాయి. ప్రధాని రాక సందర్భంగా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతామని కశ్మీర్ వేర్పాటు వాదులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసింది. మోదీకి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈసారి కశ్మీర్ అభివృద్ధికి నరేంద్ర మోదీ మరో 25వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. ఆయన 2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చి భారీ నష్టం వచ్చినప్పుడు కశ్మీర్‌ను సందర్శించి 80 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అందులో ఇంతవరకు 20వేల కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రకటించిన మొత్తం సొమ్ములో 22 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టినట్లు పార్లమెంటరీ కమిటీ కూడా ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. 2016లో మోదీ కశ్మీర్‌ను సందర్శించినప్పుడు యువకుల చేతుల్లో రాళ్లు కాదు ఉండాల్సిందీ, లాప్‌టాప్‌లు అని పిలుపునిచ్చారు. 2017లో కశ్మీర్‌ను సందర్శించినప్పుడు టెర్రరిజమ్ కాదు, టూరిజాన్ని ఆశ్రయించండి అని హితవు చెప్పారు. కశ్మీర్ సమస్యకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారం అని చెబుతూ వచ్చిందీ ఒక్క మోదీయే కాదు, గత ప్రభుత్వాలన్నీ ఇదే చెబుతు వచ్చాయి. యూపీఏ నాయకులు కూడా కశ్మీర్ వచ్చి పలు రైల్వే, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి వెళ్లారు. రైళ్లు వచ్చాయి. ఇంతవరకు శాంతి మాత్రం రాలేదు. -
కశ్మీర్లో భద్రత బలగాలను పెంచాలి
న్యూఢిల్లీ: శాంతి భద్రతల దృష్ట్యా జమ్మూకశ్మీర్‌లో మరింత బలగాలను పెంచాల్సిన అవసరముందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్యూ రీసర్చ్ సెంటర్ భారత్‌లో చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడించింది. సర్వే ప్రకారం.. 63 శాతం మంది ప్రజలు కశ్మీర్లో భద్రతా బలగాలను పెంచాలని భావిస్తున్నారు. 64 శాతం మంది ప్రజలు పాక్‌పై వ్యతిరేకంగా ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 9 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో ఈ సర్వేను నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 2,464 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. పాతపెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుందని 10 మందిలో ఎనిమిది మంది చెప్పారు. -
సిటీ హ్యాపీ
ఫలించిన నగర పోలీసుల వ్యూహం ∙ప్రశాంతంగా కొత్త ఏడాది వేడుకలు ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31 957 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు సిటీబ్యూరో: కొత్త ఏడాది సిటీకి ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగాయి. ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా నమోదై అందరికీ సంతోషాన్ని మిగిల్చింది. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ అధికారులూ శనివారం రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్లో నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకునే వారు సైతం ఇతరులకు ఇబ్బందులు కలుగజేయకుండా చర్యలు తీసుకున్నారు. మద్యం అమ్మకాలు సైతం సగానికి పడిపోయాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం.. వంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్త నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పురా, సనత్‌నగర్ వంటి కొన్ని ఫ్లైఓవర్‌కు మాత్రమే మినహాయింపునిచ్చారు. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల వాహనాలను అనుమతించలేదు. పీవీ నర్సిహారావు ఎక్స్‌ప్రెస్ వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. జంట కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. వాహన చోదకుల వేగానికి కళ్లేం వేశారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా ముగిసింది. శనివారం తెల్లవారుజాము 2 గంటల తరవాత ఫ్లై ఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్రోడ్లోను సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. తాగి ఇలా చిక్కారు.. ఇయర్ ఎండ్ నైట్ సిటీలో మహిళలతో సహా 957 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కారు. ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ ఉల్లం«ఘనకు సంబంధించి 27, ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు సంబంధించి 16, ఓవర్ స్పీడింగ్‌పై 31, ట్రిబుల్ రైడింగ్ 37 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ చీఫ్ జితేందర్ తెలిపారు. మొత్తమ్మీద 2016లో 17,051 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయగా.. వీరిలో 7,505 మందికి జైలు శిక్ష పడిందని, ‘నిషా’చరుల నుంచి రూ.3.15 కోట్లు జరిమానాగా వసూలైందని చెప్పారు. గత ఏడాది చిక్కిన వారిలో 13 మంది మహిళలు సైతం ఉన్నారని ఆయన తెలిపారు. కేక్ కట్ చేసిన కొత్వాల్.. సిటీ పోలీసు విభాగం తరఫున నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేట్ కట్ చేశారు. ఏటా మాదిరిగానే హుస్సేన్‌సాగర్ సమీపంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ట్రాఫిక్ చీఫ్ జితేందర్, డీసీపీలు ఏవీ రంగనాథ్, చౌహాన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సిబ్బంది విధులకు పునరంకితమై ప్రజల మన్నన పొందాలని పిలుపునిచ్చారు. వేడుకల ప్రశాంతంగా పూర్తి కావడం వెనుక సమిష్టి కృషి ఉందని ఆయన ఆదివారం పేర్కొన్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజల సహకారం సైతం ఎంతో ఉందని ఆయన కొనియాడారు. 100 షీ–టీమ్స్‌తో పాటు మరో 50 ట్రాఫిక్ పోలీసు బృందాలు నిరంతరాయంగా విధులు నిర్వర్తించాయని తెలిపారు. -
మంచి పోలీసింగ్‌తో భరోసా
సీపీకి సీఎం దిశానిర్దేశం విజయవాడ సిటీ : ‘రాజధాని పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు బాగుండాలి. మంచి పోలీసింగ్‌ను ఏర్పాటు చేయండి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన పోలీసింగ్‌తో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయనే భరోసా కల్పించాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు దిశానిర్దేశం చే శారు. రాష్ట్ర పోలీసు అధికారులతో ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కమిషనరేట్‌లోని పోలీసుల విధి విధానాలపై సీపీ సవాంగ్‌ను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. అమరావతి రాజధాని శంకుస్థాపన తర్వాత ప్రపంచ దేశాలు ఇక్కడ దృష్టిసారించినట్టు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఇక్కడ నూతన పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించారు. బీటు సిస్టం మొదలు అన్ని విధాలుగా పోలీసు సిబ్బంది సమర్థులై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయనే భరోసా ఇచ్చినప్పుడే ఆకర్షితులైనవారు వచ్చి ఆనందంగా పరిశ్రమలు పెడతారని చెప్పారు. ఈ క్రమంలో నగర పోలీసు వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యలను పోలీసు కమిషనర్ సవాంగ్ సీఎంకి వివరించారు. పోలీసు విధులు, సేవలను డిజిటలైజేషన్‌కు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. -
పోలీసు ఠాణాలు ఖాళీ
పుష్కరాల బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు రాత్రి గస్తీలు కరువు ఇదే అదనుగా జిల్లాలోకి వస్తున్న తమిళ దొంగలు తిరుపతి: జిల్లాలోని పోలీసు స్టేషన్లు ఖాళీ అయ్యాయి. పుష్కరాల బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు తరలివెళ్లారు. దీంతో రాత్రి గస్తీ, హైవే పెట్రోలింగ్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ అటకెక్కాయి. ఉన్న అరకొర సిబ్బందికి సైతం అదనపు డ్యూటీలు వేస్తుండడంతో వారు విధులపై శ్రద్ధ చూపలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ తిరుపతి నగరానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ కేంద్రంగా చేసుకుని జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. సెల్ఫోన్లు, విలువైన వస్తువులు, ప్రయాణికుల కళ్లు కప్పి క్షణాల్లో మాయం చేస్తున్నారు. దూర ప్రాంతవాసులు కావడంతో వారు ఫిర్యాదు కూడా చేయకుండానే వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం అరకొర పోలీసులు ఉండడంతో దొంగలు సులువుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదే అదనుగా తమిళనాడు, నగరి, ఓజీ కుప్పం ప్రాంతాల నుంచి పాత నేరస్తులు నగరానికి చేరుకుని పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు నిఘా కొరవడంతో భక్తులను టార్గెట్ చేసుకోవడంతోపాటు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పుష్కరాలకు తరలిన పోలీసులు తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఏడుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 200 మంది ఏఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు , 54 మంది హోంగార్డులు పుష్కరాల బందోబస్తుకు తరలివెళ్లారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఏఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 260 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 45 మంది ఏఆర్ బెటాలియన్ సిబ్బంది పుష్కరాలకు తరలి వెళ్లారు. పెరిగిన చోరీలు కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు సమీపంలోని పెట్రోలు బంకులో నలుగురు దొంగలు చొరబడి రూ.50 వేలు దోచుకెళ్లారు. ఈ నెల 14 తేదీన నిండ్రలో మూడు చోట్ల దొంగతనాలు జరిగాయి. బంగారం, నగదును దోచుకెళ్లారు. శ్రీనివాసపురంలో పట్టపగలే ఇటీవల దొంగలు పడి నగదును దోచుకెళ్లారు. యూనివర్సిటీల్లో మోటారుసైకిళ్ల చోరీలు పెరిగాయి. పోలీసు షీ టీమ్స్ నిఘా లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరాయి. మూడు రోజుల క్రితం గేట్ దొంగలు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. స్టేషన్‌కు వెళ్లితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. చిన్న చిన్న తగాదాలు, ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించేందుకు పోలీసులు వెళ్లటం లేదు. పుష్కరాల తరువాత రమ్మని చెప్పి పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోటోకాల్ సేవలు అందిస్తున్న ఈస్ట్ సీఐని కూడా బందోబస్తు విధులకు నియమించడం గమనార్హం. తిరుపతి ప్రముఖ పుణ్య క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పోలీసులను పుష్కర సేవలకు వినియోగించడంపై భక్తుల్లో అందోళన నెలకొంది. ఇక్కడ ఉన్న పోలీసులను అదనపు విధులకు వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సెక్షన్ 8పై పిల్ సరికాదు
రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు: హైకోర్టు హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టాలని పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ చట్ట నిబంధన చట్టబద్ధతను పిల్ రూపంలో సవాలు చేయడానికి వీల్లేదని, అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని స్పష్టం చేసింది. సెక్షన్ 8పై పిల్ కాకుండా, రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తేల్చి చెప్పింది. దీంతో పిటిషనర్లు తమ పిల్‌ను ఉపసంహరించుకుని, రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన రైతు సాంబరాజు పద్మనాభరావు, శ్రీరామగిరి స్పిన్సింగ్ మిల్స్ డెరైక్టర్ (ఫైనాన్స్) అల్లం భిక్షం, న్యాయవాదులు మరిశెట్టి తాతాజీ, కె.మోహన్‌రాజులు సంయుక్తంగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మద్యం విక్రయానికి పోలీసులు
నేటి నుంచి ప్రభుత్వ దుకాణాలు చిత్తూరు (అర్బన్): పోలీసులంటే శాంతి భద్రతను పర్యవేక్షించడం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం లాంటి పను లు చేయాల్సి ఉంది. ఇప్పుడు పోలీసులంటే మద్యం బాటిళ్లు అమ్ముకునేవాళ్లుగా కొత్త అర్థాన్ని సైతం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం, కలెక్టర్ వింత పోకడతో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. మద్యం దుకాణాల కేటాయింపులో పాఠాలు బోధించే విద్యాశాఖ అధికారి నుంచి డిప్ తీయించిన జిల్లా అధికారులు తాజాగా మరో వివాదానికి తెరతీశారు. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం విక్రయించే బాధ్యతలను పోలీసులకు అప్పగించారు. జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేసే 48 మంది పోలీసులను మద్యం విక్రయాలకు ప్రత్యేక విధులు కేటాయించారు. జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించిన అధికారులు 320 దుకాణాలకు ఇప్పటికే లెసైన్సులు కేటాయించారు. దరఖాస్తులు పడని 90 దుకాణాలకు రీ-టెండర్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. 48 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఈనెల ఒకటి నుంచే ప్రారంభించాల్సి ఉండగా మద్యం బాటిళ్లు సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్లు అందుబాటులోకి లేకపోవడంతో 20 దుకాణాలను బుధవారం రాత్రి నుంచి ప్రారంభించారు. గురువారం నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. మద్యం విక్రయించడానికి గతంలో ఏపీబీసీఎల్ ద్వారా తాత్కాలిక పద్ధతిన ప్రభుత్వ అవుట్లెట్లలో పనిచేసిన 88 మంది సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ప్రతి దుకాణానికీ ఒక ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌ను సైతం కేటాయించి మద్యం విక్రయాలు, దుకాణం పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల అవుట్ లెట్లలో సిబ్బంది నియామకంపై ప్రభుత్వం నుంచి గాని, కలెక్టర్ నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
నక్సలిజం కంటే డేంజర్
ల్యాండ్మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.. రియల్ దందాలకు పాల్పడితే రౌడీషీట్లు సహకరించే అధికారులపైనా నిఘా, చర్యలు సైబరాబాద్ తరువాత అర్బన్ జిల్లాలో నేరాలు ఎక్కువ నిరోధానికి పోలీస్ సిబ్బందిని భర్తీ చేయడమే మార్గం విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ గుంటూరు: ల్యాండ్ మాఫీయాపై ఉక్కుపాదం మోపుతామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఇది నక్సలిజం కంటే డేంజర్ అని పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ల్యాండ్ మాఫీయా ఎంతో మంది అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఇలాంటివారిని నక్సలైట్ల మాదిరిగా ఏరిపారేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు ... ► జిల్లాలో రాజధాని ఏర్పాటు ప్రకటనతో భూ వివాదాలు అధికమయ్యాయి. ధరలు పెరగడంతో పాత గొడవలన్నీ బయటకు వస్తున్నాయి. అర్బన్ జిల్లా పరిధిలో ఇప్పటికే ల్యాండ్‌మాఫీయాకు పాల్పడుతున్న 12 మందిపై రౌడీషీట్లు ఓపెన్చేశాం, నెలాఖరులోగా పూర్తిస్థాయిలో ఇలాంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు చేపడతాం. ►ల్యాండ్‌మాఫియాకు సహకరిస్తున్న వ్యక్తులు, పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రారు శాఖలోని ఉద్యోగులపై కూడా నిఘా ఏర్పాటు చేస్తాం. తహశీల్దార్లు భూ వివాదాల్లో 145 సెక్షన్ అమలు చేసి బైండోవర్ చేసుకోవడం ద్వారా వీటిని కొంత మేర నివారించవచ్చు. ►ఇప్పటికే భూ వివాదాల్లో ఉన్న అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు, త్వరలో మరికొంత మందికి అదే గతి పట్టబోతోంది. ►ల్యాండ్‌మాఫీయాకు పాల్పడుతున్న వారి ఫొటోలను ఫ్లెక్సీలుగా వేసి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తాం. సిబ్బందిని భర్తీ చేస్తాం... ► ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలతో పోలిస్తే సైబరాబాద్ తరువాత గుంటూరు అర్బన్‌లోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. నేర నిరోధానికి సిబ్బంది కొరత లేకుండా భర్తీ చేయాలి. ►త్వరలో సిబ్బంది విభజన చేపట్టి రూరల్ జిల్లా నుంచి రావాల్సిన 165 మంది సిబ్బందిని అర్బన్ జిల్లాకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నా.. ►సిబ్బంది విభజన విషయంలో రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ కూడా సుముఖంగా ఉన్నారు. విభజన జరిగిన తరువాత ఎవరు ఏ కోర్టుకు వెళ్లినా చేసేది ఏమీ లేదు. సిబ్బంది భర్తీ మాత్రం పూర్తి చేసి తీరతాం. అర్బన్ జిల్లా పరిధిలో నేరాల సంఖ్య తగ్గించాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ►అర్బన్ జిల్లాలో పోలీసు స్టేషన్ల అప్‌గ్రేడ్, సిబ్బంది నియామకాలు, విజయవాడ, అర్బన్, గుంటూరు రూరల్ పరిధిలో కమిషనరేట్ ఏర్పాటు చేయాలా లేదా అనేది డీజీపీ నిర్ణయిస్తారు. మా చేతుల్లో ఏమీ ఉండదు. టోల్‌ప్లాజా వద్ద నిఘా పెంపునకు చర్యలు ►నేరాలు అధికంగా జరుగుతున్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో నేరస్తుల కదలికలు గమనించేందుకు విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న టోల్‌ప్లాజా వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ►టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి వాహనాలు, డ్రైవర్లు, వాహన నంబర్ల సహాఫొటోలు, వీడియోలు చిత్రీకరించేలా చర్యలు చేపడుతున్నాం. ► టోల్‌ప్లాజా, వారధి వద్ద అవుట్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. ►బెట్టింగ్, లాటరీ, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా ఉంచి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నాం. ల్యాండ్ మాఫియా నక్సలిజం కంటే ప్రమాదం...అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతాం. నక్సలైట్లను ఏరివేసినట్టుగా పెరికేస్తాం...ఇప్పటికే 12 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ మాఫీయాలోని వ్యక్తుల ఫొటోలను ఫ్లెక్సీలుగా వేయించి భూ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తాం. - రాజేష్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ, గుంటూరు -
పరిశీలిస్తున్నా..
రాష్ర్టంలో శాంతిభద్రతలపై నిఘా ఉంచాలి అవసరమైతే సీఎంతో చర్చిస్తా : గవర్నర్ బెంగళూరు :రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తనకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని గవర్నర్ వాజూభాయ్ రుడాభాయ్ వాలా వెల్లడించారు. మంగళూరులో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితులపై తాను కూడా నిఘా ఉంచినట్లు చెప్పారు. అవసరమైతే ఈ అం శంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సైతం చర్చిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయమై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. -
అమరుల స్ఫూర్తితో పని చేయాలి
ధర్మసాగర్ : పోలీసు అమరుల త్యాగాల స్ఫూర్తితో పని చేస్తూ, సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర రావు సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిర్వహించిన ఎస్సై యూ.సంజీవ్ స్మారక తెప్పపోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో సీఐగా పనిచేసినప్పడు ప్రజలు బయటకు రావాలంటే జంకేవారన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సైగా సేవలందించిన దివంగత సంజీవ్‌ను ఇక్కడి ప్రజలు ఎప్పటకీ మరిచిపోరన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నా రు. ధర్మసాగర్ వరంగల్‌కు సమీపంలో ఉన్నం దున రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాజీపేట డీఎస్పీ రాజిరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీలు సంజీవ్ స్మార కంగా నిర్వహించటంతో ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లయిందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటి ంచారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన గంగపుత్ర, ముదిరాజ్ సంఘ పెద్దలకు ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాఘవేందర్ జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొలిపాక రజిత, ఉపసర్పంచ్ మాచర్ల జ్యోతి, ముదిరాజ్ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పాక ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెప్ప పోటీల్లో విజేతలు వీరే.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిర్వహించిన తెప్పపోటీల్లో కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని ముదిరాజ్, గంగపుత్ర కులస్తులు 40 మంది పాల్గొన్నారు. నాలుగు రౌండ్లలో ఈ పోటీలు నిర్వహించారు. విజయం సాధించిన పన్నెండు మందితో చివరి రౌండ్ నిర్వహించారు. పోటీ ల్లో ప్రథమ బహుమతి ధర్మసాగర్‌కు చెందిన ముప్పారపు రవి, ద్వితీయ బహుమతి ముప్పారపు దుర్గ రాజు, తృతీయ బహుమతిని ముప్పారపు కనకరాజు గెల్చుకున్నారు. ప్రథ మ బహుమతిగా రూ.5 వేల నగదు, షీల్డ్, ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు, షీల్డ్, తృతీయ బహుమతిగా రూ.2 వేలు, షీల్డ్‌ను విజేతలకు అందించారు. -
అందరి దృష్టి విశాఖపైనే..
సాక్షి, విశాఖపట్నం: విభజన తర్వాత విశాఖ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైనందున అందరి దృష్టి దీనిపైనే ఉంటుందని, ఈ నేపథ్యంలో శాంతిభద్రతలపై నిరంతరం ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు కలెక్టర్ యువరాజ్, డీఐజీ ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్‌లకు సూచించారు. గవర్నర్ బంగ్లాలో మంగళవారం మంత్రి గంటా వీరు ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాంతిభద్రతలు, ఇసుక అక్రమ రవాణా, ఫైనాన్స్ కంపెనీల మాయలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇటీవల అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షం నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు తలెత్తాయి. ఇకపై జిల్లాలో శాంతిభద్రతలను ఎవరూ ప్రశ్నించేలా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలి’ అన్నారు. ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌ల బాధ్యత అప్పగించిన నేపథ్యంలో చెలరేగిపోతున్న మాఫియాను అరికట్టాలని సూచించారు. ఇసుక నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. రాష్ట్రంలో ఏ ఫైనాన్స్ కంపెనీ మూసివేసినా దాని మూలాలు ఇక్కడే ఉంటున్నాయని, దీనిపై దృష్టిసారించాలని కోరారు. పర్యాటకంతోనే నగర ప్రతిష్ఠ సింహాచలం భూ సమస్యను వీలైనంత త్వరగా సమసి పోయేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. గంభీరంలో సమీర్‌కు ఇచ్చిన భూకేటాయింపులపై సమీక్షించారు. భీమిలి నియోజకవర్గంలో క్రీడా మైదానానికి అవసరమైన నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నగరంలో పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపర్చాలని ఇదే నగర ప్రతిష్ఠను కాపాడుతుందన్నారు. అందుకే ఈ నెల 17న పర్యాటకశాఖపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్, పోర్టు చైర్మన్, టూరిజం ఉన్నతాధికారులతో నగర పర్యాటకాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నోట్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలోనే ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం గంటా జిల్లా ఎస్పీ ప్రవీణ్‌తో విడిగా మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీలో పలువురు ప్రజాప్రతినిధులు ఎస్పీ పనితీరుపై మంత్రి గంటాకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతో మంత్రి ఎస్పీని ఉద్దేశించి అధికారపార్టీ నేతల విషయంలో చూసీచూడనట్లు పోవాలని సూచించినట్లు సమాచారం. -
అల్‌ఖైదాపై అలర్ట
శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు : భారత ఉప ఖండంలో అల్‌ఖైదా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎటువంటి వైఫల్యానికి తావు లేకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని చెప్పారు. ఇక్కడి విమానాశ్రయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అల్‌ఖైదా నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ, కేంద్రం నుంచి అందే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వవద్దని పోలీసు శాఖకు సూచించామని చెప్పారు. కాగా ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో అతివృష్ట కారణంగా 22 మందితో పాటు 54 పశువులు మృ్యువాత పడ్డాయని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. శనివారం గుల్బర్గ, గదగ, రాయచూరు జిల్లాల్లో వైమానిక సర్వేను నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా రాష్ర్టంలో మొబైల్ ఫోన్ల ద్వారా అత్యవసర ప్రభుత్వ సేవలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే ఈ కార్యక్రమం దేశంలోనే మొదటిదని ఆయన చెప్పారు. -
మా చంద్రబాబు చాలా మంచోడు!
అధికారపక్ష సభ్యుల స్తుతి బాబును పొగుడ్తూ, జగన్‌ను దూషిస్తూ సాగిన ప్రసంగాలు శాంతిభద్రతల ఊసే లేదు హైదరాబాద్: చర్చించాల్సిన అంశం రాష్ట్రంలో శాంతిభద్రతలు. జరిగింది మాత్రం.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై దూషణలు. ఇదీ శనివారం అసెంబ్లీలో అధికారపక్షమైన టీడీపీ సభ్యుల తీరు. చంద్రబాబును కీర్తించడానికి అధికారపక్ష సభ్యులు పోటీపడుతున్నారా అన్న రీతిలో వారి ప్రసంగాలు సాగాయి. గతంలో టీడీపీ హయాం లో శాంతిభద్రతలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేవని, అరాచక శక్తుల పీచమణిచింది చంద్రబాబేనంటూ వారు చెప్పిన తీరు శృతి మించి చివరకు ఓ దశలో ముఖ్యమంత్రే ఇబ్బంది పడేలా చేసింది. బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలపై చర్చించాలన్న వైఎస్సార్సీపీ సభ్యుల గొంతు నొక్కి, వారు వాకౌట్ చేసిన తర్వాత అధికారపక్ష సభ్యులే దీనిపై మాట్లాడారు. ఆత్మస్తుతి, పరనిందే ధ్యేయంగా మాట్లాడారు. పలు సందర్భాల్లో చట్టసభల్లో వాడకూడని పరుష పదజాలాన్ని వినియోగించారు. ఒకరు సైకో అంటే మరొకరు ఆవేశపరుడన్నారు. ఇంకొందరు ఆ కుటుంబం తీరే అంత అంటూ ధ్వజమెత్తారు. రౌడీ, ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు వంటి పదాలన్నీ వాడారు. సభలో టీడీపీ సభ్యులు 9 మంది మాట్లాడగా.. అందరూ జగన్‌ను తూర్పారపట్ట డం, బాబును పొగడ్తల్లో ముంచడానికే సరిపుచ్చారు. అసలు చర్చ అయిన ఎన్నికల ఫలితాల అనంతర హత్యలపై ఏ ఒక్కరూ స్పందించలేదు. విలువలు, నైతికత, విజ్ఞతంటూ పదేపదే నీతి సూత్రాలు వల్లెవేసే బీజేపీ సైతం టీడీపీకి వంతపాడడం గమనార్హం. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా న్యాయమూర్తి తరహాలో జగన్‌ను నేరస్తుడని తీర్పిచ్చా రు. జగన్ కుటుంబానిది రక్తచరిత్ర అని, ఆయనో మర్డరర్, ఆర్థిక నేరస్తుడని అన్నారు.