కశ్మీర్‌లో భద్రత బలగాలను పెంచాలి | Using more military force in Jammu and Kashmir? Most Indians support it, suggests Pew survey | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భద్రత బలగాలను పెంచాలి

Published Sat, Nov 18 2017 4:30 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

Using more military force in Jammu and Kashmir? Most Indians support it, suggests Pew survey - Sakshi

న్యూఢిల్లీ: శాంతి భద్రతల దృష్ట్యా జమ్మూకశ్మీర్‌లో మరింత బలగాలను పెంచాల్సిన అవసరముందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్యూ రీసర్చ్‌ సెంటర్‌ భారత్‌లో చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడించింది. సర్వే ప్రకారం.. 63 శాతం మంది ప్రజలు కశ్మీర్‌లో భద్రతా బలగాలను పెంచాలని భావిస్తున్నారు. 64 శాతం మంది ప్రజలు పాక్‌పై వ్యతిరేకంగా ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 9 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో ఈ సర్వేను నిర్వహించారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 2,464 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. పాతపెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుందని 10 మందిలో ఎనిమిది మంది చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement