జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
కశ్మీర్లోయలోని రజ్వార్ అడవిలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. సాయుధ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రత బలగాలు ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రత బలగాలు ప్రతిదాడి చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. జమ్ములో గురువారం జరిగిన ఓ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.