
ఒంగోలు సబర్బన్: ‘రాష్ట్రంలో శాంతి, భద్రతలు భేషుగ్గా ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. పోలీసుల మీద ఆరోపణలు వచ్చినా నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులు కూడా నమోదు చేస్తున్నాం’.. అని డీజీపీ డి.గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ప్రకాశం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా సీఎం వైఎస్ జగన్ హోంగార్డులకు జీతాలు పెంచినట్టు చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్ సేవా యాప్‌ను రూపొందించామన్నారు. డీజీపీ వెంట అడిషనల్ డీజీపీ శ్రీధరరావు, డీఐజీ వెల్‌ఫేర్ పాల్‌రాజ్, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, నెల్లూరు ఎస్పీ ప్రకాష్ భూషణ్ తదితరులున్నారు.