సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సమర్ధవంతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని ఏపీ శాంతి భద్రతల అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నగదు ప్రభావం ఉండే 116 నియోజకవర్గాలను గుర్తించామని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఆయన.. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, అందుకోసం ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 1.06 లక్షల మంది పోలీసులు, 392 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 45 కంపెనీల ఏపీఎస్పీ ఫోర్స్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు, హెలికాప్టర్‌ల సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్‌లలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారులు ఉంటారని రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment