అధికారపక్ష సభ్యుల స్తుతి
బాబును పొగుడ్తూ, జగన్‌ను దూషిస్తూ సాగిన ప్రసంగాలు
శాంతిభద్రతల ఊసే లేదు
హైదరాబాద్: చర్చించాల్సిన అంశం రాష్ట్రంలో శాంతిభద్రతలు. జరిగింది మాత్రం.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు.. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణలు. ఇదీ శనివారం అసెంబ్లీలో అధికారపక్షమైన టీడీపీ సభ్యుల తీరు. చంద్రబాబును కీర్తించడానికి అధికారపక్ష సభ్యులు పోటీపడుతున్నారా అన్న రీతిలో వారి ప్రసంగాలు సాగాయి.
గతంలో టీడీపీ హయాం లో శాంతిభద్రతలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేవని, అరాచక శక్తుల పీచమణిచింది చంద్రబాబేనంటూ వారు చెప్పిన తీరు శృతి మించి చివరకు ఓ దశలో ముఖ్యమంత్రే ఇబ్బంది పడేలా చేసింది. బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలపై చర్చించాలన్న వైఎస్సార్‌సీపీ సభ్యుల గొంతు నొక్కి, వారు వాకౌట్ చేసిన తర్వాత అధికారపక్ష సభ్యులే దీనిపై మాట్లాడారు. ఆత్మస్తుతి, పరనిందే ధ్యేయంగా మాట్లాడారు. పలు సందర్భాల్లో చట్టసభల్లో వాడకూడని పరుష పదజాలాన్ని వినియోగించారు. ఒకరు సైకో అంటే మరొకరు ఆవేశపరుడన్నారు. ఇంకొందరు ఆ కుటుంబం తీరే అంత అంటూ ధ్వజమెత్తారు. రౌడీ, ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు వంటి పదాలన్నీ వాడారు. సభలో టీడీపీ సభ్యులు 9 మంది మాట్లాడగా.. అందరూ జగన్‌ను తూర్పారపట్ట డం, బాబును పొగడ్తల్లో ముంచడానికే సరిపుచ్చారు.
అసలు చర్చ అయిన ఎన్నికల ఫలితాల అనంతర హత్యలపై ఏ ఒక్కరూ స్పందించలేదు. విలువలు, నైతికత, విజ్ఞతంటూ పదేపదే నీతి సూత్రాలు వల్లెవేసే బీజేపీ సైతం టీడీపీకి వంతపాడడం గమనార్హం. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా న్యాయమూర్తి తరహాలో జగన్‌ను నేరస్తుడని తీర్పిచ్చా రు. జగన్ కుటుంబానిది రక్తచరిత్ర అని, ఆయనో మర్డరర్, ఆర్థిక నేరస్తుడని అన్నారు.
మా చంద్రబాబు చాలా మంచోడు!
Published Sun, Aug 24 2014 1:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement