మందిరాలకు వెళ్తే దీర్ఘాయువు
న్యూయార్క్: వారానికి ఒకటి అంతకన్నా ఎక్కువ సార్లు ఆధ్యాత్మిక సేవా కేంద్రాలకు వెళ్లే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారట! వారికి గుండె, కేన్సర్ తదితర రోగాలు కూడా దరి చేరవవని ఒక అధ్యయనంలో తేలింది.
అంతేకాకుండా మత సంబంధిత కేంద్రాలకు వెళ్లని మహిళలతో పోలిస్తే వెళ్లే మహిళల్లో 33 శాతం మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పరిశోధకుడు టైలర్ జే వాండర్‌వీల్ తెలిపారు. కాగా, ఈ అధ్యయనం కేవలం మధ్య వయసు, వృద్ధాప్య మహిళపై మాత్రమే నిర్వహించడం గమనార్హం.