
ఆధ్యాత్మిక వేత్త సోమయాజులు కన్నుమూత
శ్రీ వేదభారతి సంస్థాపక ధర్మకర్త, కల్లూరి బోగేశ్వర సోమయాజులు(84) గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సాయిసంజీవని ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
- పలువురి నివాళులు
హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ సంస్థాపక సభ్యుడు శ్రీ వేదభారతి సంస్థాపక ధర్మకర్త, కల్లూరి బోగేశ్వర సోమయాజులు(84) గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సాయిసంజీవని ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సాహితీ,ఆధ్యాత్మిక వేత్తలు వీహెచ్‌పీ నేతలు అతని నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.
సోమయాజులు వృత్తిరీత్యా టీచర్. విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి రాష్ట్రంలో సంస్థాపక సభ్యునిగానూ, అనంతరకాలంలో ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవ సమితిలో కీలక భూమిక నిర్వహించారు. మంచి ఉపన్యాసకునిగా కీర్తి గడించారు. సోమయాజులు తుదిశ్వాస విడిచారన్న విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు తదితరులు అలకాపురి కాలనీలోని సోమయాజులు గృహానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.అంత్యక్రియలు శుక్రవారం బన్సీలాల్‌పేటలో నిర్వహించారు.