
నీతో కూడా వాదించను
ఒకతను తన నూట పాతికవ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడని తెలిసిన ఓ పత్రికా విలేకరి ఆయన్ని కలిసి ప్రశ్నించాడు.
ఆధ్యాత్మిక కథ
ఒకతను తన నూట పాతికవ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడని తెలిసిన ఓ పత్రికా విలేకరి ఆయన్ని కలిసి ప్రశ్నించాడు.
‘‘మీరు నూట పాతికేళ్ళుగా ఆరోగ్యంగా జీవించడం వెనక గల రహస్యం ఏమిటి?’’ ‘‘నేను ఏ విషయంలోనూ ఎవరితోనూ వాదించను.’’ ఆ పత్రికా విలేకరి దాన్ని అంగీకరించలేదు. ‘‘అది అసాధ్యం. ఆహారం, దైవధ్యానం లాంటి ఇంకేదో కారణం ఉండి ఉండాలి.’’వృద్ధుడు పత్రికా విలేకరి వంక కొద్ది క్షణాలు చూసి చెప్పాడు. ‘‘మీరు చెప్పింది నిజం కావచ్చు.’’
తను చెప్పిందే రైటని విలేకరితో కూడా వాదించలేదు. ప్రతీ వాదన మనం చెప్పేదే కరెక్ట్, ఎదుటి వారిది తప్పు, వారు కూడా మన అభిప్రాయానికి రావాలనే కోరికలోంచి జనిస్తాయి. వాదించి ఎదుటివారి చేత ఒప్పించాలనే అలవాటు మానుకోవడం ఆధ్యాత్మిక, లౌకిక ప్రగతికి దోహదం చేస్తుంది.