
‘‘ఇటీవల కాలంలో యువత ఆధ్యాత్మిక చింతన, మంచి ప్రవర్తన వంటి మంచి పనులు మరచి తప్పుదారి పడుతున్నారు. వారు అనుసరిస్తున్న చెడు మార్గాన్ని తప్పించి మంచిమార్గంలో నడిచేలా చేయడమే మా సినిమా కథాంశం. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, జనవరిలోగా పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత కృష్ణదేవ్.
ప్రశాంత్‌నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా స్వీయ దర్శకత్వంలో వానమామలై కృష్ణదేవ్ నిర్మిస్తున్న ‘శ్రీకరం శుభకరం నారాయణీయం’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీమతి మధు కెమెరా స్విచ్చాన్ చేయగా, సముద్రాల వేణుగోపాలచారి క్లాప్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment