
కోడెల శివ ప్రసాద్
సాక్షి, కరీంనగర్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావుకు కరీంనగర్ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని తానే స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు.
ఎన్నికల నిబంధనల్లోని వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు విచారణ చేసింది. అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు? ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎవరికి పెట్టారో విచారణ జరపాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే రూ.11 కోట్ల 50 లక్షలు ఎలా వచ్చాయో ఐటీ అధికారులతో విచారించాలని పిటిషనర్ కోరారు. ఇదే కేసులో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. గత నెల 27తో స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా హాజరు కావాలని ఏపీ స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment