సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సంతోష్ లాడ్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు హుబ్లీకి చెందిన సమాజ పరివర్తన సముదాయం అధ్యక్షుడు ఎస్‌ఆర్. హీరేమఠ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కనుక ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బాగలకోటె జిల్లా పర్యటన సందర్భంగా గురువారం కూడల సంగమలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిరేమఠ్ విడుదల చేసిన పత్రాలకు, సంతోష్ లాడ్‌కు ఎలాంటి సంబంధమూ
లేదన్నారు. దీనిపై ఆయన తనకు ఇదివరకే సమగ్ర సమాచారాన్ని అందించారని చెప్పారు. కాగా విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కూలంకషంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందిగా అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీని కోరామని తెలిపారు. నివేదిక అందిన వెంటనే అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.
లాడ్‌ను తొలగించం
Published Fri, Sep 20 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement