Santosh Hegde
-
‘ఆ రెండూ అవినీతి పార్టీలే’
సాక్షి, బెంగళూర్ : బళ్లారిలో అక్రమ మైనింగ్ అంశాన్ని నిగ్గుతేల్చిన అప్పటి కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సంతోష్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతిలో కూరుకుపోయాయని చెప్పారు. కర్ణాటకలో మూడు ప్రధాన పార్టీలు సత్యాన్ని గౌరవించే పరిస్థితిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తాను అక్రమ మైనింగ్‌పై ఇచ్చిన నివేదిక అమలుకు ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ తాను అధికారంలోకి రాగానే నివేదికను అమలు చేయకపోగా, లోకాయుక్తను పక్కనపెట్టి అవినీతి వ్యతిరేక బృందాన్ని నెలకొల్పిందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని, వాస్తవానికి రెండూ అవినీతితో పెనవేసుకున్నవేనని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగడం లేదన్నారు. నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వడం ద్వారా అభ్యర్థులపై ఉన్న ఆరోపణల పట్ల ఆయా పార్టీలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోందన్నారు. -
హై డ్రామా!
- భాస్కరరావు, అశ్విన్‌రావును కాపాడే యత్నం సాగుతోంది - కేసును సీబీఐకి అప్పగించకుండా ప్రభుత్వం నాటకాలాడుతోంది - ప్రభుత్వంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే మండిపాటు సాక్షి, బెంగళూరు: లోకాయుక్త సంస్థకున్న గౌరవ మర్యాదలను మంటగలిపిన న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు, ఆయన కుమారుడు అశ్విన్‌రావును రక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే విమర్శించారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నాటకాలాడుతోందంటూ తీవ్రంగా మండిపడ్డా రు. ‘భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి’ ఆధ్వర్యంలో శనివారమిక్కడి శాసకర భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లోకాయుక్త సంస్థ న్యాయమూర్తిగా పనిచేస్తున్న భాస్కర్‌రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(ఎస్ఐటీ)ను ఏర్పాటు చేసిందని, అయితే ఎస్ఐటీకి కేవలం ఫిర్యాదులు నమోదు చేసుకునే అధికారాన్ని మా త్రమే కల్పించిందని అన్నారు. కనీసం ఎఫ్ఐర్ నమో దు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు కూడా చేయలేని సందర్భంలో ఇక ఎస్ఐటీని ఏర్పాటు చేసి ఏం లాభం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు అవినీతికి పాల్పడకపోయి ఉండవచ్చని, అయితే ఆయన కుమారుడు అశ్విన్‌రావు మాత్రం లోకాయుక్త పేరు చెప్పుకునే అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. అందువల్ల ఇందుకు నైతిక బా ద్యత వహిస్తూ లోకాయుక్త స్థానానికి భాస్కరరావు రాజీనామా చేయాల్సి ఉందని అన్నారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించే అధికారాలు తమకు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ సంతోష్ హెగ్డే విమర్శించారు. లోకాయుక్త విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంతోష్‌హెగ్డే పేర్కొన్నారు. అనంతరం భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి ఎ.టి.రామస్వామి మాట్లాడుతూ....లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును ఆ పదవి నుంచి తప్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం శోచనీయమని అన్నా రు. ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కూ డా లోకాయుక్త ప్రతిష్టను మరింత దిగజార్చేలా పదవిని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డారు. లోకాయుక్త సంస్థ ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాల్లో కాదు సమాజంలో మార్పు రావాలి
అత్యాచార ఘటనలపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే సాక్షి, బెంగళూరు : లోకం తెలియని పసిమొగ్గలపై అత్యాచారాల ఉదంతంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను నిరోధించాలంటే చట్టాల్లో మార్పు కాదని, సమాజంలో రావాలని అభిప్రాయపడ్డారు. మాజీ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ అండ్ ఏడబ్ల్యూ) ఉద్యోగి ఆర్.కె.యాదవ్ రాసిన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ హెగ్డే మాట్లాడుతూ...ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగిన అనంతరం అత్యాచార ఘటనలకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చట్టాల్లో కాకుండా వ్యక్తుల్లో మార్పు వచ్చినపుడు మాత్రమే ఈ తరహా ఘటనలను నిరోధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక జుడీషియరీలో రాజకీయ నేతల జోక్యం పెరుగుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. జుడీషియరీ అంశాలను పరిశీలించేందుకు న్యాయరంగంలోని నిపుణులతోనే ఓ మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను రచయిత ఆర్.కె.యాదవ్ తన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. అంతేకాక ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగాన్ని కొంతమంది పాలకులు ఏలా దుర్వినియోగం చేశారనే అంశాలను కూడా ఈ పుస్తకంలో రాసినట్లు పేర్కొన్నారు. -
ఏ పార్టీకీ మద్దతివ్వను
సంతోష్ హెగ్డే స్పష్టీకరణ నేను కోరుకునే అంశాలను ఏ పార్టీ ప్రస్తావించడం లేదు సమాజంలోని రుగ్మతలు రూపుమాపడానికి యత్నిస్తా అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులు, నేరచరితులు హజారే ఆందోళనకు మద్దతు బాంగ్లాదేశీయుల వలసలతో మున్ముందు సమస్యలే ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 30 శాతం వారే దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించాలి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని రాజకీయ పార్టీలు తాను కోరుకునే అంశాలను ప్రస్తావించడం లేదని, కనుక ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీనీ సమర్థించబోనని విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే అన్నారు. నగరంలోని చిత్ర కళా పరిషత్‌లో వలస బాంగ్లాదేశీయులపై గురువారం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు వెలుపల ఉంటూనే సమాజంలోనే రుగ్మతలను రూపుమాపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులున్నారని, అలాంటి వారికి పార్టీలు టికెట్లు కూడా ఇచ్చాయని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఆందోళనకు మద్దతునిచ్చానని గుర్తు చేశారు. అయితే ఈ పోరాటం రాజకీయ పార్టీగా మారినప్పుడు, ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి మద్దతునివ్వలేదని చెప్పారు. ఆ పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తనకు ఇష్టం కాలేదన్నారు. సాహితీవేత్తలు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని అడిగినప్పుడు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చని లేదా మద్దతు ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పులు అవసరమని, ప్రజా సేవ చేసే వారు, ఉన్నతాశయాలు కలిగిన వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది సరిహద్దుల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారని చెబుతూ, మున్ముందు దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశీయులు తమ సమస్యలను అక్కడి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలే కానీ భారతదేశంపై పడకూడదని అన్నారు. -
దేశంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడే: అమీర్ ఖాన్
ప్రతి ఏటా ఏదో ఒక కుంభకోణంలో ప్రజల ధనమే లూటీ అవుతోందనే విషయాన్ని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సత్యమేవ జయతే-2 కార్యక్రమం ద్వారా వెల్లడించారు. ప్రజల ధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతోందనే విషయాన్ని కొందరు ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించారు. ప్రభుత్వం ధనమంటే ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసేందే. అంటే ప్రతి పౌరుడు సంపదను ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి. భారత దేశంలో సుమారు 70 శాతం మంది ట్యాక్ కట్టడం లేదనే భ్రమలో ఉంటారు. కాని భారతదేశంలో ప్రతి ఒక్కరిని నుంచి పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తారనే విసయం సగటు పౌరుడికి తెలియదు. తమకు ఆదాయం లేదని ట్యాక్సీ డ్రైవర్, చాయ్ కొట్టు నడిపే వారు, చిల్లర కొట్టువారు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ట్యాక్స్ చెల్లిస్తునే.. కట్టడం లేదనే భ్రమ ఉంటారు. ప్రతినిత్యం ప్రజలు నిత్యవసరాల కోసం చక్కెర, టీ పొడి, ఉప్పు, పప్పు, పెట్రోల్, టూత్ పేస్ట్ లాంటి వస్తువులను కొనడం ప్రతి ఒక్కరు కొనడం చూస్తుంటాం. భారత ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు వసూలు చేస్తోంది. పరిమితి ఆదాయం దాటిన ఉద్యోగులు, సంస్థలు ఆదాయపు పన్ను వ్యవస్థకు చెల్లించేది ప్రత్యక్ష పన్నుగా వ్యవహరిస్తారు. నిత్యవసర వస్తువులపై పరోక్ష పన్నులను ప్రతి ఒక్కరు చెల్లిస్తారు. ప్రతి వస్తువుపై పన్నులతో కలిపి అనేది గమనిస్తాం కాని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రత్యక్ష పన్నులు రూపంలో 33 శాతం, పరోక్ష పన్నుల రూపంలో 67 శాతం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారని తెలిపారు. అత్యధికంగా ప్రజాధనం పన్నుల రూపంలో సంపన్న వర్గాల నుంచి కాకుండా పేద, సగటు పౌరుడి నుంచే ప్రభుత్వాలు పన్నుల దండుకుంటున్నాయని ఓ అధికారి వెల్లడించారు. అలాంటి ప్రజాధనం కుంభకోణాల ద్వారా దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారి సహాయాన్నితీసుకుని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా అమీర్ లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే తక్కువ సమయం కారణంగా పూర్తి స్థాయిలో దేశ సంపదను పూర్తిగా అధికారి అంచనా వేయలేకపోయారు. ఖనిజ వనరుల్లో హైడ్రో కార్బన్ వనరులు (క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, బొగ్గు, లిగ్నైట్), 85 రకాల ఖనిజేతర వనరులను పరిగణనలోకి తీసుకుని, అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా సగం మాత్రమే లెక్కింపు చేయగా దేశ సంపద 5000000000000000 (ఐదు వేల లక్షల కోట్ల రూపాయలు) రూపాయలుగా ఉన్నట్టు అంచనా వేశారు. మన దేశంలోని ప్రస్తుత జనాభా సుమారు 120 కోట్లు. సగం మాత్రమే లెక్కించిన దేశ సంపదను మన దేశ జనాభాను పంచితే ప్రతి ఒక్కరికి 40 లక్షల రూపాయలు వస్తుందని అధికారి తేల్చారు. సగం సంపదనే లెక్కలోకి తీసుకుంటే దేశంలోని ప్రతి ఒక్కరి వాటా 40 లక్షలు ఉంటుందని.. ఇంకా దేశంలోని ఇతర సంపద అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోట్లాది ఎకరాల భూమి, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్పెక్ట్రమ్, ఇతర ఆస్తులను లెక్కించి సంపదను పంచితే భారత దేశంలో ప్రతి ఒక్కరు దేశంలో కోటిశ్వరులేనని అమీర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు పేదవాళ్లమని అనుకోవడం తప్పేనని.. అనేక సహజ వనరులున్న భారత దేశం పేద దేశం కాదని అమీర్ తెలిపారు. అయితే అనేక మంది ప్రజలు పేదవాళ్లుగా ఎందుకు మిగిలిపోతాన్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సహజ వనరుల సంపద ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్లలు కొల్లగొడుతున్నారని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా వెల్లడించారు. దేశంలో సహజవనరులను కొల్లగొడుతూ దేశ సంపదను దోపిడి గురిఅవుతున్న కొన్ని కుంభకోణాలపై అమీర్ చర్చించారు. దేశంలో ఇటీవల భారీ కుంభకోణాల్లో ఒకటైన బళ్లారి మైనింగ్ కుంభకోణంపై నివేదిక సమర్పించిన తాత్కాలిక లోకాయుక్త సంతోష్ హెగ్గే ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. బళ్లారి మైనింగ్ కుంభకోణంలో అనేక నిబంధనల్ని తొక్కిపట్టడమే కాకుండా ప్రభుత్వ ఉల్లంఘనలు జరిగాయని.. ప్రభుత్వానికి నాణ్యమైన ముడి ఇనుముకు 27 రూపాయలు చెల్లించి.. కాంట్రాక్టర్లు అదే టన్నుకు 7 వేల రూపాయలకు అమ్మేవారని తెలిపారు. కర్నాటకలో భారీ ఎత్తున జరిగిన కుంభకోణంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక పాత్ర వహించారని.. అనేక మంది మంత్రులు, 797 మంది అధికారులు, 14 మంది ఐఏఎస్ అధికారులు భాగమయ్యారని సంతోష్ హెగ్డె వెల్లడించారు. 1950లో జీప్ కుంభకోణం వల్ల ఆ సమయంలో 52 లక్షల మేరకు నష్టం జరిగిందని..ఎల్ఐసీలో ముంద్రా కుంభకోణం, భారత్ బ్యాంక్ లో దాల్మియా కుంభకోణం, సెంట్రల్ బ్యాంక్ లో నగర్ వాలా కుంభకోణంలాంటివి ప్రతి ఏటా ఏదో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇక 2010లో కామన్ వెల్త్ కుంభకోణంలో 70 వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని.. 2జీ కుంభకోణం 1,76,000 కోట్ల కుంభకోణం, 2012లో కోల్ గేట్ 1,86,000 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకున్నాయని.. ఇలాంటి కుంభకోణాలు ఏమేరకు దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయో ఊహించుకోవడం కష్టమని సంతోష్ హెగ్గే అన్నారు. ఇలాంటి కుంభకోణాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డకట్టవేయకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని సంతోష్ హెగ్దే హెచ్చరించారు. -
దొందూ దొందే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అవినీతిని అంతమొందించడంలో రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వినూత్న పంథాలో నడుస్తుందనే తమ అంచనాలు తలకిందులయ్యాయని విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని బీజేపీ సర్కారుకు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా తేడా లేదని నిష్టూరమాడారు. నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ‘రోగుల భద్రతా పుస్తకాన్ని’ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతి లభించక పోవడంపై ఇప్పటి లోకాయుక్త భాస్కర రావు అసంృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ, ఆయన విశేషాధికారులను కోరుకోవడం లేదని అన్నారు. అవినీతి అధికారులపై దర్యాప్తునకు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా న్యాయ స్థానాలకు వదిలి వే యడం మంచిదని అభిప్రాయపడ్డారు. సర్కారు అనుమతితో నిమిత్తం లేకుండా అవినీతి అధికారులపై దర్యాప్తును సాగించడానికి అవకాశం కల్పించాలని అరిచి మొత్తుకుంటున్నా, ఏ ప్రభుత్వానికీ పట్టడం లేదని ఆయన తీవ్ర అసంృప్తి వ్యక్తం చేశారు. వైద్య రంగమూ వ్యాపారమయం అంతకు ముందు పుస్తకావిష్కణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన విద్యా రంగం మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయమైందని వాపోయా రు. యువత దురాశను విడనాడి, మానవతా ృక్పథంతో వ్యవహరించాలని హితవు పలికారు. రా ష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమయ్యాయని ఆ రోపించారు. జనాభాకు అనుగుణంగా ఆస్పత్రులు లేవని, ఉన్న ఆస్పత్రుల్లోనూ సరైన సదుపాయాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం ఉత్తమ వైద్య సే వలు అందించి ఉంటే, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వచ్చే వారు కారని, తద్వారా వైద్య రంగం వ్యాపారమయం కాకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. 1956లో తాను బెంగళూరుకు వచ్చినప్పుడు ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవో.. ఇప్పుడూ అన్నే ఉన్నాయని ఆయన తెలిపారు. -
‘ఆప్’కు ఆర్ధిక సాయంలో బెంగళూరే ఫస్ట్
= పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన = వారం రోజుల్లోనే పార్టీలో 30 వేల మంది చేరిక = జనలోక్‌పాల్ కోసం బెంగళూరు ప్రజలు చాలా శ్రమించారు = ఇక్కడి వారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు = సంతోష్ హెగ్డే మా పార్టీలో చేరక పోవడం లోటే = గ్రామీణ సమస్యలపై కూడా పోరాటాలు చేస్తాం = లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం..ఈ రాష్ర్టంపై చాలా ఆశలున్నాయి = నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు = ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యోగీంద్ర సాక్షి, బెంగళూరు: ఢిల్లీ ఎన్నికల్లో అనుకోని రీతిలో విజయం సాధించిన అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చందాల రూపంలో ఆర్థిక సాయం అందించిన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉందని ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యోగీంద్ర యాదవ్ వెల్లడించారు. రాష్ర్టంలో ‘ఆప్’ స్థితిగతులను సమీక్షించేందుకు గురువారం ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్రశాఖ ఇన్చార్జ్ సిద్ధార్థ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కేవలం వారం రోజుల్లోనే పార్టీ రాష్ట్ర శాఖలో 30 వేల మంది సభ్యులు చేరారని వెల్లడించారు. ఢిల్లీ, బెంగళూరులకు అనేక విషయాల్లో సారూప్యత ఉందని వివరించారు. జనలోక్‌పాల్ కోసం ఢిల్లీ వీధుల్లో యువత ఎంతగా శ్రమించిందో.. అదే విధంగా బెంగళూరు వాసులూ ఆ బిల్లు ఆమోదం కోసం అనేక పోరాటాలు చేశారని కితాబిచ్చారు. ఇక బెంగళూరులోనూ ఢిల్లీలోగా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ప్రజలు నివాసముంటున్నారని, వీరంతా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అంతేకాక కర్ణాటక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే.. లోక్‌సభ ఎన్నికల్లో మరో పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల విషయంలో తాము కర్ణాటకపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి ఇదీ ఓ కారణమని వివరించారు. ఇక జనలోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం పోరాడిన మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తమ పార్టీలో చేరకపోవడం తమకు లోటుగానే కనిపిస్తోందని అన్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా తాము సంతోష్హెగ్డేను సంప్రదించినపుడు తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఆయన చెప్పారని వెల్లడించారు. కేవలం మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా.. గ్రామీణ స్థాయి నుంచి కూడా తమ పార్టీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామనే విషయాన్ని తాము ఇప్పుడే వెల్లడించలేనని తెలిపారు. ఢిల్లీలో ఒక్కో నియోజకవర్గంలోని సమస్యలకు అనుగుణంగా మేనిఫెస్టోలు రూపొందించినట్లే.. కర్ణాటకలోనూ నియోజకవర్గాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోలను రూపొందిస్తామని వెల్లడించారు. -
లాడ్‌ను తొలగించం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సంతోష్ లాడ్ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు హుబ్లీకి చెందిన సమాజ పరివర్తన సముదాయం అధ్యక్షుడు ఎస్ఆర్. హీరేమఠ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కనుక ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బాగలకోటె జిల్లా పర్యటన సందర్భంగా గురువారం కూడల సంగమలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిరేమఠ్ విడుదల చేసిన పత్రాలకు, సంతోష్ లాడ్‌కు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. దీనిపై ఆయన తనకు ఇదివరకే సమగ్ర సమాచారాన్ని అందించారని చెప్పారు. కాగా విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను కూలంకషంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందిగా అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీని కోరామని తెలిపారు. నివేదిక అందిన వెంటనే అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.