సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అవినీతిని అంతమొందించడంలో రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వినూత్న పంథాలో నడుస్తుందనే తమ అంచనాలు తలకిందులయ్యాయని విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని బీజేపీ సర్కారుకు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా తేడా లేదని నిష్టూరమాడారు. నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ‘రోగుల భద్రతా పుస్తకాన్ని’ ఆవిష్కరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతి లభించక పోవడంపై ఇప్పటి లోకాయుక్త భాస్కర రావు అసంృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ, ఆయన విశేషాధికారులను కోరుకోవడం లేదని అన్నారు.
అవినీతి అధికారులపై దర్యాప్తునకు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా న్యాయ స్థానాలకు వదిలి వే యడం మంచిదని అభిప్రాయపడ్డారు. సర్కారు అనుమతితో నిమిత్తం లేకుండా అవినీతి అధికారులపై దర్యాప్తును సాగించడానికి అవకాశం కల్పించాలని అరిచి మొత్తుకుంటున్నా, ఏ ప్రభుత్వానికీ పట్టడం లేదని ఆయన తీవ్ర అసంృప్తి వ్యక్తం చేశారు.
వైద్య రంగమూ వ్యాపారమయం
అంతకు ముందు పుస్తకావిష్కణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన విద్యా రంగం మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయమైందని వాపోయా రు. యువత దురాశను విడనాడి, మానవతా ృక్పథంతో వ్యవహరించాలని హితవు పలికారు. రా ష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలను అందించడంలో విఫలమయ్యాయని ఆ రోపించారు.
జనాభాకు అనుగుణంగా ఆస్పత్రులు లేవని, ఉన్న ఆస్పత్రుల్లోనూ సరైన సదుపాయాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం ఉత్తమ వైద్య సే వలు అందించి ఉంటే, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వచ్చే వారు కారని, తద్వారా వైద్య రంగం వ్యాపారమయం కాకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. 1956లో తాను బెంగళూరుకు వచ్చినప్పుడు ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవో.. ఇప్పుడూ అన్నే ఉన్నాయని ఆయన తెలిపారు.
దొందూ దొందే
Published Fri, Jan 17 2014 3:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement