కర్ణాటక లోకాయుక్త మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే
సాక్షి, బెంగళూర్ : బళ్లారిలో అక్రమ మైనింగ్ అంశాన్ని నిగ్గుతేల్చిన అప్పటి కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సంతోష్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతిలో కూరుకుపోయాయని చెప్పారు. కర్ణాటకలో మూడు ప్రధాన పార్టీలు సత్యాన్ని గౌరవించే పరిస్థితిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తాను అక్రమ మైనింగ్‌పై ఇచ్చిన నివేదిక అమలుకు ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ తాను అధికారంలోకి రాగానే నివేదికను అమలు చేయకపోగా, లోకాయుక్తను పక్కనపెట్టి అవినీతి వ్యతిరేక బృందాన్ని నెలకొల్పిందని వ్యాఖ్యానించారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని, వాస్తవానికి రెండూ అవినీతితో పెనవేసుకున్నవేనని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగడం లేదన్నారు. నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వడం ద్వారా అభ్యర్థులపై ఉన్న ఆరోపణల పట్ల ఆయా పార్టీలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment