దేశంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడే: అమీర్ ఖాన్
దేశంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడే: అమీర్ ఖాన్
Published Mon, Mar 24 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
ప్రతి ఏటా ఏదో ఒక కుంభకోణంలో ప్రజల ధనమే లూటీ అవుతోందనే విషయాన్ని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సత్యమేవ జయతే-2 కార్యక్రమం ద్వారా వెల్లడించారు. ప్రజల ధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతోందనే విషయాన్ని కొందరు ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించారు. ప్రభుత్వం ధనమంటే ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసేందే. అంటే ప్రతి పౌరుడు సంపదను ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి.
భారత దేశంలో సుమారు 70 శాతం మంది ట్యాక్ కట్టడం లేదనే భ్రమలో ఉంటారు. కాని భారతదేశంలో ప్రతి ఒక్కరిని నుంచి పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తారనే విసయం సగటు పౌరుడికి తెలియదు. తమకు ఆదాయం లేదని ట్యాక్సీ డ్రైవర్, చాయ్ కొట్టు నడిపే వారు, చిల్లర కొట్టువారు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ట్యాక్స్ చెల్లిస్తునే.. కట్టడం లేదనే భ్రమ ఉంటారు.
ప్రతినిత్యం ప్రజలు నిత్యవసరాల కోసం చక్కెర, టీ పొడి, ఉప్పు, పప్పు, పెట్రోల్, టూత్ పేస్ట్ లాంటి వస్తువులను కొనడం ప్రతి ఒక్కరు కొనడం చూస్తుంటాం. భారత ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు వసూలు చేస్తోంది. పరిమితి ఆదాయం దాటిన ఉద్యోగులు, సంస్థలు ఆదాయపు పన్ను వ్యవస్థకు చెల్లించేది ప్రత్యక్ష పన్నుగా వ్యవహరిస్తారు. నిత్యవసర వస్తువులపై పరోక్ష పన్నులను ప్రతి ఒక్కరు చెల్లిస్తారు. ప్రతి వస్తువుపై పన్నులతో కలిపి అనేది గమనిస్తాం కాని ప్రజలు పెద్దగా పట్టించుకోరు.
ప్రత్యక్ష పన్నులు రూపంలో 33 శాతం, పరోక్ష పన్నుల రూపంలో 67 శాతం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారని తెలిపారు. అత్యధికంగా ప్రజాధనం పన్నుల రూపంలో సంపన్న వర్గాల నుంచి కాకుండా పేద, సగటు పౌరుడి నుంచే ప్రభుత్వాలు పన్నుల దండుకుంటున్నాయని ఓ అధికారి వెల్లడించారు. అలాంటి ప్రజాధనం కుంభకోణాల ద్వారా దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ సంపదను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారి సహాయాన్నితీసుకుని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా అమీర్ లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే తక్కువ సమయం కారణంగా పూర్తి స్థాయిలో దేశ సంపదను పూర్తిగా అధికారి అంచనా వేయలేకపోయారు. ఖనిజ వనరుల్లో హైడ్రో కార్బన్ వనరులు (క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, బొగ్గు, లిగ్నైట్), 85 రకాల ఖనిజేతర వనరులను పరిగణనలోకి తీసుకుని, అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా సగం మాత్రమే లెక్కింపు చేయగా దేశ సంపద 5000000000000000 (ఐదు వేల లక్షల కోట్ల రూపాయలు) రూపాయలుగా ఉన్నట్టు అంచనా వేశారు.
మన దేశంలోని ప్రస్తుత జనాభా సుమారు 120 కోట్లు. సగం మాత్రమే లెక్కించిన దేశ సంపదను మన దేశ జనాభాను పంచితే ప్రతి ఒక్కరికి 40 లక్షల రూపాయలు వస్తుందని అధికారి తేల్చారు. సగం సంపదనే లెక్కలోకి తీసుకుంటే దేశంలోని ప్రతి ఒక్కరి వాటా 40 లక్షలు ఉంటుందని.. ఇంకా దేశంలోని ఇతర సంపద అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోట్లాది ఎకరాల భూమి, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్పెక్ట్రమ్, ఇతర ఆస్తులను లెక్కించి సంపదను పంచితే భారత దేశంలో ప్రతి ఒక్కరు దేశంలో కోటిశ్వరులేనని అమీర్ వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరు పేదవాళ్లమని అనుకోవడం తప్పేనని.. అనేక సహజ వనరులున్న భారత దేశం పేద దేశం కాదని అమీర్ తెలిపారు. అయితే అనేక మంది ప్రజలు పేదవాళ్లుగా ఎందుకు మిగిలిపోతాన్నరని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని సహజ వనరుల సంపద ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్లలు కొల్లగొడుతున్నారని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా వెల్లడించారు. దేశంలో సహజవనరులను కొల్లగొడుతూ దేశ సంపదను దోపిడి గురిఅవుతున్న కొన్ని కుంభకోణాలపై అమీర్ చర్చించారు. దేశంలో ఇటీవల భారీ కుంభకోణాల్లో ఒకటైన బళ్లారి మైనింగ్ కుంభకోణంపై నివేదిక సమర్పించిన తాత్కాలిక లోకాయుక్త సంతోష్ హెగ్గే ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
బళ్లారి మైనింగ్ కుంభకోణంలో అనేక నిబంధనల్ని తొక్కిపట్టడమే కాకుండా ప్రభుత్వ ఉల్లంఘనలు జరిగాయని.. ప్రభుత్వానికి నాణ్యమైన ముడి ఇనుముకు 27 రూపాయలు చెల్లించి.. కాంట్రాక్టర్లు అదే టన్నుకు 7 వేల రూపాయలకు అమ్మేవారని తెలిపారు. కర్నాటకలో భారీ ఎత్తున జరిగిన కుంభకోణంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక పాత్ర వహించారని.. అనేక మంది మంత్రులు, 797 మంది అధికారులు, 14 మంది ఐఏఎస్ అధికారులు భాగమయ్యారని సంతోష్ హెగ్డె వెల్లడించారు.
1950లో జీప్ కుంభకోణం వల్ల ఆ సమయంలో 52 లక్షల మేరకు నష్టం జరిగిందని..ఎల్ఐసీలో ముంద్రా కుంభకోణం, భారత్ బ్యాంక్ లో దాల్మియా కుంభకోణం, సెంట్రల్ బ్యాంక్ లో నగర్ వాలా కుంభకోణంలాంటివి ప్రతి ఏటా ఏదో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఇక 2010లో కామన్ వెల్త్ కుంభకోణంలో 70 వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని.. 2జీ కుంభకోణం 1,76,000 కోట్ల కుంభకోణం, 2012లో కోల్ గేట్ 1,86,000 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకున్నాయని.. ఇలాంటి కుంభకోణాలు ఏమేరకు దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయో ఊహించుకోవడం కష్టమని సంతోష్ హెగ్గే అన్నారు. ఇలాంటి కుంభకోణాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డకట్టవేయకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని సంతోష్ హెగ్దే హెచ్చరించారు.
Advertisement
Advertisement