Satyamev Jayate
-
జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? లాభమా..? నష్టమా..?
-
చెరువులు మింగేశారు.. హైడ్రా చేస్తున్నది సరైనదేనా?
-
రియల్ ఎస్టేట్ స్కామ్స్.. తప్పెవరిది? అమ్మే వారిదా? కొనే వారిదా?
-
ఫస్ట్‌లుక్ 4th July 2018
-
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
-
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. పాపులర్ టీవీ షో సత్యమేవ జయతేలో జాతీయ చిహ్నాన్ని (లోగో), అందులో సత్యమేవ జయతే అనే భాగాన్ని కేంద్ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే ఆందోళనకారుడు తన లాయర్ ద్వారా ఈ నోటీసులు పంపించారు. విశేష ప్రజాదరణ పొందిన సత్యమేవ జయతే కార్యక్రమానికి యాంకర్ కమ్ నిర్మాతగా వ్యవహరించిన అమీర్‌ఖాన్, ఆయన భార్య, సహనిర్మాత కిరణ్ రావు, దర్శకుడు సత్యజిత్ భక్తల్ ను ఇందులో దోషులుగా పేర్కొన్నారు. జాతీయ చిహ్నాన్ని గానీ, దాంట్లోని ఏదైనా భాగాన్నిగానీ, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరికీ అధికారం లేదని రాయ్ న్యాయవాది మనోజ్ సింగ్ వాదిస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. లేదంటే దీనికి సంబంధించి తన క్లయింటు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించడానికి అమీర్ ఖాన్, కిరణ్‌రావు తదితరులెవ్వరూ అందుబాటులో లేరు. -
'స్వలింగ సంపర్కం'పై అమీర్ ఖాన్ కు నోటీసులు
చండీగఢ్: సత్యమేవ జయతే టీవీ కార్యక్రమం ద్వారా బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించారంటూ దాఖలైన పిటిషన్ మేరకు చండీగఢ్‌లోని ఓ కోర్టు అతడికి నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19లోపు స్పందన తెలియజేయాలని అమీర్‌ఖాన్‌ను శుక్రవారం ఆదేశించింది. అమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కంపై అమీర్ ఖాన్ చర్చించిన నేపథ్యంలో దాఖలైన పిటీషన్ పై కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని మహిళా న్యాయవాది మణిదీప్ కౌర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమీర్‌ఖాన్ ప్రవర్తనను కోర్టు ధిక్కారంగా ఉందని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఓ ప్రైవేట్ టీవీ చానల్లో ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో... నపుంసకులు, స్వలింగ సంపర్కుల జీవన విధానం, వారి హక్కులపై చర్చ జరిగిందని కౌర్ కోర్టుకు వివరించారు. -
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన శ్రమ సువిధ పోర్టల్‌ను ఆరంభించారు. శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సత్యమేవ జయతే ఎంత శక్తివంతమో ....శ్రమేవ జయతే అంత శక్తిమంతమని ఆయన అన్నారు. దేశంలో ఐటీఐలను పరిపుష్టం చేయాలని మోడీ అభిప్రాయపడ్డారు. శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడికి వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందన్నారు. పాలకులకు మాత్రమే అన్ని తెలుసనుకుంటే అది పొరపాటు అని ఆయన అన్నారు. -
థర్డ్ లుక్ తో అమీర్ ఖాన్ మళ్లీ ఝలక్
విడుదలకు ముందే పోస్టర్లతో 'పీకే' చిత్రం సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఫస్ట్ లుక్ లో నగ్నంగా దర్శనమిచ్చి సంచలనంతో వివాదం రేపిన అమీర్ ఖాన్.. సెకండ్ లుక్ లో భోజ్ పూరి డ్రస్ లో బ్యాండ్ వాలాగా కనిపించారు. సెప్టెంబర్ 16 తేది మంగళవారం విడుదల చేసిన థర్డ్ లుక్ పోస్టర్ లో ఈసారి అమీర్ తో పాటు సంజయ్ దత్ కూడా ఉన్నారు. తాజా పోస్టర్ లో అమీర్ ఖాన్ యాంగ్రీ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా డిఫరెంట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఈ థర్డ్ లుక్ లో ట్రాన్సిస్టర్ ను కూడా వెంట తెచ్చుకున్నారు. థర్డ్ లుక్ వీడియోను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. తొలుత 'సత్యమేవ జయతే' కార్యక్రమ ప్రోమోను పోస్ట్ చేసి అభిమానులకు భోజ్ పూరి భాషలో ఝలక్ ఇచ్చారు. పొరపాటున టీవీ ప్రోగ్రాం యాడ్ వేసాను. ఇప్పుడు చూడండి పీకే వీడియో అంటూ రెండవ ట్వీట్ లో తెలిపారు. -
అక్టోబర్ 5 తేది నుంచి సత్యమేవ జయతే!
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన టెలివిజన్ షో 'సత్యమేవ జయతే' వచ్చేనెల ఆరంభం కానునందని ట్విటర్ లో తెలిపారు. మూడవ వెర్షన్ సత్యమేవ జయతే కార్యక్రమ ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. సత్యమేవ జయతే అక్టోబర్ 5 తేది నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ప్రోమోను చూడండి. మీ స్పందనను తెలియచేయండి అంటూ అమీర్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, కంగనా రనౌత్ లు కనిపించనున్నారు. -
కంటతడి పెట్టిన అమీర్ ఖాన్!
భావోద్వేగానికి ఎవరూ అతీతులు కారని అమీర్ ఖాన్ తాజా ఉదంతంతో వ్యక్తమైంది. సత్యమేవ జయతే కార్యక్రమం ప్రోమో విడుదల సందర్భంగా భావోద్వేగానికి లోనైన అమీర్ ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. సత్యమేవ జయతే సీజన్-3 ప్రోమోను ముంబైలో బుధవారం విడుదల చేశారు. మూడవ భాగం కోసం అమీర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా స్వయంగా కూడా ప్రజలతో అనుభవాల్ని పంచుకున్నారు. మూడవ భాగం కోసం షూట్ చేసిన అనుభావాల్ని పంచుకునే క్రమంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. సత్యమేవ జయతే మూడవ ఎడిషన్ సెప్టెంబర్ 21 తేదిన ప్రసారం కానుంది. ప్రతి ఆదివారం స్టార్ ప్లస్ టెలివిజన్ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. భారతీయ సమాజంలో సమస్యలపై ప్రసారం చేసిన కథనాలకు గత రెండు ఎడిషన్లలో భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోడీతో ఆమిర్‌ఖాన్ భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. బుల్లితెరపై తన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం ద్వారా దేశం ఎదుర్కొంటున్న పలు సామాజిక సమస్యలను ఆమిర్‌ఖాన్ వెలుగులోకి తేవడం తెలిసిందే. మోడీతో భేటీలో ఆయా సామాజిక సమస్యల గురించి ఆయన చర్చించారు. భేటీ అనంతరం ఆమిర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను లేవనెత్తిన పలు సమస్యలపై దృష్టి పెడతానని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. తనకోసం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నరేంద్ర మోడీతో ఆమిర్‌ఖాన్ సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అభివర్ణించింది. -
మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది
సమాజానికి ఎప్పుడూ మంచే చేసేవాడు.. తన గ్రహపాటు బాగుండక ఓ పొరపాటు చేస్తే... అంతవరకూ చేసిన మంచి అంతా హుష్ పటాక్ అయిపోతుంది. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి తన వంతు కృషి చేస్తున్నారు ఆమిర్. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. అయితే... ఇటీవల ఆయన విషయంలో ఓ పొరపాటు దొర్లింది. దాంతో నిందల్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే- ‘సత్యమేవ జయతే’ షోలో భాగంగా బీహార్‌లోని ఓ పల్లెటూరికి వెళ్లారు ఆమిర్. అక్కడ భగీరథ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిశారు. భగీరథది చాలా బీద కుటుంబం. అతని భార్య పేరు బసంతీదేవి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం తయారు చేయడం ఈ దంపతుల పని. ఓ వైపు ఆర్థిక బాధలు, మరో వైపు బసంతీదేవి ఆనారోగ్యం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదంతా దగ్గరుండి తెలుసుకున్నారు ఆమిర్. ‘మీ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాను’ అని భగీరథకు మాటిచ్చేశారు. త్వరలోనే తన మనుషులు కొంతమంది మిమ్మల్ని కలుస్తారని, మీ ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో... వాటన్నింటినీ తొలగించి, మీకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా సమకూరుస్తారని ఆమిర్ మాటివ్వడంతో భగీరథ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. కట్ చేస్తే... రోజులు గడిచిపోతున్నాయి. ఆమిర్ దగ్గర్నుంచి ఎవ్వరూ భగీరథను కలవడానికి రాలేదు. ఓ వైపు బసంతీదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమీర్ నుంచి మాత్రం ఎలాంటి వర్తమానం లేదు. బసంతీదేవి పరిస్థితి విషమించి, చివరకు ఆమె చనిపోయింది. తన భార్యకు అంతిమ సంస్కారం చేయడానికి కూడా భగీరథ దగ్గర డబ్బుల్లేవు. చివరకు ఓ స్వచ్ఛంద సేవాసంస్థ అందించిన సాయంతో ఆంత్యక్రియలు పూర్తి చేశాడు భగీరథ. ‘‘ఆమీర్ సకాలంలో సాయం అందించి ఉంటే... నా భార్య నాకు దక్కేది. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు’’ అని బాహాటంగా విమర్శలు గుప్పించాడు భగీరథ. నిజానికి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్లో తిరుగులేని సూపర్‌స్టార్. క్షణం తీరిక లేని జీవితం ఆయనది. అంత బిజీలో కూడా సమాజానికి ఏదైనా చేయాలనే దృక్పధం ఆమిర్‌లో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ‘సత్యమేవ జయతే’. దాని ద్వారా ఎందరినో ఆదుకున్నారాయన. అంత చేసినా... మరపు వల్ల తాను చేసిన ఓ చిన్న పొరపాటు ఆయనకు ఈ మచ్చను తెచ్చిపెట్టింది. పాపం ఆమిర్. -
'ఓ ఎంపీ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు'
66 క్రితం దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టే ముందు ఏ లక్ష్యం కోసం మహాత్ములు పోరాటం చేశారో.. నేరపూరిత రాజకీయాల కారణంగా ఆ లక్ష్యానికి దూరంగా పోతున్నామనే ఓ సంఘటనను చూస్తే అర్ధమవుతుంది. ఓ ఫ్రోఫెషనల్ షూటర్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఎంపీ కావడానికి ముందు ఓ జర్నలిస్ట్ తో మాట్లాడిన విషయాన్నిఇటీవల 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో అమీర్ వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నేరాలతో సంబంధమున్నవ్యక్తులు ప్రవేశించడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే విషయాలను కొన్ని ఆసక్తికరమైన అంశాలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ వెలుగులోకి తెచ్చారు. జర్నలిస్ట్ తో షూటర్.. చాలా రోజుల నుంచి మీడియాలో వార్తలు రావడం లేదు.. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. నాగురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎవర్నైనా హత్య చేయాల్సిందే.. నాగురించి పేపర్లో రావాల్సిందే. మార్కెట్లో తన ఇమేజ్ పెరగాలంటే ఎదో ఒక హత్య చేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో నేను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలువాల్సిందే అని ఓ షూటర్ చెప్పాడని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల దేశ రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల దేశ ప్రతిష్ట భ్రష్టుపడుతుందనే విషయాన్ని ఓటర్లకు చెప్పేందుకు, దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అమీర్ ఖాన్ సమాజంలోని కొందరు అధికారులు, ఇతర వ్యక్తులతో మాట్లాడించారు. ఎంపీ అజిత్ సర్కార్ హత్య! ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం నిస్వార్ధంగా పాటుపడే వ్యక్తులకు ప్రస్తుత నేరపూరిత సమాజంలో స్థానం లేదనే స్సష్టమవుతోంది. పేద ప్రజలందరికి తలదాచుకోవడానికి సొంత ఇళ్లు నిర్మించడానికి జీవితాన్ని త్యాగం చేసిన ఓ ప్రజా ప్రతినిధి కథ తెలుసుకుంటే.. గుండె ఆర్దతతో నిండిపోవాల్సిందే. 14 జూన్ 1998 అజిత్ సర్కార్ దారుణ హత్యకు గురయ్యాడు. అంటే 15 సంవత్సరాల తర్వాత కూడా అజిత్ సర్కార్ ప్రజల హృదయాల్లో తలదాచుకున్నారు. పూర్ణియా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు దేవుడిగా భావించిన నేత.. ఓ దీపమని.. దుర్మార్గులు ప్రజలకు వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పేశారని కులమతాలకు అతీతంగా ఆయన అభిమానుల, కార్యకర్తలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ లోని పుర్ణియా నియోజకవర్గంలో అజిత్ సర్కార్ 15 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా.. సొంత ఇంటి నిర్మించుకోలేకపోయారని ఆయన కుమారుడు అమిత్ సర్కార్ కొన్ని విషయాలను వెల్లడించారు. తన తల్లి టీచర్ గా పనిచేయడం వల్ల వచ్చే ఆదాయంతోనే తమ జీవితం గడిచేదని అమిత్ తెలిపారు. 'పూర్ణియా నియోజకవర్గంలో భూస్వాములు, పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న అక్రమిత భూముల్ని పేద ప్రజలకు పంచడానికి ఉద్యమం చేపట్టారు. కొడుకు, కూతురు, ఇతర బినామీలతోపాటు, పెంపుడు జంతువులపై ఉన్న భూములను పేద ప్రజలకు పంచడంతో అజిత్ సర్కార్ పై కక్ష పెంచకున్నారు. తమ అక్రమ వ్యవహారాలకు అడ్డుగా నిలిచిన అజిత్ సర్కార్ ను పప్పుయాదవ్ అనే నేరస్థుడు కాల్చి చంపాడు. అజిత్ సర్కార్ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు అని అమిత్ తెలిపారు. 107 బుల్లెట్స్ శరీరంలో దిగినా తన తండ్రి ముఖంలో చిరునవ్వు చెరగలేదని.. అదే మాకు స్పూర్తి ఇస్తుందని అమిత్ తెలిపారు. అజిత్ సర్కార్ హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయినా.. నిందితుడికి ఎలాంటి శిక్ష పడలేదని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. సురాజ్యం, పేద ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం నేతల ఎన్నుకోవడం ఓటరుపై బాధ్యత ఉందని ఆమీర్ తెలిపారు. నేరపూరిత రాజకీయ నేతలను ఎన్నికల్లో ఓడించడం ద్వారా మహాత్ములు కలలు కన్న భారతాన్ని సాధించవచ్చని అమీర్ తెలిపారు. -
అన్నిపార్టీలో నేర చరిత్ర, టీడీపీలో 33%, ఎంఐఎంలో 100%: అమీర్
ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసే నేతలే నేర పూరిత రాజకీయాలతో పలు కేసుల్లో చిక్కుపోయారనే వాస్తవాన్ని 'సత్యమేవ జయతే' టెలివిజన్ ధారవాహిక ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఓటర్లలో అవగాహన కల్పించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రయత్నం చేశారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముందండంతో దేశ ప్రజలందరూ ప్రస్తుతం కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. సత్యమేవ జయతే టెలివిజన్ షో ద్వారా పలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. పార్లమెంట్ కు ఎన్నికయ్యే నేతల్లో నిస్వార్ధపరులు, అవినీతికి దూరంగా ఉండాలని పౌరులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. గత కొద్దికాలంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ నేరపూరిత రాజకీయాలపై అధ్యయనం చేస్తోంది. ఏడీఆర్ వ్యవస్థాకుడు, ఐఐఎమ్ ఫ్రొఫెసర్ జయదీప్ చోకర్ వెల్లడించిన వివరాల ప్రకారం 543 పార్లమెంట్ సభ్యుల్లో 30 శాతం మంది అంటే 162 మంది ఎంపీలు కేసులు నమోదయ్యాయని చోకర్ తెలిపారు. 2004 సంవత్సరంలో నేరపూరిత ఎంపీలు 129 మంది ఉండగా, 2009 సంవత్సరానికి వచ్చే సరికి 162 మంది ఉన్నారు. ఇక 2014 సంవత్సరంలో ఎంతమంది ఉంటారో చెప్పలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చోకర్ వెల్లడించిన లెక్కల ప్రకారం పార్లమెంట్ కు ఎంపికైన నేరపూరిత ఎంపీలు శివసేన లో 82 శాతం, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో 44 శాతం, ఏఐఏడీఎంకే 44, జనతాదళ్ (యూ) 40, బీఎస్పీ 29, ఎస్పీలో 39, జనతాదళ్(ఎస్) 67, ఏఎంఎం 100 శాతం, తెలుగుదేశం పార్టీలో 33 శాతం, ఎంఐఎంలో 100 శాతం మంది ఉన్నారు. వీరిపై హత్యకేసులు, హత్యాయత్నం కేసులు, అక్రమ మానవ రవాణా, కిడ్నాప్, దోపిడి కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి వారి చేతుల్లో మన చట్టాలు తయారవుతున్నాయని ఆమీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత పార్లమెంట్ సభ్యులపై డేటా సేకరించామని అందులో 6 గురు ఎంపీలపై అత్యాచారం కేసులు నమోదుకాగా, 34 మంది మహిళలపై పలురకాల దౌర్జన్యాలను చేసినట్టుగా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో అత్యాచార కేసులు నమోదైన 27 మందికి రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించారని చోకర్ తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయపార్టీలో తక్కువలో తక్కువ 10 శాతం నుంచి 25 శాతం మంది ఎంపీలు నేరాలతో సంబంధమున్నవారని తెలిపారు. ఉన్నత విద్య కోసం భోపాల్ వెళ్లిన బిటియా అనే విద్యార్థినిని సమాజ్ వాదీ పార్టీకి చెందిన భయ్యా రాజా అనే ఎమ్మెల్యే హత్య చేసిన ఉదంతాన్ని, బిటియా తల్లి తండ్రులు మృగేంద్ర,భారతీల ఆవేదన, న్యాయం కోసం వారును సత్యమేవ జయతే ద్వారా ప్రజలకు చేరవేశారు. హత్యకు కారణమైన భయ్యా రాజాకు సమాజ్ వాదీ, ఆయన భార్యకు ఓ జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మాఫియా, నేరపూరిత రాజకీయ నేతలకు పోలీసులే రక్షణ కల్పించడంపై నిరసన వ్యక్తం చేశారు. భయ్యా రాజాపై 82 కేసులున్నాయని, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి ఎవరూ కూడా ధైర్య చేయలేదని.. తొలిసారి మేమే ఈ కేసులో ఎదురొడ్డి నిలిచామన్నారు. భయ్యా రాజా లాంటి నేరపూరిత రాజకీయ నేతలు పార్లమెంట్ లో చేరి..చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని.. ఇలాంటి నేతలను పార్లమెంట్ లోకి ప్రవేశించకుండా ఓటర్లు తగిన చర్యలు తీసుకోవాలని సత్యమేవ జయతే సూచించింది. Courtesy: Satyamev Jayate -
దేశంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడే: అమీర్ ఖాన్
ప్రతి ఏటా ఏదో ఒక కుంభకోణంలో ప్రజల ధనమే లూటీ అవుతోందనే విషయాన్ని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సత్యమేవ జయతే-2 కార్యక్రమం ద్వారా వెల్లడించారు. ప్రజల ధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతోందనే విషయాన్ని కొందరు ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరించారు. ప్రభుత్వం ధనమంటే ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసేందే. అంటే ప్రతి పౌరుడు సంపదను ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి. భారత దేశంలో సుమారు 70 శాతం మంది ట్యాక్ కట్టడం లేదనే భ్రమలో ఉంటారు. కాని భారతదేశంలో ప్రతి ఒక్కరిని నుంచి పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తారనే విసయం సగటు పౌరుడికి తెలియదు. తమకు ఆదాయం లేదని ట్యాక్సీ డ్రైవర్, చాయ్ కొట్టు నడిపే వారు, చిల్లర కొట్టువారు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ట్యాక్స్ చెల్లిస్తునే.. కట్టడం లేదనే భ్రమ ఉంటారు. ప్రతినిత్యం ప్రజలు నిత్యవసరాల కోసం చక్కెర, టీ పొడి, ఉప్పు, పప్పు, పెట్రోల్, టూత్ పేస్ట్ లాంటి వస్తువులను కొనడం ప్రతి ఒక్కరు కొనడం చూస్తుంటాం. భారత ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు వసూలు చేస్తోంది. పరిమితి ఆదాయం దాటిన ఉద్యోగులు, సంస్థలు ఆదాయపు పన్ను వ్యవస్థకు చెల్లించేది ప్రత్యక్ష పన్నుగా వ్యవహరిస్తారు. నిత్యవసర వస్తువులపై పరోక్ష పన్నులను ప్రతి ఒక్కరు చెల్లిస్తారు. ప్రతి వస్తువుపై పన్నులతో కలిపి అనేది గమనిస్తాం కాని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రత్యక్ష పన్నులు రూపంలో 33 శాతం, పరోక్ష పన్నుల రూపంలో 67 శాతం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారని తెలిపారు. అత్యధికంగా ప్రజాధనం పన్నుల రూపంలో సంపన్న వర్గాల నుంచి కాకుండా పేద, సగటు పౌరుడి నుంచే ప్రభుత్వాలు పన్నుల దండుకుంటున్నాయని ఓ అధికారి వెల్లడించారు. అలాంటి ప్రజాధనం కుంభకోణాల ద్వారా దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారి సహాయాన్నితీసుకుని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా అమీర్ లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే తక్కువ సమయం కారణంగా పూర్తి స్థాయిలో దేశ సంపదను పూర్తిగా అధికారి అంచనా వేయలేకపోయారు. ఖనిజ వనరుల్లో హైడ్రో కార్బన్ వనరులు (క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, బొగ్గు, లిగ్నైట్), 85 రకాల ఖనిజేతర వనరులను పరిగణనలోకి తీసుకుని, అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా సగం మాత్రమే లెక్కింపు చేయగా దేశ సంపద 5000000000000000 (ఐదు వేల లక్షల కోట్ల రూపాయలు) రూపాయలుగా ఉన్నట్టు అంచనా వేశారు. మన దేశంలోని ప్రస్తుత జనాభా సుమారు 120 కోట్లు. సగం మాత్రమే లెక్కించిన దేశ సంపదను మన దేశ జనాభాను పంచితే ప్రతి ఒక్కరికి 40 లక్షల రూపాయలు వస్తుందని అధికారి తేల్చారు. సగం సంపదనే లెక్కలోకి తీసుకుంటే దేశంలోని ప్రతి ఒక్కరి వాటా 40 లక్షలు ఉంటుందని.. ఇంకా దేశంలోని ఇతర సంపద అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోట్లాది ఎకరాల భూమి, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్పెక్ట్రమ్, ఇతర ఆస్తులను లెక్కించి సంపదను పంచితే భారత దేశంలో ప్రతి ఒక్కరు దేశంలో కోటిశ్వరులేనని అమీర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు పేదవాళ్లమని అనుకోవడం తప్పేనని.. అనేక సహజ వనరులున్న భారత దేశం పేద దేశం కాదని అమీర్ తెలిపారు. అయితే అనేక మంది ప్రజలు పేదవాళ్లుగా ఎందుకు మిగిలిపోతాన్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సహజ వనరుల సంపద ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్లలు కొల్లగొడుతున్నారని సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా వెల్లడించారు. దేశంలో సహజవనరులను కొల్లగొడుతూ దేశ సంపదను దోపిడి గురిఅవుతున్న కొన్ని కుంభకోణాలపై అమీర్ చర్చించారు. దేశంలో ఇటీవల భారీ కుంభకోణాల్లో ఒకటైన బళ్లారి మైనింగ్ కుంభకోణంపై నివేదిక సమర్పించిన తాత్కాలిక లోకాయుక్త సంతోష్ హెగ్గే ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. బళ్లారి మైనింగ్ కుంభకోణంలో అనేక నిబంధనల్ని తొక్కిపట్టడమే కాకుండా ప్రభుత్వ ఉల్లంఘనలు జరిగాయని.. ప్రభుత్వానికి నాణ్యమైన ముడి ఇనుముకు 27 రూపాయలు చెల్లించి.. కాంట్రాక్టర్లు అదే టన్నుకు 7 వేల రూపాయలకు అమ్మేవారని తెలిపారు. కర్నాటకలో భారీ ఎత్తున జరిగిన కుంభకోణంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక పాత్ర వహించారని.. అనేక మంది మంత్రులు, 797 మంది అధికారులు, 14 మంది ఐఏఎస్ అధికారులు భాగమయ్యారని సంతోష్ హెగ్డె వెల్లడించారు. 1950లో జీప్ కుంభకోణం వల్ల ఆ సమయంలో 52 లక్షల మేరకు నష్టం జరిగిందని..ఎల్ఐసీలో ముంద్రా కుంభకోణం, భారత్ బ్యాంక్ లో దాల్మియా కుంభకోణం, సెంట్రల్ బ్యాంక్ లో నగర్ వాలా కుంభకోణంలాంటివి ప్రతి ఏటా ఏదో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇక 2010లో కామన్ వెల్త్ కుంభకోణంలో 70 వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని.. 2జీ కుంభకోణం 1,76,000 కోట్ల కుంభకోణం, 2012లో కోల్ గేట్ 1,86,000 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకున్నాయని.. ఇలాంటి కుంభకోణాలు ఏమేరకు దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయో ఊహించుకోవడం కష్టమని సంతోష్ హెగ్గే అన్నారు. ఇలాంటి కుంభకోణాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డకట్టవేయకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముందని సంతోష్ హెగ్దే హెచ్చరించారు. -
ఎవరేమనుకున్నా ఇది సత్యం!
సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలోనూ ఆమిర్‌ఖాన్ హీరోయే అని బాలీవుడ్‌వారు అంటారు. అందుకే ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పిలుస్తుంటారు. ఆ ఇమేజ్ ఉన్నందునే ఆమిర్ చేస్తున్న ‘సత్యమేవ జయతే’ టీవీ షోకి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ టీవీ షోలో ఆమిర్ పలు సామాజిక అంశాల గురించి చర్చిస్తున్న విషయం తెలిసిందే. నిజాలను నిర్భయంగా మాట్లాడటం వల్ల ఈ షోకి భారీగా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ, విమర్శించడానికి కొంతమంది రెడీగా ఉంటారు కదా. అలాంటివాళ్లు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమిర్ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రచారం చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే’కి వస్తున్న విరాళాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి పోలీసులకు ఆమిర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ -‘‘ ‘సత్యమేవ జయతే’ ఓ ప్రయోజనాత్మక కార్యక్రమం. అది ఎవరూ కాదనలేని విషయం. నేనీ ప్రోగ్రామ్ డబ్బులు తీసుకోకుండా చేయడంలేదు. ఎందుకంటే, ఇది నా జాబ్. ఎక్కువ డబ్బులు తీసుకుని చెడ్డ పనులు చేసే బదులు తక్కువ డబ్బుకి మంచి పని చేయొచ్చనుకున్నాను. ఈ షో ద్వారా నాకు లభించే ఆర్థిక సంతృప్తి గురించి పక్కన పెడితే, ఆత్మసంతృప్తి మాత్రం మెండుగా ఉంది. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే వచ్చే డబ్బుతో పోల్చితే, ఈ షోకి నేను తీసుకుంటున్నది చాలా చాలా తక్కువ. మొత్తం ఏడాదంతా ఈ షోకి కేటాయించేశాను. డబ్బే ప్రధానం అనుకుంటే సినిమాలు, వాణిజ్య ప్రకటనలు చేసేవాణ్ణి. కానీ, ‘సత్యమేవ జయతే’ని డబ్బుతో ముడిపెట్టడం ఇష్టం లేదు. నా సంపాదన తగ్గినా ఫర్వాలేదనుకున్నా. ఎవరేమనుకున్నా ఇది సత్యం’’ అన్నారు. -
'ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను'
ముంబయి : ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయనని, అయితే ఓటు ఎవరికి వేయాలో అన్నది ఓటరు వ్యక్తిగత విషయమని బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ అన్నారు. ఈ ఏడాది ఏ షూటింగ్స్ చేయబోనన్న ఆమీర్ .. మొత్తం కాల్షీట్స్ను 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి కేటాయించానన్నారు. తనపై వచ్చిన అసత్య ఆరోపణల వ్యవహారాన్ని పోలీసులకు అప్పగించానని .. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇవాళ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమీర్ ఖాన్ ముంబైలో తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతి ఏడాది ఆయన తన పుట్టినరోజును మీడియా ప్రతినిధులతో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఏడాది రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం తన చేతిలో ఏ చిత్రం లేదని అన్నారు. దాంతో తన సమయం అంతా 'సత్యమేవ జయతే'కి కేటాయిస్తానని తెలిపారు. గత సంవత్సరం చాలా బాగా గడిచిందని, ధూమ్-3 విజయవంతం కావటం సంతోషంగా ఉందన్నారు. పలు సామాజిక అంశాల నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. దీని రెండో భాగం మార్చి నుంచి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. స్టార్ గ్రూపు చానళ్లు స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్, దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతోంది. -
'రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తా'
'సత్యమేవ జయతే' సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే ఓ కళాకారుడిగా సమాజానికి తనకు తోచిన సేవను అందిస్తానని అమీర్ తెలిపారు. అయితే తాను రాజకీయ వేత్తగానో, లేదా సామాజిక కార్యకర్తగానో మారే ఆలోచన లేదని మిస్టర్ ఫర్ ఫెక్ట్ వెల్లడించారు. సమాజానికి తాను చేయాల్సింది తాను చేస్తాను.. అదోక బాధ్యతగా స్వీకరిస్తాను అని అన్నారు. అంతేకాక రాజకీయాలు తనకు సరిపడవని.. అక్కడ రాణిస్తాననే విశ్వాసం తనకు లేదని అమీర్ తేల్చి చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఐడబ్ల్యూపీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపేదిలేదు అని అన్నారు. అయితే స్వరాజ్ అనే సందేశంతో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై సానుకూలంగా స్పందించారు. -
కుక్క కరిస్తే సానుభూతి.. మృగాడు కాటేస్తే..
సాటి మనిషిని కుక్క కరిస్తే సానుభూతి చూపించే ఈ సమాజం.. ఓ మృగాడి కాటుకు బలైన ఓ మహిళను అతిహీనంగా చూస్తోందనే కోణంపై బాలీవుడ్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ దేశంలోని సామాజిక సమస్యపై మరోసారి 'సత్యమేవ జయతే-2' రూపంలో తన అస్త్రం ఎక్కుపెట్టారు. ప్రతి 22 నిమిషాలకు ఓ అత్యాచారం నమోదవుతున్న ఈసమాజంలో ప్రభుత్వాలకు, అధికారులకు పట్టింపు లేదని సత్యమేవజయతే ద్వారా కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఐదుగురు మహిళలకు ఎదురైన అనుభవాల్ని ఈ కార్యక్రమంలో వెలుగులోకి తెచ్చారు. అత్యాచారం జరిగిన తర్వాత పోలీసుల తీరు, వైద్య పరీక్షల నిర్వహించే సమయంలో ఎదురైన సంఘటనలు చాలా బాధాకరమని తనకు ఎదురైన అనుభవాల్ని ఓ మహిళ పంచుకున్నారు. న్యాయం కోసం చేస్తున్న తన పోరాటానికి ఓ దశాబ్దం కాలం పట్టిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైతే.. ప్రామాణికమైన వైద్య పరీక్ష లేకపోవడం దారుణం. బాధితురాలిని అనుమానస్పదంగా చూడాలని పాఠ్యపుస్తకాల్లోనే ఉండటం అత్యంత శోచనీయమని ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఘోరమైన విషయమేమింటంటే మెడికల్ ద్వితీయ సంవత్సరం పుస్తకాల్లో కేవలం నాలుగు మార్కుల కోసం కేటాయించిన సిలబస్ ఉండటం చూస్తే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. ఇక తన భార్యపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన భర్తపై పోలీసుల దౌర్జన్యం, వేధింపులను ఈ కార్యక్రమం ద్వారా సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దర్యాప్తులో లోపాలు, వైద్యపరీక్షలో లోటుపాట్ల ఆసరాతో నిందితులు తప్పించుకుంటాన్నరని...కోర్టులో జాప్యం, పోలీసుల తీరు, ఇతర అంశాల కారణంగా అత్యాచార ఘటనలు దేశంలో ఎన్నో వెలుగులోకి రాలేకపోతున్నాయని బాధితులు చెప్పారు. అత్యాచార ఘటనలపై 'సత్యమేవ జయతే' ద్వారా అమీర్ ఖాన్ స్పందించిన తీరు అన్నివర్గాలను ఆకట్టుకుంది. అధికారులు, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సత్యమేవ జయతే లాంటి కార్యక్రమాలు స్పూర్తిని కలిగిస్తాయని ఆశిద్దాం! -
‘సత్యమేవ జయతే’లో సూర్య
ముంబై: సామాజిక దురాచాలపై చర్చ కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే షోకు సహకరించడానికి దక్షిణాది హీరోలు రెడీ అంటున్నారు. దక్షిణాదిలో బాగా జనాదరణ ఉన్న హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్ ఇది వరకే ఈ షోలో పాలుపంచుకోవడానికి ఒప్పుకున్నారు. లాల్ బాటలో తమిళ నటుడు సూర్య కూడా సత్యమేవ జయతే వేదికపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి హీరోలంతా ఏకమై మనదేశాన్ని వేధిస్తున్న సామాజిక దురాచారాల నిర్మూలనకు కృషి చేయాలని ఆమిర్ కోరాడు. సత్యమేవ జయతేను హిందీలో నిర్మిస్తున్నా, మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగులోనూ అనువందించి ప్రసారం చేస్తారు. పలు సామాజిక అంశాల నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లాల్‌ను ప్రచారకర్తగా నియమించడం వల్ల దక్షిణాదిలో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. షోలో ఆమిర్ లేవనెత్తే పలు అంశాలపై లాల్ మాట్లాడతారు. స్టార్‌టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ మలయాళ హీరో అన్నారు. ఈ కొత్త తరహా షోలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపులంగా చర్చిస్తామని అన్నారు. లాల్, సూర్య వంటి నటులు షోలో కనిపించడం వల్ల ఇది మరింత మందికి చేరుతుందని స్టార్ఇండియా సీఈఓ ఉదయ్‌శంకర్ అన్నారు. దీని రెండో భాగం వచ్చే నెల రెండు నుంచి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. స్టార్ గ్రూపు చానళ్లు స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్, దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతుంది. తెలుగు చానల్ ఈటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు సత్యమేవ జయతేను చూడవచ్చని స్టార్ వర్గాలు తెలిపాయి. -
సూర్య 'సత్యమేవ జయతే'
సామాజిక సమస్యలపై మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎక్కుపెట్టిన అస్త్రం 'సత్యమేవ జయతే'. 'సత్యమేవ జయతే' టెలివిజన్ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్షకుల నుంచే కాకుండా అన్ని వర్గాలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సత్యమేవ జయతే కార్యక్రమం మార్చి 2 తేది ఆదివారం రెండవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమ ప్రమోషన్ కు మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఉపయోగించుకున్న టీవీ షో నిర్వహకులు ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తమిళ సూపర్ స్టార్ సూర్యను రంగంలోకి దించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకున్నాం. అందులో భాగంగానే మలయాళంలో మోహన్ లాల్, తెలుగు ప్రమోషన్ కోసం తమిళ నటుడు సూర్యను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశాం అని నిర్వహాకులు తెలిపారు. తమిళ, తెలుగు ప్రాంతాల్లో సూర్యకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగు బాషల్లో రూపొందుతోంది. ఈ కార్యక్రమ రెండవ సెషన్ మార్చి 2 తేది ఉదయం 11 గంటల నుంచి స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, ఏషియానెట్, స్టార్ ఉత్సవ్, డీడీ చానెల్స్ లో ప్రసారం కానుంది. -
‘సత్యమేవ జయతే..’లో మోహన్‌లాల్
న్యూఢిల్లీ: ఇది వరకే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆమిర్‌ఖాన్ టీవీ షో తేసత్యమేవ జయ తాజా భాగం దక్షిణాదిలోనూ సంచలనం సృష్టించేలా చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే దక్షిణాదిలో బాగా జనాదరణ ఉన్న హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్‌ను రంగంలోకి దింపుతున్నారు. సామాజిక అంశాలు నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లాల్‌ను ప్రచారకర్తగా నియమించడం వల్ల దక్షిణాదిలో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. షోలో ఆమిర్ లేవనెత్తే పలు అంశాలపై లాల్ మాట్లాడుతారు. స్టార్‌టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ మలయాళ హీరో అన్నారు. ఈ కొత్త తరహా షోలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపులంగా చర్చిస్తామని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సత్యమేవ జయతే షో కోసం తీస్తున్న ప్రచార వీడియోల షూటింగ్‌లోనూ లాల్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలాంటి భారీ నటుడు షోలో కనిపించడం వల్ల ఇది మరింత మందికి చేరుతుందని స్టార్ఇండియా సీఈఓ ఉదయ్‌శంకర్ అన్నారు. క్రితం సారి కూడా సత్యమేవ జయతే పలు సామాజిక దురాచారాలు, సమస్యలపై విపులంగా చర్చించి దేశవ్యాప్తంగా సంచనాలను నమోదు చేసింది. ఇక దీని రెండో భాగం వచ్చే నెల రెండు నుంచి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. స్టార్‌గ్రూపు చానెళ్లు స్టార్‌ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్తోపాటు దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతుంది. తెలుగు చానెల్ ఈటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు సత్యమేవ జయతేను చూడవచ్చని స్టార్ వర్గాలు తెలిపాయి. -
'సత్యమేవ జయతే' అమీర్ కు అమెరికా అవార్డు!
'సత్యమేవ జయతే' టెలివిజన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న అమీర్ ఖాన్ ను అమెరిఆక అబ్రాడ్ మీడియా అవార్డుతో సత్కరించారు. తన కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకుగాను అమీర్ ను ఈ అవార్డు వరించింది. అమీర్ తోపాటు అస్కార్ అవార్డునందుకున్న దర్శకుడు కాత్రియాన్ బిగెలో, ఇంటర్నెషనల్ సెంటర్ ఆన్ నాన్ వాయిలంట్ కన్ ఫ్లిక్ట్ (ఐసీఎన్ సీ)లను ఈ అవార్డుతో సత్కరించారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న 'సత్యమేవ జయతే' కార్యక్రమం విదేశాల్లోని ప్రజలను ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉందిన అని అమీర్ ఖాన్ తెలిపారు. నేను, నాజట్టు కార్యక్రమాన్ని విన్నూత్నంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనేక సమస్యల పట్ల అవగాహన ఉంది. సమస్యలకు పరిష్కారం కూడా మావద్ద ఉంది అని అమీర్ అన్నారు. ఎప్పుడూ అవార్డు కార్యక్రమాలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఈ అవార్డును అందుకోవడానికి అమెరికా వెళ్లడం విశేషం. అమీర్ ఖాన్ వెంట ఆయన భార్య, దర్శకురాలు కిరణ్ రావు ఉన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది అని ఆయన తెలిపారు.