'సత్యమేవ జయతే' అమీర్ కు అమెరికా అవార్డు! | Aamir Khan felicitated with US award for 'Satyamev Jayate' | Sakshi
Sakshi News home page

'సత్యమేవ జయతే' ఆమీర్ కు అమెరికా అవార్డు!

Published Tue, Oct 29 2013 6:30 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

'సత్యమేవ జయతే' అమీర్ కు అమెరికా అవార్డు! - Sakshi

'సత్యమేవ జయతే' అమీర్ కు అమెరికా అవార్డు!

'సత్యమేవ జయతే' టెలివిజన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న అమీర్ ఖాన్ ను అమెరిఆక అబ్రాడ్ మీడియా అవార్డుతో సత్కరించారు. తన కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకుగాను అమీర్ ను ఈ అవార్డు వరించింది.  అమీర్ తోపాటు అస్కార్ అవార్డునందుకున్న దర్శకుడు కాత్రియాన్ బిగెలో, ఇంటర్నెషనల్ సెంటర్ ఆన్ నాన్ వాయిలంట్ కన్ ఫ్లిక్ట్ (ఐసీఎన్ సీ)లను ఈ అవార్డుతో సత్కరించారు. 
 
దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్న 'సత్యమేవ జయతే' కార్యక్రమం విదేశాల్లోని ప్రజలను ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉందిన అని అమీర్ ఖాన్ తెలిపారు. నేను, నాజట్టు కార్యక్రమాన్ని విన్నూత్నంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనేక సమస్యల పట్ల అవగాహన ఉంది. సమస్యలకు పరిష్కారం కూడా మావద్ద ఉంది అని అమీర్ అన్నారు. ఎప్పుడూ అవార్డు కార్యక్రమాలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్ ఈ అవార్డును అందుకోవడానికి అమెరికా వెళ్లడం విశేషం. అమీర్ ఖాన్ వెంట ఆయన భార్య, దర్శకురాలు కిరణ్ రావు ఉన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది అని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement