'రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తా'
'సత్యమేవ జయతే' సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే ఓ కళాకారుడిగా సమాజానికి తనకు తోచిన సేవను అందిస్తానని అమీర్ తెలిపారు. అయితే తాను రాజకీయ వేత్తగానో, లేదా సామాజిక కార్యకర్తగానో మారే ఆలోచన లేదని మిస్టర్ ఫర్ ఫెక్ట్ వెల్లడించారు. సమాజానికి తాను చేయాల్సింది తాను చేస్తాను.. అదోక బాధ్యతగా స్వీకరిస్తాను అని అన్నారు.
అంతేకాక రాజకీయాలు తనకు సరిపడవని.. అక్కడ రాణిస్తాననే విశ్వాసం తనకు లేదని అమీర్ తేల్చి చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఐడబ్ల్యూపీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపేదిలేదు అని అన్నారు. అయితే స్వరాజ్ అనే సందేశంతో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై సానుకూలంగా స్పందించారు.