'ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను' | Will never compaing about any political party, says Aamir Khan | Sakshi
Sakshi News home page

'ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను'

Published Fri, Mar 14 2014 3:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను' - Sakshi

'ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను'

ముంబయి : ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయనని, అయితే  ఓటు ఎవరికి వేయాలో అన్నది ఓటరు వ్యక్తిగత విషయమని బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ అన్నారు. ఈ ఏడాది ఏ షూటింగ్స్ చేయబోనన్న ఆమీర్ .. మొత్తం కాల్‌షీట్స్‌ను 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి కేటాయించానన్నారు.

తనపై వచ్చిన అసత్య ఆరోపణల వ్యవహారాన్ని పోలీసులకు అప్పగించానని .. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇవాళ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమీర్‌ ఖాన్ ముంబైలో తన నివాసంలో ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ప్రతి ఏడాది ఆయన తన పుట్టినరోజును మీడియా ప్రతినిధులతో జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఏడాది రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం తన చేతిలో ఏ చిత్రం లేదని అన్నారు. దాంతో తన సమయం అంతా 'సత్యమేవ జయతే'కి కేటాయిస్తానని తెలిపారు. గత సంవత్సరం చాలా బాగా గడిచిందని, ధూమ్-3 విజయవంతం కావటం సంతోషంగా ఉందన్నారు.

పలు సామాజిక అంశాల నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. దీని రెండో భాగం మార్చి నుంచి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. స్టార్ గ్రూపు చానళ్లు స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్, దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement