
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన శ్రమ సువిధ పోర్టల్ను ఆరంభించారు. శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సత్యమేవ జయతే ఎంత శక్తివంతమో ....శ్రమేవ జయతే అంత శక్తిమంతమని ఆయన అన్నారు. దేశంలో ఐటీఐలను పరిపుష్టం చేయాలని మోడీ అభిప్రాయపడ్డారు. శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడికి వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందన్నారు. పాలకులకు మాత్రమే అన్ని తెలుసనుకుంటే అది పొరపాటు అని ఆయన అన్నారు.