ప్రధాని మోడీతో ఆమిర్‌ఖాన్ భేటీ | Aamir Khan meets narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీతో ఆమిర్‌ఖాన్ భేటీ

Published Tue, Jun 24 2014 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రధాని మోడీతో ఆమిర్‌ఖాన్ భేటీ - Sakshi

ప్రధాని మోడీతో ఆమిర్‌ఖాన్ భేటీ

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. బుల్లితెరపై తన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం ద్వారా దేశం ఎదుర్కొంటున్న పలు సామాజిక సమస్యలను ఆమిర్‌ఖాన్ వెలుగులోకి తేవడం తెలిసిందే. మోడీతో భేటీలో ఆయా సామాజిక సమస్యల గురించి ఆయన చర్చించారు. భేటీ అనంతరం ఆమిర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను లేవనెత్తిన పలు సమస్యలపై దృష్టి పెడతానని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. తనకోసం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నరేంద్ర మోడీతో ఆమిర్‌ఖాన్ సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అభివర్ణించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement