కంటతడి పెట్టిన అమీర్ ఖాన్!
భావోద్వేగానికి ఎవరూ అతీతులు కారని అమీర్ ఖాన్ తాజా ఉదంతంతో వ్యక్తమైంది. సత్యమేవ జయతే కార్యక్రమం ప్రోమో విడుదల సందర్భంగా భావోద్వేగానికి లోనైన అమీర్ ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. సత్యమేవ జయతే సీజన్-3 ప్రోమోను ముంబైలో బుధవారం విడుదల చేశారు.
మూడవ భాగం కోసం అమీర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా స్వయంగా కూడా ప్రజలతో అనుభవాల్ని పంచుకున్నారు. మూడవ భాగం కోసం షూట్ చేసిన అనుభావాల్ని పంచుకునే క్రమంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
సత్యమేవ జయతే మూడవ ఎడిషన్ సెప్టెంబర్ 21 తేదిన ప్రసారం కానుంది. ప్రతి ఆదివారం స్టార్ ప్లస్ టెలివిజన్ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. భారతీయ సమాజంలో సమస్యలపై ప్రసారం చేసిన కథనాలకు గత రెండు ఎడిషన్లలో భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే.