సూర్య 'సత్యమేవ జయతే'
సూర్య 'సత్యమేవ జయతే'
Published Thu, Feb 27 2014 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
సామాజిక సమస్యలపై మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎక్కుపెట్టిన అస్త్రం 'సత్యమేవ జయతే'. 'సత్యమేవ జయతే' టెలివిజన్ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్షకుల నుంచే కాకుండా అన్ని వర్గాలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సత్యమేవ జయతే కార్యక్రమం మార్చి 2 తేది ఆదివారం రెండవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమ ప్రమోషన్ కు మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఉపయోగించుకున్న టీవీ షో నిర్వహకులు ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తమిళ సూపర్ స్టార్ సూర్యను రంగంలోకి దించారు.
ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకున్నాం. అందులో భాగంగానే మలయాళంలో మోహన్ లాల్, తెలుగు ప్రమోషన్ కోసం తమిళ నటుడు సూర్యను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశాం అని నిర్వహాకులు తెలిపారు. తమిళ, తెలుగు ప్రాంతాల్లో సూర్యకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.
ఇప్పటికే అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగు బాషల్లో రూపొందుతోంది. ఈ కార్యక్రమ రెండవ సెషన్ మార్చి 2 తేది ఉదయం 11 గంటల నుంచి స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, ఏషియానెట్, స్టార్ ఉత్సవ్, డీడీ చానెల్స్ లో ప్రసారం కానుంది.
Advertisement
Advertisement