
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గజిని. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్ అయి ఇక్కడ కూడా విజయం సాధించింది. గజినినీ తెలుగులో రిలీజ్ చేసిన అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీలో నిర్మించారు అక్కడ కూడా గజిని సూపర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
గజిని సినిమాను తెలుగు, హిందీలలో నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై గజిని 2 టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. సీక్వెల్‌లో నటించేందుకు ఆమిర్ కూడా ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడెవరన్న విషయం తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment