Ghajini movie
-
ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజినీ సినిమా మీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు మతిమరుపునే కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ ఆసిన్. కల్పనా శెట్టి పాత్రలో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. తమిళం, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది. (ఇది చదవండి: నారాయణతో సుధాకర్‌కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి) ఆ తర్వాత గజినీతో పాటు రెడీ, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు.. చివరిసారిగా 2015లో ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన భామ.. చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై గజినీ భామ స్పందించింది. తనపై డైవర్స్ వార్తలకు చెక్ పెట్టింది ఆసిన్. వివరణ ఇస్తూ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్సో ఓ నోట్ రాసుకొచ్చింది. తాను ప్రస్తుతం భర్త రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ఆసిన్ ఇన్‌స్టా స్టోరీలో రాస్తూ..' రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నా. మాపై చాలా వార్తలు పూర్తిగా నిరాధారం. ఈరోజు మేమిద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాం. మేం విడిపోతున్నామనే ఒక బేస్ లెస్ వార్త విన్నా. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. దయచేసి వినండి. ఇప్పుడు దీని కోసం కూడా 5 నిమిషాల అద్భుతమైన సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆసిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది గజినీ భామ. (ఇది చదవండి: ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్) రూమర్స్‌కు కారణమిదే.. అసిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కటి మినహా రాహుల్‌తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించింది. దీంతో డైవర్స్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా తొలగించింది. ఇన్‌స్టాలో ఆమె చివరి పోస్ట్ కుమార్తె అరిన్ ఐదో పుట్టినరోజు సందర్బంగా అక్టోబర్ 2022లో చేసింది. ఇంతవరకు ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అంతే కాకుండా ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో ఉన్న ఒక ఫోటోను మాత్రమే ఉంచింది. -
‘గజిని 2’ తెరకెక్కనుందా.?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గజిని. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్ అయి ఇక్కడ కూడా విజయం సాధించింది. గజినినీ తెలుగులో రిలీజ్ చేసిన అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీలో నిర్మించారు అక్కడ కూడా గజిని సూపర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజిని సినిమాను తెలుగు, హిందీలలో నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై గజిని 2 టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. సీక్వెల్లో నటించేందుకు ఆమిర్ కూడా ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడెవరన్న విషయం తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ వచ్చే అవకాశం ఉంది. -
కళ్లు తెరిచి స్వప్నమే కన్నా
పదం పలికింది – పాట నిలిచింది ప్రేమించిన అమ్మాయి కళ్ల ఎదురుగా నిలబడటం కొన్నిసార్లు కల లాంటిదే కదా! మరి కల, రాత్రి మాత్రమే వచ్చేది. కళ్లు మూసుకుంటే తప్ప కల రాదు. కానీ ఆ కల లాంటి అమ్మాయి కళ్లముందు కనబడ్డప్పుడు కళ్లు తెరిచి కల కన్నట్టే కదా! ఇంత అందమైన భావాన్ని ‘గజిని’ చిత్రంలోని– ‘హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ’ పాటలో పలికించారు గీత రచయిత వెన్నెలకంటి. ‘చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్లు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్లు తెరిచి స్వప్నమే కన్నా’ అని రాశారాయన. ఇంకా ముందుకు వెళ్లి– ‘కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా నీ కళ్లే వాడిపోని పూవులమ్మా’ అని మరో అందమైన పోలిక కూడా తెచ్చారు. 2005లో వచ్చిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడారు. సూర్య, అసిన్ నటించారు. దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. -
గజిని
ఆ సీన్ - ఈ సీన్ కాపీ కొట్టడం అంటే సొంతంగా ఆలోచించలేని వాళ్లు, చేతగాని వ్యక్తులు చేసే పని అనుకొంటుంటాం. అయితే కాపీ కొట్టడంలో కూడా కొందరు తామెంత సమర్థులమో రుజువు చేసుకొంటూ ఉంటారు. ఒకటికాదు... అనేక సినిమాలను కాపీలు కొట్టి వీరు స్టిచ్ చేసే కొత్త సినిమాను చూసిన ఎవ్వరైనా అబ్బురపడాల్సిందే. అయితే ‘ఏం తీశాడురా...’ అనకూడదు. ‘ఏం కాపీ కొట్టాడురా...’ అని ప్రశంసించాలి. ఇలాంటి ప్రశంసకు అర్హులైన వారిలో తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఒకరు. సూర్య హీరోగా, అసిన్, నయనతారలు హీరోయిన్లుగా వచ్చిన తమిళ సినిమా ‘గజిని’ డబ్బింగ్ వెర్షన్‌ను చూసి తెలుగువారు ముగ్ధులయ్యారు. ‘అప్పటికప్పుడు అన్ని విషయాలను మరచిపోయే లక్షణాలున్న ‘ఆంటెరోగ్రేడ్ అమ్నేసియా’ అనే అరుదైన జబ్బుతో బాధపడే హీరో తన ప్రియురాలిని కిరాతకంగా చంపేసిన వారిపై ప్రతీకారం తీర్చుకొనే వైనమే ఈ సినిమా. వ్యాధి కారణంగా ఎవరు ఏమిటో... ఎవరెలాంటివారో గుర్తుంచుకొనే శక్తి లేని ఆ హీరో జరిగిన సంఘటనలను తన ఒంటిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంటూ ఉంటాడు.’ నిజంగా చాలా వైవిధ్యమైన కథ. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ రానటువంటి వైవిధ్యమైన సినిమా - అని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొన్న సినిమా గజిని. నిజమే ఇలాంటి సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. కానీ అచ్చం ఇలాంటి సినిమా విదేశీ తెరలపై ఆడి ంది. దాని పేరు ‘మెమెంటో’. భారతీయ భాషల్లో ‘గజిని’ పేరుతో తమిళంలో రూపొంది, తెలుగులోకి డబ్ అయి, హిందీలోకి రీమేక్ అయి సూపర్‌హిట్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘మెమెంటో’ సినిమా 2000 లో విడుదలయింది. మరో ఐదేళ్ల తర్వాత దాని స్ఫూర్తితో మురగదాస్ గజిని తీశాడు. ‘లియొనార్డో షెల్బీ ప్రముఖ వ్యాపారవేత్త. కొంతమంది దుండగులు అతడి భార్యను అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ సమయంలో వారితో తలపడ్డ హీరోని తీవ్రంగా కొడతారు. ఇతడి మెదడుకు గాయమై ‘ఆంటెరోగ్రేడ్ అమ్నేసియా’ బారిన పడతాడు. దీని వల్ల జ్ఞాపకశక్తి సమస్య ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల మధ్య కూడా జరిగిన ఘాతుకాన్ని ఆయన మరచిపోలేడు. ‘షీ వాజ్ రేప్డ్ అండ్ మర్డర్డ్’ అంటూ ఛాతీమీద పచ్చబొట్టు పొడిపించుకొని ఆ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతాడు’. చివరకు వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు- అదీ ‘మెమెంటో’ కథ. భార్య స్థానంలో ప్రియురాలు! నోలన్ రూపొందించిన ‘మెమెంటో’ సినిమాకు మురగదాస్ తీసిన ‘గజిని’కి తేడా ఏమిటంటే... హాలీవుడ్ సినిమాలో హీరో భార్యను చంపుతారు, మన వెర్షన్లో హీరోయిన్ అసిన్ హీరో సూర్యకు ప్రియురాలు మాత్రమే! హీరో మెమొరీకి సంబంధించి ఎదుర్కొనే జబ్బు కామన్. మనుషులను గుర్తుంచుకోవడానికి వారి ఫొటోలు తీసుకొని వాటి వెనుక వారి గురించి రాసుకోవడమూ కామన్, ఒంటిపై పచ్చబొట్టులు కూడా కామనే! ప్రేమకు మూలం మరో సినిమా! మూలకథను ‘మెమెంటో’ నుంచి తెచ్చుకొన్న దర్శకుడు సూర్య, అసిన్‌ల మధ్య నడిచే ప్రేమకు మూలం మరో సినిమా. ఓ అనామక అమ్మాయి పేరున్న వ్యాపారవేత్తను తన ప్రియుడని ప్రకటించుకోవడం, అతడిని ఒక్కసారి కూడా చూడకనే తామిద్దరం లవ్‌లో ఉన్నామని చెప్పుకొంటూ తన చుట్టూ ఉన్న వాళ్లని ఫూల్స్‌గా చేయడం, ఆ వ్యవహారం సదరు వ్యాపారవేత్తవరకూ వెళ్లడం... దీనిపై ఎంతో కోపంతో ఆమెను వెదుక్కొంటూ వచ్చిన ఆ బిజినెస్‌మ్యాన్ ఆ ఫస్ట్మీట్లోనే ఆమె ప్రేమలో పడిపోవడం. ఈ కథ బ్రిటిష్ సినిమా ‘హ్యాపీ గో లవ్లీ’ సినిమాది. ఒక పాత తెలుగు సినిమాలో కూడా ఇదే కథను యథాతథంగా వాడుకొన్నారు. మురుగ మరోసారి వాడారు... అంతే! ఇలా ఒక సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాను, ఒక రొమాంటిక్ కామెడీని సగం సగంగా కత్తిరించుకొని కొత్త కథగా స్టిచ్ చేసుకొని మూడు భాషల ఇండస్ట్రీలో సూపర్‌హిట్‌ను నమోదు చేసిన ఘనత దర్శకుడు మురగదాస్ది. అసలు కథ ‘మెమెంటో’ది అయితే, ఉపకథ ‘హ్యపీ గో లవ్లీ’ ది. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్లను కూడా వివిధ సినిమాల నుంచి కాపీ కొట్టారు. అందులో ప్రముఖంగా చెప్పుకోదగినది ఒక అంధ వ్యక్తిని అసిన్ రోడ్డుపై తీసుకెళ్లే సీన్. గజిని సినిమా అభిమానులను బాగా ఇంప్రెస్ చేసిన సీన్ ఇది. ‘ఎమిలీ’ అనే ఒక ఫ్రెంచ్ సినిమాలోని సీన్‌ను గజినిలో దించేశారు! - బి.జీవన్‌రెడ్డి