Asin Reacts To Divorce Rumours With Husband Rahul Sharma, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Asin Divorce Rumours: ఐదు నిమిషాలు వేస్ట్.. విడాకులపై ఆసిన్ ఆగ్రహం!

Jun 28 2023 12:16 PM | Updated on Jun 28 2023 2:42 PM

Asin reacts to divorce rumours with husband Rahul Sharma - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజినీ సినిమా మీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు మతిమరుపునే కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ ఆసిన్. కల్పనా శెట్టి పాత్రలో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. తమిళం, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది. 

(ఇది చదవండి:  నారాయణతో సుధాకర్‌కి బ్రేక్‌ వస్తుంది: అనిల్‌ రావిపూడి)

ఆ తర్వాత గజినీతో పాటు రెడీ, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు.. చివరిసారిగా 2015లో ఆల్‌ ఈజ్‌ వెల్‌ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో   మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన భామ.. చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై గజినీ భామ స్పందించింది. 

తనపై డైవర్స్ వార్తలకు చెక్ పెట్టింది ఆసిన్. వివరణ ఇస్తూ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌సో ఓ నోట్ రాసుకొచ్చింది. తాను ప్రస్తుతం భర్త రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. 

ఆసిన్ ఇన్‌స్టా స్టోరీలో రాస్తూ..' రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నా. మాపై చాలా వార్తలు పూర్తిగా నిరాధారం. ఈరోజు మేమిద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాం. మేం విడిపోతున్నామనే ఒక బేస్ లెస్ వార్త విన్నా. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. దయచేసి వినండి. ఇప్పుడు దీని కోసం కూడా 5 నిమిషాల అద్భుతమైన సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆసిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది గజినీ భామ. 

(ఇది చదవండి: ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్)

రూమర్స్‌కు కారణమిదే..
అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కటి మినహా రాహుల్‌తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించింది. దీంతో డైవర్స్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా తొలగించింది. ఇన్‌స్టాలో ఆమె చివరి పోస్ట్ కుమార్తె అరిన్ ఐదో పుట్టినరోజు సందర్బంగా అక్టోబర్ 2022లో చేసింది. ఇంతవరకు ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అంతే కాకుండా ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో ఉన్న ఒక ఫోటోను మాత్రమే ఉంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement