‘నువ్వింత తొందరగా ఎదుగుతున్నావ్‌ ఎందుకు’ | Asin Rahul Sharma Shares Their Daughter Pictures For The First Time | Sakshi
Sakshi News home page

‘నువ్వింత తొందరగా ఎదుగుతున్నావ్‌ ఎందుకు’

Published Fri, Oct 26 2018 10:26 AM | Last Updated on Fri, Oct 26 2018 11:02 AM

Asin Rahul Sharma Shares Their Daughter Pictures For The First Time - Sakshi

2016లో వివాహ బంధంతో ఒక్కటైన నటి ఆసిన్‌, రాహుల్‌ శర్మ దంపతులు గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

సుమారు సంవత్సర కాలంగా తమ కూతురికి సంబంధించిన విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచుతున్న ఆసిన్‌- రాహుల్‌ శర్మ దంపతులు ఎట్టకేలకు తన ఫొటోలను షేర్‌ చేశారు. అంతేకాదు ఆమె పేరును కూడా వెల్లడించారు. ‘ఏడాది క్రితం మా ప్రపంచంలోకి అందమైన, తేజోవంతమైన రాకుమారిని ఆహ్వానించాం. ఈరోజు తను తొలి వసంతంలో అడుగుపెట్టింది. నా చిట్టితల్లి ఆరిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వింత తొందరగా ఎందుకు ఎదుగుతున్నావ్‌ బంగారం’ అంటూ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మైక్రోమాక్స్‌ సహ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త రాహుల్‌ శర్మ తన కూతురికి శుభాకాంక్షలు తెలిపారు. 2016లో వివాహ బంధంతో ఒక్కటైన నటి ఆసిన్‌, రాహుల్‌ శర్మ దంపతులు గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా తొలిసారిగా తన ఫొటోలను చేయడంతో పాటు, ఆమె పేరు ఆరిన్‌ అంటూ అభిమానులకు ఆనందాన్ని పంచారు.

కాగా దక్షిణాదిన అగ్రనాయకిగా పేరొందిన ఆసిన్‌, గజినీ హిందీ రీమేక్‌ ద్వారా బాలీవుడ్‌ జనాల దృష్టిని ఆకర్షించారు. అయితే గజినీ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా విజయం సాధించలేదు. బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ స్థాయికి చేరుకోలేకపోయిన ఆసిన్‌... సహ నటుడు అక్షయ్‌ కుమార్‌ ద్వారా వ్యాపారవేత్త రాహుల్‌ శర్మ రూపంలో లైఫ్‌ పార్ట్‌నర్‌ను పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement