పదం పలికింది – పాట నిలిచింది
ప్రేమించిన అమ్మాయి కళ్ల ఎదురుగా నిలబడటం కొన్నిసార్లు కల లాంటిదే కదా! మరి కల, రాత్రి మాత్రమే వచ్చేది. కళ్లు మూసుకుంటే తప్ప కల రాదు. కానీ ఆ కల లాంటి అమ్మాయి కళ్లముందు కనబడ్డప్పుడు కళ్లు తెరిచి కల కన్నట్టే కదా! ఇంత అందమైన భావాన్ని ‘గజిని’ చిత్రంలోని–
‘హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ’ పాటలో పలికించారు గీత రచయిత వెన్నెలకంటి.
‘చూపులకై వెతికా చూపుల్లోనే బతికా
కళ్లు తెరిచి స్వప్నమే కన్నా
తొలిసారీ... కళ్లు తెరిచి స్వప్నమే కన్నా’ అని రాశారాయన.
ఇంకా ముందుకు వెళ్లి–
‘కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా
నీ కళ్లే వాడిపోని పూవులమ్మా’ అని మరో అందమైన పోలిక కూడా తెచ్చారు.
2005లో వచ్చిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడారు. సూర్య, అసిన్ నటించారు. దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్.
Comments
Please login to add a commentAdd a comment