'ఓ ఎంపీ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు' | Criminalisation of politics in Bihar, Ajit Sarkar murder | Sakshi
Sakshi News home page

'ఓ ఎంపీ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు'

Published Tue, Apr 8 2014 3:41 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

'ఓ ఎంపీ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు' - Sakshi

'ఓ ఎంపీ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు'

66 క్రితం దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టే ముందు ఏ లక్ష్యం కోసం మహాత్ములు పోరాటం చేశారో.. నేరపూరిత రాజకీయాల కారణంగా ఆ లక్ష్యానికి దూరంగా పోతున్నామనే ఓ సంఘటనను చూస్తే అర్ధమవుతుంది. 
 
ఓ ఫ్రోఫెషనల్ షూటర్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఎంపీ కావడానికి ముందు ఓ జర్నలిస్ట్ తో మాట్లాడిన విషయాన్నిఇటీవల 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో అమీర్ వెల్లడించారు.  ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నేరాలతో సంబంధమున్నవ్యక్తులు ప్రవేశించడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే విషయాలను కొన్ని ఆసక్తికరమైన అంశాలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ వెలుగులోకి తెచ్చారు. 
 
జర్నలిస్ట్ తో షూటర్..
 
చాలా రోజుల నుంచి మీడియాలో వార్తలు రావడం లేదు.. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. నాగురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎవర్నైనా హత్య చేయాల్సిందే.. నాగురించి పేపర్లో రావాల్సిందే. మార్కెట్లో తన ఇమేజ్ పెరగాలంటే ఎదో ఒక హత్య చేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో నేను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలువాల్సిందే అని ఓ షూటర్ చెప్పాడని  వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల దేశ రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల దేశ ప్రతిష్ట భ్రష్టుపడుతుందనే  విషయాన్ని ఓటర్లకు చెప్పేందుకు, దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అమీర్ ఖాన్ సమాజంలోని కొందరు అధికారులు, ఇతర వ్యక్తులతో మాట్లాడించారు. 
 
ఎంపీ అజిత్ సర్కార్ హత్య!
 
ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం నిస్వార్ధంగా పాటుపడే వ్యక్తులకు ప్రస్తుత నేరపూరిత సమాజంలో స్థానం లేదనే స్సష్టమవుతోంది. పేద ప్రజలందరికి తలదాచుకోవడానికి సొంత ఇళ్లు నిర్మించడానికి జీవితాన్ని త్యాగం చేసిన ఓ ప్రజా ప్రతినిధి కథ తెలుసుకుంటే.. గుండె ఆర్దతతో నిండిపోవాల్సిందే.  14 జూన్ 1998 అజిత్ సర్కార్ దారుణ హత్యకు గురయ్యాడు. అంటే 15 సంవత్సరాల తర్వాత కూడా అజిత్ సర్కార్ ప్రజల హృదయాల్లో తలదాచుకున్నారు. పూర్ణియా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు దేవుడిగా భావించిన నేత.. ఓ దీపమని.. దుర్మార్గులు ప్రజలకు వెలుగునిచ్చే దీపాన్ని ఆర్పేశారని కులమతాలకు అతీతంగా ఆయన అభిమానుల, కార్యకర్తలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బీహార్ లోని పుర్ణియా నియోజకవర్గంలో అజిత్ సర్కార్ 15 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా.. సొంత ఇంటి నిర్మించుకోలేకపోయారని ఆయన కుమారుడు అమిత్ సర్కార్ కొన్ని విషయాలను వెల్లడించారు. తన తల్లి టీచర్ గా పనిచేయడం వల్ల వచ్చే ఆదాయంతోనే తమ జీవితం గడిచేదని అమిత్ తెలిపారు. 'పూర్ణియా నియోజకవర్గంలో భూస్వాములు, పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న అక్రమిత భూముల్ని పేద ప్రజలకు పంచడానికి ఉద్యమం చేపట్టారు. కొడుకు, కూతురు, ఇతర బినామీలతోపాటు, పెంపుడు జంతువులపై ఉన్న భూములను పేద ప్రజలకు పంచడంతో అజిత్ సర్కార్ పై కక్ష పెంచకున్నారు. తమ అక్రమ వ్యవహారాలకు అడ్డుగా నిలిచిన అజిత్ సర్కార్ ను పప్పుయాదవ్ అనే నేరస్థుడు కాల్చి చంపాడు.  అజిత్ సర్కార్ శరీరంలో 107 బుల్లెట్స్ దించారు అని అమిత్ తెలిపారు. 107 బుల్లెట్స్ శరీరంలో దిగినా తన తండ్రి ముఖంలో చిరునవ్వు చెరగలేదని.. అదే మాకు స్పూర్తి ఇస్తుందని అమిత్ తెలిపారు.  అజిత్ సర్కార్ హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయినా.. నిందితుడికి ఎలాంటి శిక్ష పడలేదని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సురాజ్యం, పేద ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం నేతల ఎన్నుకోవడం ఓటరుపై బాధ్యత ఉందని ఆమీర్ తెలిపారు. నేరపూరిత రాజకీయ నేతలను ఎన్నికల్లో ఓడించడం ద్వారా  మహాత్ములు కలలు కన్న భారతాన్ని సాధించవచ్చని అమీర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement