చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో హిందూనేతల హత్యలు పెరిగిపోతున్నాయి. 2011 నుంచి వరుసగా హిందూ నేపథ్యం కలిగిన సంస్థల నేతల హత్యలు సాగుతూనే ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారంలో భాగంగా 2011 అక్టోబర్ 28న భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వాని సాగే మార్గంలో పైప్ బాంబును కనుగొన్నారు. 2012 అక్టోబర్ 24వ తేదీన వైద్యవిభాగం సెల్ రాష్ట్ర అధ్యక్షులు అరవింద్‌రెడ్డి వేలూరులో దారుణ హత్యకు గురయ్యారు. గత ఏడా ది మార్చి 19వ తేదీ బీజేపీ మాజీ కౌన్సిలర్ పరమకుడి మురుగన్, జూన్ 26వ తేదీన మధురైలో పాలవ్యాపారి సురేష్‌లను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.
జూలై 1వ తేదీ హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, 19న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆడిటర్ రమేష్ సేలంలో హత్యకు గురయ్యారు. హిందూ మున్నని నేతలు మరికొందరు దుండగుల చేతిలో బలయ్యారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న పోలీస్ ఫక్రుద్దీన్, ప న్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్‌లను అరెస్ట్ చేశా రు. ఈ ముఠాలో సభ్యుడైన అబూబకర్ సిద్దిక్ పోలీ సులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
రాష్ట్రంలో ఉద్రిక్తకు దారితీసిన ఈ హత్యలను ఇతర కేసులతో కలపకుండా త్వరితగతిన విచారించేందు కు ప్రత్యేక కోర్టును నెలకొల్పబోతున్నారు. కోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన గెజి ట్‌లో ప్రకటించింది. పూందమల్లిలోని టాడా కోర్టు పరిసరాల్లోనే ఈ కోర్టును కూడా ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. కేసుల్లో వాదోపవాదాలను వేగి రం ముగించి నేరస్తులకు త్వరగా శిక్ష విధించేలా చ ర్యలు చేపట్టనున్నారు.
‘హిందూ’ కేసులకు ప్రత్యేక కోర్టు
Published Fri, Aug 22 2014 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement